వాదన/Claim: వరదలతో నిండిన బెంగళూరు రహదారిపై నిప్పురవ్వలతో కూడిన విద్యుత్ స్తంభాన్ని వీడియోలో చూపుతూ,ప్రభుత్వం వద్ద డబ్బులు లేవా? అంటూ ఒక వాదన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

నిర్ధారణ/Conclusion: తప్పుగా చూపించే ప్రయత్నం. వరదలతో నిండిన రహదారిపై నిప్పురవ్వలతో కూడిన విద్యుత్ స్తంభం పడి ఉన్న ఘటన వియత్నాం లో జరిగినది, బెంగళూరులో జరిగినది కాదు.

రేటింగ్/Rating: తప్పుగా చూపించే ప్రయత్నం —

వాస్తవ పరిశీలన పూర్తి వివరాలను వీడియోలో చూడటానికి కింది చిత్రంపై క్లిక్ చేయండి.

లేదా దిగువ కథనాన్ని చదవండి.

************************************************************************

వర్షపు నీటితో రోడ్లు ప్రవహించాయని, వరదల మధ్యలో అకస్మాత్తుగా విద్యుత్తు మెరుపులు కనిపిస్తున్నాయని పేర్కొంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో బెంగళూరు సర్కిల్‌లలో షేర్ అవుతోంది. వాహనాలు, ద్విచక్ర వాహనాలు వెళ్లే సమయంలో కూడా మంటలు చాలా సేపు అలాగే ఉన్నాయి.

తత్నాల్ హిందూ సేన ద్వారా షేర్ చేయబడిన దావా కన్నడలో ఇలా ఉంది: “ಬ್ರಾಂಡ್ ಬೆಂಗಳೂರು ಬಿಸಿ ನೀರು ಭಾಗ್ಯ ಅಷ್ಟೇ…. ಯಾರಿಗೆ ಏನಾದ್ರೆ ನಮಗೇನು ಅಂತಿದೆ ಕಾಸಿಲ್ಲದ ಸರ್ಕಾರ.. “తెలుగు అనువాదం ఇలా ఉంది: “బ్రాండ్ బెంగళూరుకు వేడి నీరు అందడం అదృష్టం. డబ్బులేని ప్రభుత్వం, ఇతరులకు ఏమి జరిగినా పట్టించుకోమని అంటుంది.

వర్షాకాలంలో భారీ వర్షాలు కురిసినప్పుడు నగరంలో విద్యుత్ స్తంభాల నిర్వహణకు కర్ణాటక ప్రభుత్వం దగ్గర డబ్బు లేదనే సందర్భంలో ఈ వాదన చేయబడింది.

ఇదే విధమైన దావాను ఇక్కడ చూడవచ్చు.

వాస్తవ పరిశీలన

మేము వీడియో యొక్క కీలక ఫ్రేమ్‌లను తీసుకొని Google రివర్స్ ఇమేజ్ శోధనను నిర్వహించగా, వియత్నామీస్ వార్తల వెబ్‌సైట్ AFamily.vn ద్వారా నిర్వహించబడిన అసలైన(ఒరిజినల్) వీడియోను ఇక్కడ కనుగొన్నము.

అక్టోబర్ 16, 2024న వియత్నామీస్ వార్తా సైట్ ప్రచురించిన నివేదిక, “తెగిన ఎలక్ట్రిక్ వైర్ వర్షం నీళ్లు పారుతున్న రోడ్డుపైకి పడిపోతున్న ప్రమాదకరమైన క్లిప్,నిప్పు రవ్వలు/స్పార్క్స్ ప్రతిచోటా ఎగసిపడుతున్నాయి: కొంతమంది వ్యక్తుల చర్యలు ఆందోళన కలిగిస్తున్నాయి.” ఒక అరబిక్ యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేయబడిన ఇలాంటి వీడియోను ఇక్కడ చూడండి: “వియత్నాంలో వరదల కారణంగా, విద్యుత్ స్తంభం వరద నీటిలో పడిపోయింది”

వియత్నాంలోని కాన్ థో నగరంలో అక్టోబర్ 14, 2024న తీవ్రమైన వరదలు సంభవించాయని, దీని వల్ల ఉరుము పడిన సమయంలో హై-వోల్టేజ్ లైన్ తెగిపోయి వరదలు వచ్చిన రహదారిపై పడిందని, మరియు విద్యుత్ తీగ చాలా సేపటి వరకు స్పార్క్‌లను వెదజల్లుతూనే ఉందని వియత్నాంలోని వార్తా నివేదిక పేర్కొంది.

అందువల్ల, వీడియోలో కనిపించిన సంఘటన వియత్నాంలో జరిగింది, భారతదేశంలోని బెంగళూరు నగరంలోని సంఘటన కాదు.

మరి కొన్ని వాస్తవ పరిశీలన  కధనాలు:

మాల్దీవుల నుంచి 28 దీవులను భారత్ కొనుగోలు చేసిందా? వాస్తవ పరిశీలన

VP నామినీ J.D. వాన్స్ పేరు ప్రకటించినప్పుడు US రిపబ్లికన్ కన్వెన్షన్‌లో ‘ఇండియా-ఇండియా’ అన్న నినాదాలు వినిపించాయా? వాస్తవ పరిశీలన

 

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.

Exit mobile version