ఈ వీడియోలో చూపినట్లుగా డిస్నీల్యాండ్ ఉద్యోగి , ఒక వివాహ ప్రతిపాదనకు అంతరాయం కలిగించాడా? వాస్తవ పరిశీలన
వాదన/Claim : డిస్నీల్యాండ్ ఉద్యోగి , ఒక వివాహ ప్రతిపాదనకు అంతరాయం కలిగించిందనేది వాదన.
నిర్ధారణ/Conclusion : ఈ వాదన/03ఆరోపణ నిజమే. ఆ వీడియో, 2022లో ప్యారిస్ డిస్నీల్యాండ్‌లో జరిగిన ఒక నిజమైన సంఘటనకు సంబంధించిన అసలైన ఫుటేజ్. డిస్నీ అధికారికంగా క్షమాపణ చెప్పి, నష్టపరిహారాన్ని కూడా అందించింది, కానీ ఆ జంట దానిని తిరస్కరించింది.
రేటింగ్ /Rating : నిజం/వాస్తవం
******************************************************
వాస్తవ పరిశీలన పూర్తి వివరాలను వీడియోలో చూడండి
లేదా వాస్తవ పరిశీలన కధనం చదవండి
******************************************************
డిస్నీల్యాండ్ ఉద్యోగి ఒక వివాహ ప్రతిపాదనకు అంతరాయం కలిగించడాన్ని చూపించే వీడియోను , పలువురు సోషల్ మీడియా వినియోగదారులు షేర్ చేసారు. వెరిఫైడ్ ఎక్స్ యూజర్ ‘CrazyVibes_1’ ఇలాంటి పోస్ట్‌ను ఇలా షేర్ చేసారు: “డిస్నీల్యాండ్‌లో జరిగిన వివాహ ప్రతిపాదనలో అంతరాయం కలిగించిన డిస్నీ ఉద్యోగిపై విమర్శలు వెల్లువెత్తాయి. డిస్నీ ఆ జంటకు క్షమాపణ చెప్పి, నష్టపరిహారం కూడా అందించింది, కానీ ఆ జంట దానిని అంగీకరించలేదు.” పోస్టులోఆ సంఘటనను చూపిస్తున్న 21-సెకన్ల వీడియో క్లిప్ కూడా ఉంది. దీనిని కింద చూడవచ్చు –
The Disney employee who was involved in the marriage proposal made at Disneyland drew reaction. Disney apologized to the couple and offered compensation, but the couple did not accept compensation pic.twitter.com/UYXH8kE6uS
— Crazy Vibes (@CrazyVibes_1) April 6, 2026
ఇతర వినియోగదారులు ఇలాంటి వాదనలనే ఇక్కడ మరియు ఇక్కడ షేర్ చేసారు.
వాస్తవ పరిశీలన
ఈ వాదనను’డిజిటై’ బృందం పరిశీలించగా, అది వాస్తవమే అని గుర్తించింది.ఈ వీడియో 2022లో డిస్నీల్యాండ్ పారిస్‌లో జరిగిన ఒక వాస్తవ సంఘటనను చూపిస్తుంది. ఆ సంఘటన తర్వాత, డిస్నీ అధికారికంగా క్షమాపణ చెప్పి పరిహారాన్ని ప్రతిపాదించింది, కానీ ఆ జంట దానిని అంగీకరించకూడదని నిర్ణయించుకుంది.
