వాదన/Claim :తక్కువ వినియోగం కారణంగా, 50 ఏళ్ల తర్వాత ఇండియా పోస్ట్ తమ రిజిస్టర్డ్ పోస్ట్ సేవను నిలిపివేస్తోందనేది వాదన.

నిర్ధారణ/Conclusion: ఈ వాదన తప్పుదారి పట్టించేలా ఉంది. ఇండియా పోస్ట్ తన ‘రిజిస్టర్డ్ పోస్ట్’ సేవలను నిలిపివేయడం లేదు, బదులుగా వాటిని ‘స్పీడ్ పోస్ట్’తో విలీనం చేస్తోంది.

రేటింగ్/Rating: : తప్పుదారి పట్టించే వాదన–

************************************************************************

ఇండియా పోస్ట్ తమ’రిజిస్టర్డ్ పోస్ట్’ సేవను నిలిపివేస్తోందని పలువురు సోషల్ మీడియా వినియోగదారులు పేర్కొన్నారు. దాదాపు ఐదు దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ సేవను నిలిపివేయడం పట్ల చాలామంది ఆందోళన మరియు విచారం వ్యక్తం చేశారు.

ధృవీకరించబడిన(Verified) X వినియోగదారు ‘Indianinfoguide’ 2025 ఆగస్టు 4న దీని గురించి ఒక పోస్ట్ చేశారు. ఆ పోస్ట్‌లో ఇలా పేర్కొన్నారు: “సెప్టెంబర్ 1 నుండి ఇండియా పోస్ట్ తమ ప్రసిద్ధ ‘రిజిస్టర్డ్ పోస్ట్’ సేవను నిలిపివేయనుంది.” ఆ పోస్ట్‌ను కింద చూడవచ్చు.

రిజిస్టర్డ్ పోస్ట్ సేవ భారతదేశంలోని కొన్ని అత్యంత ముఖ్యమైన కథలు , సమాచారం ఎలా మోసుకెళ్లిందో గుర్తుచేసుకుంటూ, మరో వినియోగదారుడు గతాన్ని గుర్తుచేసుకున్నారు.

ఆగస్టు 5, 2025న, ధృవీకరించబడిన(Verified) మరొక ‘X’ వినియోగదారుడు ఇండియా పోస్ట్ వాహనాలను చూపే నాలుగు చిత్రాలతో పాటు ఇదే విషయాన్ని షేర్ చేశారు. ఆ పోస్ట్ క్యాప్షన్‌లో ఇలా ఉంది: “ఒక శకానికి ముగింపు: ప్రజలు ఇకపై వినియోగించకపోవడంతో, ఇండియా పోస్ట్ తన 50 ఏళ్ల నాటి రిజిస్టర్డ్ పోస్టల్ సేవను నిలిపివేసింది.”

కింద ఉన్న ట్వీట్‌ను చూడవచ్చు:

వాస్తవ పరిశీలన

ఈ వాదనను’డిజిటై’ బృందం పరిశీలించగా, అది తప్పుదారి పట్టించేలా ఉందని గుర్తించింది.  ఇండియా పోస్ట్ తమ రిజిస్టర్డ్ పోస్ట్ సేవలను నిలిపివేయడం లేదు, పైగా మరింత సమర్థతకై దానిని స్పీడ్ పోస్ట్‌లో విలీనం చేస్తోంది.

ఈ విషయంపై మరింత సమాచారం తెలుసుకోవడానికి, మేము మొదట “India Post shutdown” మరియు “India Post registered post shutdown” అనే పదబంధాలతో(కీవర్డ్ సెర్చ్)వెబ్ లో అన్వేషించగా , ఈ వాదనను ఖండిస్తూ ‘X’ (గతంలో ట్విట్టర్) వేదికగా ఇండియా పోస్ట్ చేసిన ఒక అధికారిక పోస్ట్ ను గమనించాము . ఆ పోస్ట్‌ను కింద చూడవచ్చు –

7 ఆగస్టు 2025న పోస్ట్ చేయబడిన ఒక థ్రెడ్ ఫార్మాట్‌లో, వారు స్పీడ్ పోస్ట్‌తో ఈ విలీనం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. ఇప్పుడు రిజిస్టర్ చేయబడిన వాటిని స్పీడ్ పోస్ట్ వేగంతో పంపవచ్చని, “నమ్మకం విషయంలో రాజీ లేకుండా కేవలం వేగవంతమైన ఫలితాలు మాత్రమే లభిస్తాయని” ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు.

బిజినెస్ స్టాండర్డ్ వారి ఒక నివేదిక, అసలు ఈ భాగస్వామ్యం(విలీనం/merger) ఎందుకు జరిగిందో స్పష్టం చేస్తుంది. అధికారిక గణాంకాల ప్రకారం, చట్టబద్ధమైన, సురక్షితమైన మరియు గ్రహీత-నిర్దిష్ట సేవ అయిన రిజిస్టర్డ్ పోస్ట్ వాడకం వాస్తవానికి తగ్గుముఖం పట్టింది. 2011-12లో 244.4 మిలియన్ల వస్తువులు(పార్సెల్స్)ఉండగా , 2019-20 నాటికి 184.6 మిలియన్లకు, అంటే 25% పడిపోయింది. డిజిటల్ ప్రత్యామ్నాయాలు మరియు ప్రైవేట్ కొరియర్‌ల రాకతో వేగవంతమైన క్షీణత, ఈ విలీనంకు దారితీసింది.

ఈ వైరల్ వాదనను ఖండిస్తూ PIB ఫ్యాక్ట్ చెక్ విభాగం 2025 ఆగస్టు 6న ఒక అధికారిక పత్రికా ప్రకటనను కూడా విడుదల చేసింది. “తపాలా శాఖ తన సార్టింగ్ (వర్గీకరణ/sorting) వ్యవస్థను హేతుబద్ధం చేసి, రిజిస్టర్డ్ మరియు స్పీడ్ పోస్ట్ అంశాల ప్రాసెసింగ్‌ను ఏకీకృతం చేసింది. ఈ ఏకీకరణ వల్ల బ్యాకెండ్ సామర్థ్యం పెరుగుతుంది, రవాణాలో జాప్యం తగ్గుతుంది మరియు నెట్‌వర్క్ అంతటా మెరుగైన అనుసంధానం లభిస్తుంది” అని ఆ పత్రికా ప్రకటన ధృవీకరించింది. ఆ పత్రికా ప్రకటనలోని కొంత భాగాన్ని కింద చూడవచ్చు.

ఇండియా పోస్ట్ యొక్క రిజిస్టర్డ్ పోస్ట్ సేవ నిలిపివేయబడటం లేదు, పైగా దానిని స్పీడ్ పోస్ట్‌లో విలీనం చేస్తున్నారు.

అందువల్ల, ఈ వాదన తప్పుదోవ పట్టించేలా ఉంది.

*********************************************************************

మరికొన్ని వాస్తవ పరిశీలన కధనాలు:

భారతదేశం ఇప్పటికే దేశవ్యాప్తంగా వినియోగదారుల మధ్య ఒకరి నుంచి మరొకరికి విద్యుత్ ట్రేడింగ్‌ను ప్రారంభించిందా? వాస్తవ పరిశీలన

భారత గణతంత్ర దినోత్సవ పరేడ్ సందర్భంగా బైక్ విన్యాసాలు చేస్తున్న బైకర్లు కింద పడిపోయారా ?వాస్తవ పరిశీలన

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.

Exit mobile version