వీడియో లింక్‌ను కాపీ చేసి షేర్ చేయకుండా ‘X’ వినియోగదారులను నిషేధించిందా? వాస్తవ పరిశీలన
వాదన/Claim :సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘X’, వినియోగదారులు Xలోని వీడియోల లింక్‌లను కాపీ చేయకుండా నిలిపివేసిందనేది వాదన.
నిర్ధారణ /Conclusion : ఈ వాదన పూర్తిగా అబద్ధం. ఇది 1 ఏప్రిల్ 2026న ప్రారంభమై, తర్వాతి రోజుల్లో కూడా విస్తృతంగా కొనసాగిన ఏప్రిల్ ఫూల్స్ డే పరిహాసంలో(జోక్/
చిలిపి పని) భాగం. Xలో వీడియోలు ఉన్న పోస్ట్‌ల లింక్‌లను కాపీ చేసే ఫీచర్ పూర్తిగా పనిచేస్తూనే ఉంది మరియు అందులో ఎలాంటి మార్పు లేదు.
రేటింగ్ /Rating : పూర్తిగా అబద్ధం
X (ట్విట్టర్)లో వీడియో లింక్‌ను కాపీ చేయడం సాధ్యం కాదని పలువురు సోషల్ మీడియా వినియోగదారులు పేర్కొన్నారు. ‘LostTemple7’ అనే X వినియోగదారు, “Xలో ఇకపై వీడియో లింక్‌ను కాపీ చేయలేరు” అనే క్యాప్షన్‌తో పోస్ట్ ని షేర్ చేశారు ఈ పోస్ట్‌కు “literallyme0” అనే మీమ్ టెక్స్ట్(meme Text) తో ‘Peaky Blinders’ సిరీస్‌లోని సిలియన్ మర్ఫీ క్లిప్‌లతో కూడిన 18 సెగల నిడివి గల వీడియోను జత చేశారు; ఆ పోస్ట్‌ను కింద చూడవచ్చు
YOU CAN NO LONGER COPY THE LINK OF A VIDEO ON X pic.twitter.com/CYkSVhsI3X
— Lost Temples™ (@LostTemple7) April 2, 2026
ఇతర వినియోగదారులు ఇలాంటి పోస్ట్‌లనే ఇక్కడ మరియు ఇక్కడ షేర్ చేసారు.
JUST IN: You can no longer copy the link of a video anymore on Xpic.twitter.com/L4UtBVgiFz
— PolyGun (@Polygun_) April 2, 2026
You can no longer copy the link of a video anymore on X 😢
— Bollywood Times (@TimesOfBwood) April 2, 2026
వాస్తవ పరిశీలన
ఈ వాదనను’డిజిటై’ బృందం పరిశీలించగా, అది పూర్తిగా అబద్దమని గుర్తించింది.ఇది 2026 ఏప్రిల్ 1న వినియోగదారులు ప్రారంభించి, ఆ తర్వాతి రోజుల్లోనూ కొనసాగించిన ఒక ‘ఏప్రిల్ ఫూల్స్’ జోక్ /పరిహాసంలో భాగమని తేలింది.
వివరాలు:
వాదన పరిశీలించిన తర్వాత, Xలో వీడియో లింక్‌ను కాపీ చేయడం సాధ్యమేనా అని మేము మొదట మాన్యువల్‌గా(manually) తనిఖీ చేసాము. లింక్‌ను కాపీ చేసి, ఎవరితోనైనా షేర్ చేయడం సాధ్యమేనని సెట్టింగ్‌లు స్పష్టంగా చూపిస్తున్నాయి. అంతేకాకుండా, ఒక వ్యక్తి పోస్ట్‌ను ఎంబెడ్ చేసి, లింక్‌తో పాటు దానిని షేర్ చేయడానికి కూడా X అనుమతిస్తుంది. ‘కాపీ లింక్’ ఆప్షన్ యొక్క స్క్రీన్‌షాట్‌ను కింద చూడవచ్చు :
తదుపరి, ఈ వాదనకు సంబంధించిన వివరాలు తెలుసుకోవడానికి “X removes copy link for video” అనే పదబంధంతో వెబ్‌లో అన్వేషించాము. News18 నివేదిక ప్రకారం, అటువంటి పోస్ట్‌లు “రాత్రికి రాత్రే లక్షలాది వ్యూస్‌ను (వీక్షణలను) సాధించాయి మరియు అవి కేవలం ‘ఏప్రిల్ ఫూల్స్ డే’ ప్రాంక్ (జోక్/సరదా అల్లరి) మాత్రమేనని భావిస్తున్నారు” మరియు “ఇది ప్లాట్‌ఫారమ్‌పై ఎంగేజ్‌మెంట్‌ను పెంచడానికి ప్లాన్ చేసిన ‘ఏప్రిల్ ఫూల్స్ డే’ జోక్ లాగా అనిపిస్తుంది” అని కూడా పేర్కొన్నారు. ఆ నివేదికలోని ఒక భాగాన్ని కింద చూడవచ్చు :
అధికారిక X సపోర్ట్ పేజీలు, ఏదైనా పోస్ట్‌పై (వీడియో లేదా ఇతరత్రా) షేర్ ఐకాన్‌ను నొక్కి, “కాపీ లింక్”ను ఎంచుకోమని వినియోగదారులకు సూచిస్తూనే ఉన్నాయి. ఈ ఫీచర్‌ను తొలగించడం లేదా పరిమితం చేయడం గురించి X నుండి ఎటువంటి ప్రకటన లేదు .మొబైల్ యాప్‌లు మరియు వెబ్ రెండింటిలోనూ, వినియోగదారులు ఇప్పటికీ పోస్ట్ URLను కాపీ చేయవచ్చు. సూచనల స్క్రీన్‌షాట్‌ను కింద చూడవచ్చు –
కాబట్టి, ఆ వాదన పూర్తిగా అబద్ధం/అవాస్తవం.
మరికొన్ని వాస్తవ పరిశీలన కధనాలు:
భారత రాజధాని ఢిల్లీ త్వరలో ఇంద్రప్రస్థగా పేరు మారబోతుందా?వాస్తవ పరిశీలన
