CLAIM/ దావా: చైనీస్ ఫ్యాక్టరీలలో బియ్యం తయారీకి ప్లాస్టిక్‌ను ఎలా ఉపయోగిస్తున్నారో అనే వీడియో వైరల్ అయ్యింది.

CONCLUSION/నిర్ధారణ:వీడియోలో చేసిన దావా తప్పు. “ప్లాస్టిక్ బియ్యం” యొక్క తయారీని చూపించడానికి ఏవో కొన్నివీడియోలు మరియు చిత్రాలు ఉపయోగించబడ్డాయి. వాస్తవానికి, ఫోర్టిఫీడ్ రైస్ ఉత్పత్తిని చూపించే అనేక వాస్తవ వీడియోలు తప్పుడు దావాకు మద్దతు ఇవ్వడానికి ఉపయోగించబడ్డాయి. FSSAI కూడా బియ్యంలో ప్లాస్టిక్ ఉందని లేదా అవి ప్లాస్టిక్ బియ్యమనే వాదనని తోసిపుచ్చారు.

Rating: Misrepresentation –

Fact Check వివరాలు:

వాట్సాప్‌లో ఓ వీడియో విస్తృతంగా ప్రచారం అవుతోంది. ఫ్యాక్టరీలలో బియ్యం తయారీకి ప్లాస్టిక్‌ను ఎలా వినియోగిస్తున్నారో చూపుతున్నట్లు వైరల్‌ వీడియో పేర్కొంది.ఫ్యాక్టరీలలో బియ్యం తయారు చేయడానికి శుభ్రమైన ప్లాస్టిక్ మరియు వ్యర్థ ప్లాస్టిక్‌ను కూడా ఉపయోగిస్తారని పేర్కొంది. మొదట, ప్లాస్టిక్‌ను కడిగి, సన్నని తీగలుగా తయారు చేసి, బియ్యంను గింజలుగా విభజించే ప్రక్రియని చూపిస్తుంది.

వాట్సాప్‌లో వైరల్ వీడియో యొక్క వాస్తవం పరిశీలన చేయమని Digiteye Indiaకి తమిళంలో ఈ అభ్యర్థన వచ్చింది.

FACT CHECK

వీడియోను అనేక కీఫ్రేమ్‌లుగా విభజించడానికి Digiteye India బృందం వారు inVID-(video verification tool )సాధనం -ఉపయోగించి, ఆ కీఫ్రేముల సహాయంతో Googleలో రివర్స్ ఇమేజ్ సెర్చ్ అమలు చేయగా, అది ఈ వీడియోను పోస్ట్ చేసిన Facebook పేజీకి దారితీసింది.ఫేస్ బుక్ లో ‘ది న్యూస్ రూమ్’ పేరుతో ఒక పేజీ, అదే వీడియోను అక్టోబర్ 7న అదే దావాతో షేర్ చేసింది.ఇది పోస్ట్: “देखिये फैक्टरी में नकली चावल को कैसे बनाया जाता है? “ఫ్యాక్టరీలో ప్లాస్టిక్ బియ్యం ఎలా తయారవుతాయి?”

మేము వీడియోను పరిశీలించగా, ఇది అనేక వీడియోలు మరియు చిత్రాల కలిపి తయారు చేసిందని గమనించాము.వీడియో క్లిప్‌లపై రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ని అమలు చేయగా, అది ఫోర్టిఫైడ్ రైస్ గురించి మాట్లాడే ఒక పేజీ/blogకి దారితీసింది.బ్లాగ్‌లో ఉపయోగించిన చిత్రం దావా చేయబడిన వీడియోలో కూడా ఉపయోగించబడింది. ఫోర్టిఫిట్ ఒక బ్లాగ్ పోస్ట్ ద్వారా బలవర్థకమైన బియ్యం గింజల తయారీ గురించి మాట్లాడటానికి ఈ చిత్రాన్ని ఉపయోగించింది.

డిసెంబర్ 29, 2021 నాటి బ్లాగ్ పోస్ట్‌లో, వారు ఇలా అన్నారు, “ఎక్స్‌ట్రూషన్ టెక్నాలజీలో, మిల్లింగ్ రైస్‌ను పల్వరైజ్ చేసి, విటమిన్లు మరియు మినరల్స్ కలిగిన ప్రీమిక్స్‌తో కలుపుతారు.ఈ మిశ్రమం నుండి ఎక్స్‌ట్రూడర్ యంత్రాన్ని ఉపయోగించి ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్స్ (FRK)ని ఉత్పత్తి చేస్తారు. ఈ గింజలు బియ్యం గింజలను పోలి ఉంటాయి.”

