వాదన/Claim: లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత  హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవి లత ముస్లింలపై తన వైఖరిని మార్చుకున్నారని,”భారతీయ ముస్లింలు ఉగ్రవాదులు కాలేరు అని” ఆమె అన్నారనేది వాదన.

నిర్ధారణ/Conclusion: తప్పుడు వాదన. మాధవి లత ఎన్నికల ప్రచార సమయంలో ఈ మాటలు అన్నారు, తన ఓటమి తర్వాత కాదు.

రేటింగ్: తప్పుగా చూపించే ప్రయత్నం —

********************************************************************

వాస్తవ పరిశీలన వివరాలు:

2024 లోక్‌సభ ఎన్నికలలో AIMIM నాయకుడు అసదుద్దీన్ ఒవైసీ చేతిలో ఓడిపోయిన తర్వాత, హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవి లత “భారతీయ ముస్లింలు ఉగ్రవాదులు కాలేరు అని”నొక్కిచెప్పిన వీడియో వైరల్ అవుతోంది.

 

ప్రచారం సమయంలో,మాధవి లత తను చేసిన ముస్లిం వ్యతిరేక వ్యాఖ్యలకు మరియు ఒక బూత్‌లో కనిపించి,అక్కడి మహిళా ముస్లిం ఓటర్లను వారి బురఖాలను ఎత్తివేయమని,వారి గుర్తింపును చూపించాలని డిమాండ్ చేసినందుకు విమర్శలను ఎదురుకొన్నారు.

ఓటమి తర్వాత ఆమె మాటతీరులో మార్పు వచ్చిందని తాజా వీడియో పేర్కొంది.”భారతీయ ముస్లింలు టెర్రరిస్టులు కాలేరు” అని ఆమె చేసిన ప్రకటనకు క్రింది దావా/వాదన ఆపాదించబడింది.  హిందీలో దావా/వాదన ఈ విధంగా ఉంది:”चुनाव हारते ही जिज्जी को अकल आ गई”[ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆమెకు తెలివి వచ్చింది”]

అసలు వాస్తవం ఏమిటి

Digiteye India బృందం వాట్సాప్‌లో అభ్యర్థనను అందుకుని వాస్తవాన్ని పరిశీలించగా ఏప్రిల్ 22, 2024న యూట్యూబ్ లో హైదరాబాద్ ఫెస్టివల్స్ అప్‌లోడ్ చేసిన అసలైన పోస్ట్‌ను గమనించాము. ఇది ‘హైదరాబాద్ బీజేపీ మాధవి లత ఇంటర్వ్యూ’ అనే శీర్షికతో ఉన్న ఒక ఇంటర్వ్యూలోని భాగం మరియు ఎన్నికల ప్రచారం ఊపందుకుంటున్న సమయంలో ఈ వీడియో తీయబడింది, జూన్ 4, 2024న లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత కాదు. పోలింగ్‌లో హైదరాబాద్ మే 13, 2024న జరిగింది.

ఈ వీడియోలో ఆమె పలు అంశాలపై స్పదించారు మరియు, ముస్లింలు ఉగ్రవాదులా అని అడిగినప్పుడు, భారతీయ ముస్లింలు ఉగ్రవాదులు కాలేరు, అది సాధ్యం కాదని ఆమె అన్నారు, “అయితే పేదరికంతో బాధపడే పిల్లలు, మతం పేరుతో రెచ్చగొట్టబడతారు, వారి మనస్సు ఏ దిశలో వెళ్తుంది? నేను ఏమి చెప్పగలను?” అని ఆమె వివరించారు.

మరి కొన్ని వాస్తవ పరిశీలన కథనాలు :

2024 లోక్ సభ ఎన్నికల్లో ఓడిపోయిన కారణంగా నవనీత్ రానా ఈ వీడియోలో ఏడుస్తూ కనిపిస్తున్నారా? వాస్తవ పరిశీలన

రేపటి నుంచి ఉచిత విద్యుత్ సబ్సిడీ ఆగిపోతుందని ఢిల్లీ మంత్రి అతిషి వెల్లడించారా? వాస్తవ పరిశీలన

 

 

 

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.

Exit mobile version