వివరాలు:
ఆ వీడియో యొక్క మూలాన్ని తెలుసుకోవడానికి, మొదట అందులోని కొన్ని కీలక దృశ్యాలపై (keyframes) ‘రివర్స్ ఇమేజ్ సెర్చ్’ నిర్వహించగా,జూన్ 7, 2022న ‘ViralHog’ ద్వారా ప్రచురించబడిన ఒక YouTube Short మాకు లభించింది. ఆ వీడియో వివరణ ప్రకారం, ఈ సంఘటన మే 21, 2022న ఫ్రాన్స్‌లోని పారిస్‌లో జరిగింది. ‘స్లీపింగ్ బ్యూటీ క్యాజిల్’ (Sleeping Beauty Castle) ముందు ఉన్న వేదికపై ప్రపోజ్ చేయడానికి అనుమతి తీసుకున్న తర్వాత, డిస్నీల్యాండ్‌కు చెందిన ఒక సిబ్బంది సభ్యుడు నా ప్రపోజల్‌కు అంతరాయం కలిగించారు.” అని పేర్కొన్నారు.దీనికి సంబంధించిన స్క్రీన్‌షాట్ కింద చూడవచ్చు:
జూన్ 6, 2022న ‘డైలీ మెయిల్’ ప్రచురించిన ఒక కథనం మా దృష్టికి వచ్చింది; ఇది కూడా ఈ సంఘటన గురించే వివరిస్తుంది. “మిక్కీ మౌస్ చెవుల ఆకారపు హెడ్‌బ్యాండ్ ధరించిన ఒక సిబ్బంది వల్ల, డిస్నీల్యాండ్ పారిస్‌లో ఒక జంట పొందాల్సిన అద్భుతమైన క్షణం చేజారిపోయింది” అని ఆ కథనం పేర్కొంది. ఆ కథనంలో ఉన్న వీడియో దృశ్యాలు, ఆరోపించిన పోస్ట్‌లోని వీడియోతో సరిపోలుతున్నాయి.
ఈ వ్యవహారంలో జరిగిన పొరపాటును డిస్నీ బహిరంగంగా అంగీకరించి, క్షమాపణలు కూడా చెప్పిందని గమనించాము . ‘పీపుల్’ (People) నివేదిక ప్రకారం, సంబంధిత జంట విషయంలో “పరిస్థితిని సరిదిద్దాలని” తాము ప్రయత్నించినట్లు డిస్నీ ‘న్యూయార్క్ టైమ్స్’కు (2022లో) తెలిపింది. “సంబంధిత జంటకు మేము హృదయపూర్వక క్షమాపణలు తెలియజేశాము మరియు వారికి జరిగిన అసౌకర్యాన్ని సరిదిద్దడానికి మా వంతు కృషి చేస్తామని,” వారు మరోసారి స్పష్టం చేశారు. ఈ అంశానికి సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను కింద చూడవచ్చు
ఏప్రిల్ 7, 2026న ప్రచురించబడిన డైలీమెయిల్ యొక్క తాజా నివేదిక, డిస్నీల్యాండ్ ఉద్యోగిపై ప్రజాగ్రహానికి గల కారణాలను మరియు ఆ ఉద్యోగి పట్ల ప్రజలు తమ అసంతృప్తిని వ్యక్తం చేశారని పేర్కొంది. “మరికొన్ని సెకన్లు వేచి ఉంటె నష్టమేమి లేదని ,అతను ఆ జంట పొందాల్సిన అద్భుతమైన క్షణాన్ని నాశనం చేశాడని ,”వ్యాఖ్యానించారు.ఆ ఉద్యోగిని తొలగించాలనే డిమాండ్ చేశారు.
చివరగా, ఆ ఉద్యోగి ఇలా ప్రవర్తించిన గల కారణాల కోసం పరిశీలించగా, బోర్డ్పాండా నివేదిక ప్రకారం, డిస్నీల్యాండ్ పారిస్‌లోని స్లీపింగ్ బ్యూటీ క్యాజిల్ ముందు ఉన్న ప్లాట్‌ఫారమ్‌ను అతిథులకు అనుమతి లేదు మరియు దానికి కంచె బడిందని గుర్తించాము . ఆ ప్లాట్‌ఫారమ్ చుట్టూ పరికరాలు మరియు బాణసంచా ఏర్పాటు చేసి ఉన్నాయని, అది భద్రతాపరమైన ప్రమాదాన్ని కలిగిస్తుందని ఆ నివేదిక పేర్కొంది.నివేదికలోని కొంత భాగాన్ని కింద చూడవచ్చు :
కాబట్టి, ఆ వాదన నిజం.
మరికొన్ని వాస్తవ పరిశీలన కధనాలు:
