దక్షిణ కొరియా ఇజ్రాయెల్ పర్యాటకులను తమ దేశంలోకి ప్రవేశించకుండా నిషేధించిందా? వాస్తవ పరిశీలన
వాదన/Claim : దక్షిణ కొరియా ఇజ్రాయెల్ పర్యాటకులను తమ దేశంలోకి ప్రవేశించకుండా నిషేధించిందనేది వాదన.
నిర్ధారణ/Conclusion : ఈ వాదన అవాస్తవం/పూర్తిగా తప్పు. అలాంటి నిషేధం ఏదీ విధించడబలేదు. ఇజ్రాయెల్ పౌరులు దక్షిణ కొరియాలోకి వీసా లేకుండా ప్రవేశించడానికి అర్హులని మరియు డిసెంబర్ 31, 2026 వరకు కొరియా ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్ (K-ETA) నుండి మినహాయింపు పొందారని కొరియా అధికారిక వర్గాలు ధృవీకరించాయి.
రేటింగ్/Rating : పూర్తిగా తప్పు —
దక్షిణ కొరియా ఇజ్రాయెల్ పర్యాటకులందరినీ తమ దేశంలోకి ప్రవేశించకుండా నిషేధించిందని అనేక మంది సోషల్ మీడియా వినియోగదారులు పేర్కొన్నారు. X యూజర్ ‘Malcolm_Pal9’ “బ్రేకింగ్: దక్షిణ కొరియా తమ దేశంలోకి ప్రవేశించకుండా ఇజ్రాయెల్ పర్యాటకులందరినీ నిషేధించింది” అనే గ్రాఫిక్ క్లెయిమ్‌ను కలిగి ఉన్న వాదనను X లో పోస్ట్ చేసారు.
ఈ చిత్రంలో దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ మరియు ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు ఫోటోలు జత చేసి వార్త శీర్షికగా చూపించారు. ఈ పోస్ట్ 263,000 కంటే ఎక్కువ మంది వీక్షించారు, మరియు దీనిని క్రింద చూడవచ్చు –
Fair enough. pic.twitter.com/jnB1mfU4Bv
— 𝐌𝐚𝐥𝐜𝐨𝐥𝐦 (@Malcolm_Pal9) January 7, 2026
ఇతర వినియోగదారులు కూడా ఇలాంటి వాదనలనే ఇక్కడ మరియు ఇక్కడ షేర్ చేసారు.
వాస్తవ పరిశీలన
DigitEYE India బృందం, ఈ వాదనను దర్యాప్తు చేయాలని నిర్ణయించి పరిశీలించగా, అది అబద్ధమని తేలింది . దక్షిణ కొరియాలోకి ఇజ్రాయెల్ పౌరులు ప్రవేశించడంపై ఎటువంటి పరిమితి లేదు. కొరియా ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్ (K-ETA) నిబంధనను డిసెంబర్ 31, 2026 వరకు అధికారికంగా రద్దు చేసినందున,ఇజ్రాయెల్ జాతీయులు వీసా రహిత ప్రవేశాన్ని ఉపయోగించుకోవచ్చు.
వివరాలు
ఈ వాదన గురించి మరింత తెలుసుకోవడానికి మేము మొదట “దక్షిణ కొరియా ఇజ్రాయెల్ పర్యాటకులందరినీ నిషేధించింది” అనే పదబంధంతో అంతర్జాలంలో అన్వేషించగా, దక్షిణ కొరియా విదేశాంగ మంత్రిత్వ శాఖ మరియు వీసా పోర్టల్, ఇజ్రాయెల్ పౌరులను లక్ష్యంగా చేసుకుని ఎటువంటి ప్రయాణ నిషేధాలు లేదా ప్రవేశ పరిమితులను విధించలేదని కనుగొన్నము. అంతేకాకుండా, అటువంటి వాదనను సమర్ధిస్తూ విశ్వసనీయ మీడియా సంస్థల నుండి కూడ ఎటువంటి నివేదికలు లభించలేదు.
దీని తర్వాత, ఇజ్రాయెల్ పాస్‌పోర్ట్ హోల్డర్లకు డిసెంబర్ 31, 2026 వరకు కొరియా ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్ (K-ETA) నుండి స్పష్టమైన మినహాయింపు ఉందని ఒక నివేదిక ద్వారా మేము తెలుసుకున్నాము, తద్వారా పర్యాటకం కోసం 90 రోజుల వరకు వీసా లేకుండా బస చేయడానికి అనుమతి లభిస్తుంది. దీని గురించి కొరియాలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం చేసిన ఈ ప్రకటన యొక్క స్క్రీన్‌షాట్‌ను కింద చూడవచ్చు-
తరువాత, మేము దక్షిణ కొరియా అధికారుల నుండి K-ETA మినహాయింపుకు సంబంధించిన అధికారిక ప్రకటన కోసం అన్వేషించగా, డిసెంబర్ 23, 2025న, దక్షిణ కొరియా K-ETA వెబ్‌సైట్‌లో ఒక అధికారిక ప్రకటన విడుదల చేయడం, అందులో “ఈ మినహాయింపు డిసెంబర్ 31, 2026 వరకు అమలులో ఉంటుందని ” పేర్కొనటం గమనించాము. అనగా ,జనవరి 1, 2026 నుండి డిసెంబర్ 31, 2026 వరకు కాలంలో, 22 దేశాలు (ఇజ్రాయెలీలతో సహా) K-ETA కోసం దరఖాస్తు చేసుకోకుండానే దక్షిణ కొరియాలోకి ప్రవేశించవచ్చు.
చివరగా, మేము K ETA వర్తించే దేశాల కోసం అధికారిక వెబ్‌సైట్‌లో ‘అర్హత మరియు దరఖాస్తుదారుల’ పేజీని తనిఖీ చేయగా, మినహాయింపు పొందిన దేశాలలో ఇజ్రాయెల్‌ను జాబితా చేసి, అనుమతించబడిన బస వ్యవధి క్రింద 90 రోజులుగా చూపబడింది(క్రింద స్క్రీన్ షాట్ చూడవచ్చు). ఎటువంటి మార్పులు చేయబడలేదు మరియు ఇజ్రాయెల్ పర్యాటకులు దక్షిణ కొరియాలో తమ యాత్రను ఆస్వాదించవచ్చు.
అందువల్ల, ఈ వాదన తప్పు.
******************************************************
మరికొన్ని వాస్తవ పరిశీలన కధనాలు:
ఎలోన్ మస్క్ సోమాలిలాండ్ జెండా ఎమోజీని ఆ దేశం యొక్క గుర్తింపు చిహ్నంగా Xలో చేర్చారా? వాస్తవ పరిశీలన