మేము రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ని అమలు చేయడానికి మరొక స్క్రీన్‌షాట్‌ని ఉపయోగించినప్పుడు, అది సన్‌ప్రింగ్ ఎక్స్‌ట్రూషన్ వారు ఆగస్టు 13, 2021న పోస్ట్ చేసిన YouTube వీడియోకి దారితీసింది.’ఆర్టిఫిషియల్ రైస్ ఎక్స్‌ట్రూడర్ న్యూట్రిషన్ రైస్ మేకింగ్ మెషిన్ ఎఫ్‌ఆర్‌కె ఫోర్టిఫైడ్ రైస్ మెషిన్’ అనే శీర్షికతో వీడియో ఉంది. ఈ వీడియో ఫోర్టిఫైడ్ బియ్యం ఉత్పత్తిని చూపించింది.

రైస్ ఫోర్టిఫికేషన్ అంటే బియ్యాన్ని చిన్న ముక్కలుగా చేసి ముఖ్యమైన విటమిన్లు మరియు ఖనిజాలతో కలపడం. ఈ బలవర్థకమైన(ఫోర్టిఫీడ్ రైస్) బియ్యం సాధారణ బియ్యంతో కలుపుతారు.‘ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా’ ప్రకారం, రైస్ ఫోర్టిఫికేషన్ “అధిక  బియ్యం వినియోగిస్తున్న దేశాల్లో సూక్ష్మపోషక లోపాన్ని పరిష్కరించడానికి తక్కువ ఖర్చుతో కూడుకున్న, సంప్రదాయకబద్దమైన వ్యూహం/పద్దతి.

విటమిన్లు మరియు ఖనిజాలను చాలా వరకు మిల్లింగ్ మరియు పాలిష్ ప్రక్రియలో కోల్పోతాయి, కనుక ఫోర్టిఫయింగ్ రైస్ “పంట కోత తరువాతి దశలో విటమిన్లు,ఖనిజాలను జోడించడం ద్వారా బియ్యాన్ని బలపరిచి మరింత పోషకవంతమైనదిగా చేస్తుంది చేస్తుందని మరియు ఇవి ప్లాస్టిక్ బియ్యం కావని FSSAI పేర్కొంది.
వారి ‘మిత్ బస్టర్స్ విభాగం(myth busters section)లో, “బియ్యం కార్బోహైడ్రేట్ పదార్థం మరియు 80% పిండి పదార్ధం కాబట్టి, జిగురు మరియు అంటుకునే లక్షణాలను ఉండడం వలన అన్నం వండినప్పుడు బంతిలా మారడం,ఒకొక్కసారి మాడిపోవడం బియ్యం యొక్క సహజ గుణం.కాబట్టి బియ్యంలో ప్లాస్టిక్ ఉందని లేదా అవి ప్లాస్టిక్ బియ్యమనే వాదనని తోసిపుచ్చారు.

అన్ని ప్రభుత్వ పథకాలలో బలవర్థకమైన బియ్యం పంపిణీకి క్యాబినెట్ ఆమోదం తెలిపిందని, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో 2022లో ఒక ప్రకటనను విడుదల చేసింది.

Digiteye India team గతంలో ప్లాస్టిక్ నుండి గోధుమ ఉత్పత్తవుతుందనే దావాను తోసిపుచ్చి, వాస్తవాన్ని నిరూపించింది.

కావున వీడియోలో చేసిన దావా తప్పు.

మరి కొన్నిఇతర Fact checks:

ఈ వైరల్ వీడియో ప్లాస్టిక్ నుండి గోధుమ ఉత్పత్తిని చూపుతుందా? Fact Check

భారతదేశ వ్యాప్తంగా అన్ని బాణసంచా అమ్మకాలు మరియు వాటి వాడకాన్ని సుప్రీంకోర్టు నిషేధించిందా? వాస్తవ పరిశీలన

 

 

2 thoughts on “ఈ వీడియో ప్లాస్టిక్ నుంచి బియ్యం తయారీ విధానం చూపిస్తుందా?:వాస్తవ పరిశీలన

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.

Exit mobile version