Tag Archives: telugu fake news

ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తన కుమారుడిని సైన్యంలోకి పంపారా? Fact Check

గాజా స్ట్రిప్‌లో కొనసాగుతున్న ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదం మధ్య, హమాస్ ఆకస్మిక దాడిని ప్రారంభించిన తర్వాత, విభిన్న దావాలతో కూడిన పలు వీడియోలు మరియు చిత్రాలు ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యాయి.వైరల్ చిత్రాలలో ఒకటి ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు తన కుమారుడిని ఆర్మీలో చేరడానికి పంపినట్లు పేర్కొంది.

వైరల్ ట్వీట్ బెంజమిన్ నెతన్యాహు ఒక యువకుడితో ఉన్న చిత్రం కనబడుతుంది. “ఎంతటి నాయకుడు. నిజమైన దేశభక్తి: బెంజమిన్ నెతన్యాహు హమాస్‌పై యుద్ధంలో పాల్గొనేందుకు తన కొడుకును జాతీయ విధుల్లోకి పంపుతున్నాడు. ఇజ్రాయెల్ ఆర్మీ” అని ట్వీట్‌లో ఉంది.

ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో బెంజమిన్ నెతన్యాహు కుమారుడు ఇజ్రాయెల్ సైన్యంలో చేరి హమాస్‌కు వ్యతిరేకంగా పోరాడతారని ట్వీట్ పేర్కొంది.

ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ అదే claim/దావాతో చిత్రం షేర్ చేయబడింది.

ఈ వైరల్ ఇమేజ్‌ని ఫ్యాక్ట్ చెక్ చేయమని Digiteye India టీమ్‌ వారికీ వాట్సాప్‌లో రిక్వెస్ట్ వచ్చింది.

FACT CHECK

క్లెయిమ్/దావా యొక్క సత్యాన్ని పరిశీలన చేయడానికి Digiteye India టీమ్‌ Googleలో రివర్స్ ఇమేజ్ సెర్చ్ను ఉపయోగించగా,’ఫ్రెండ్స్ ఆఫ్ LIBI ‘అని ఇజ్రాయెల్ సైనికులకు మద్దతిచ్చే ఒక ఇజ్రాయెలీ వెబ్‌సైట్ వాళ్ళు పోస్ట్ చేసిన చిత్రం అని తేలింది.డిసెంబర్ 4, 2017 నాటి పోస్ట్‌లో, వెబ్‌సైట్ ఈ చిత్రాన్ని “ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి కుమారుడు అవ్నర్ నెతన్యాహు (Avner Netanyahu)ఆర్మీ సర్వీస్‌ను పూర్తి చేశాడు” అని పేర్కొన్న పోస్ట్ కోసం షేర్ చేసింది.

ఇది బెంజమిన్ నెతన్యాహు కుమారుడు అవ్నర్ యొక్క మరిన్ని చిత్రాల కోసం వెతకడానికి దోహదపడింది. మేము కీవర్డ్ ని ఉపయోగించి వెతకగా ‘టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్‘ ప్రచురించిన ఈ పోస్ట్‌కు దారితీసింది.డిసెంబరు 1, 2014 నాటి కథనం ప్రకారం, నెతన్యాహు తన కొడుకు తప్పనిసరి ఆర్మీ సర్వీస్‌లో చేరుతున్నందున అతనికి వీడ్కోలు పలుకుతున్నట్లు పేర్కొంది.వార్తా ప్రచురణ ఇదే చిత్రాన్ని “డిసెంబర్ 01, 2014న జెరూసలేం అమ్మూనిషన్ హిల్లో వారి కుమారుడు అవ్నర్‌తో కలిసి కనిపించిన ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు మరియు అతని భార్య సారా” అనే శీర్షికతో ప్రచురించింది.

“ఇజ్రాయెల్ ప్రధానమంత్రి చిన్న కుమారుడు అవ్నర్ నెతన్యాహు (Avner Netanyahu)సోమవారం ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్‌లో తన సైనిక సేవను ప్రారంభిస్తున్నాడు, అతను తల్లిదండ్రులచే హృదయపూర్వక వీడ్కోలు అందుకొన్న తరువాత, అతను బస్సులో ఎక్కడానికి వచ్చాడు” అని వార్తా పత్రిక శీర్షిక పేర్కొంది.

యూదు, డ్రూజ్ లేదా సర్కాసియన్(Jewish, Druze or Circassian) అయిన 18 ఏళ్లు పైబడిన ప్రతి ఇజ్రాయెల్ పౌరుడు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్‌లో పనిచేసే ‘తప్పనిసరి విధానం’ ఇజ్రాయెల్లో కలిగి ఉంది.కొన్ని మినహాయింపులు ఉన్నాయి. పౌరులు నమోదు చేసుకున్న తర్వాత, వారు నిర్ధిష్ట రోజుల పాటు సైన్యంలో పనిచేయవలసి ఉంటుంది.పురుషులు కనీసం 32 నెలలు, మహిళలు కనిష్టంగా 24 నెలలు సేవ చేయాలని భావిస్తున్నారు.పౌరులు ‘ఎలైట్ కంబాట్ యూనిట్ల’ నుండి ‘కంబాట్ సపోర్ట్ యూనిట్ల’ వరకు ఉండే యూనిట్లలో సేవలు అందిస్తారు.

అందువల్ల ఈ దావా తప్పు.

CLAIM/దావా: ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తన కుమారుడిని సైన్యంలోకి పంపారు.

CONCLUSION/నిర్ధారణ: ఈ వైరల్ చిత్రం 2014లో బెంజమిన్ నెతన్యాహు తన కుమారుడిని ‘తప్పనిసరి ఆర్మీ సర్వీస్’‌లో చేరడానికి ముందు హృదయపూర్వక వీడ్కోలు అందించడానికి వెళ్లినప్పటి చిత్రం.

RATING: Misrepresentation-???

[మరి కొన్ని Fact checks: నోబెల్ గ్రహీత అమర్త్యసేన్ మరణించారా? నకిలీ ట్విట్టర్ ఖాతా యొక్క దావా వైరల్ అవుతుంది; Fact Check ; MMR టీకాలు ఆటిజంకు కారణమవుతాయని వైరల్ సోషల్ మీడియా పోస్ట్‌లు పేర్కొంటున్నాయి; Fact Check]