వాదన/Claim: యునైటెడ్ స్టేట్స్ మరియు కెనడా 1.2 మిలియన్లకు పైగా భారతీయ అక్రమ వలసదారులను స్వదేశానికి తిరిగి పంపించే ప్రక్రియను ప్రారంభించారనేది వాదన.

నిర్ధారణ/Conclusion: తప్పుదారి పట్టించే వాదన. పత్రాలు లేని 18,000 మంది అక్రమ వలసదారులను వెనక్కి తీసుకోవడానికి భారతదేశం ఇప్పటికే అంగీకరించింది, అయితే US మరియు కెనడా బహిష్కరించే(వెనక్కి పంపించే) 1.2 మిలియన్ల అక్రమ వలసదారులపై ఎటువంటి అధికారిక సంఖ్య స్పష్టంగా లేదు.

రేటింగ్/Rating: తప్పుదారి పట్టించే వాదన —

యునైటెడ్ స్టేట్స్ మరియు కెనడా 1.2 మిలియన్లకు పైగా భారతీయ అక్రమ వలసదారులను స్వదేశానికి తిరిగి పంపించే ప్రక్రియను ప్రారంభించినట్లు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ చేయబడుతోంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సరికొత్త విధాన ప్రకటనల ప్రకారం పత్రాలు లేని అక్రమ వలసదారులను బహిష్కరించడంపై ఆదేశాలు ఇచ్చిన సందర్భంలో ఈ పోస్ట్ షేర్ చేయబడుతోంది.

అదే పోస్ట్‌ను షేర్ చేస్తూ, మరొక వినియోగదారు ఇలా వ్రాశారు: “US మరియు కెనడా యొక్క కొత్త బహిష్కరణ ప్రణాళికకు ధన్యవాదాలు, కొడుకులు మరియు కుమార్తెలను తిరిగి స్వాగతించడానికి భారత ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోంది. తన ‘మేక్ ఇన్ ఇండియా’ ప్రచారాన్ని పెంచడానికి 1.2 మిలియన్ల మంది పౌరులను తన చేతులతో ఆదుకోడానికి ప్రధాని మోడీ థ్రిల్ అవుతుంటారు”.

వాస్తవ-పరిశీలన

Pew రీసెర్చ్ అంచనా ప్రకారం, దాదాపు 725,000 మంది భారతీయులు యునైటెడ్ స్టేట్స్‌లో ప్రస్తుతం నివసిస్తున్న అనధికార వలసదారులు. యునైటెడ్ స్టేట్స్ నుండి 18,000 మంది పత్రాలు లేని వలసదారులను స్వీకరించటానికి భారతదేశం ఇప్పటికే తన ప్రణాళికలను ప్రకటించింది, అయితే కెనడాలో నివసిస్తున్న భారతదేశానికి చెందిన అక్రమ వలసదారుల గురించి ఎటువంటి గణాంకాలు అందుబాటులో లేవు.

భారత విదేశాంగ మంత్రి S. జైశంకర్ కూడా (క్రింద ఉన్న వీడియో చూడండి) US నుండి భారతీయులు చట్టబద్ధంగా తిరిగి వస్తే స్వీకరించటానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు, మరియు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) కూడా చట్టపరమైన  వలసలకు మద్దతు ఇస్తామని, చట్టవిరుద్ధమైన వలసలను వ్యతిరేకిస్తామని ధృవీకరించారు.

కెనడా గురించి అధికారిక సంఖ్య అందుబాటులో లేదు. Pew రీసెర్చ్ గణాంకాలు కూడా అంచనాలు మాత్రమే, నిశ్చయాత్మకమైనవి కావు.
అయితే, MEA ప్రతినిధి రణధీర్ జైస్వాల్‌ని ఉటంకిస్తూ కొత్త నివేదికలు ఇలా పేర్కొన్నాయి: “వలసల విషయంపై భారతదేశం-అమెరికా పరస్పర సహకారంతో, అక్రమ వలసలను నిరోధించే ప్రక్రియలో ఇరుపక్షాలు నిమగ్నమై ఉన్నాయి. భారతదేశం నుండి అమెరికాకి(యుఎస్‌కి) చట్టపరమైన వలసలకు మరిన్ని మార్గాలను సృష్టించడానికే ఇది చేయబడుతుంది”.

అంతేకాకుండా, US కస్టమ్స్ మరియు సరిహద్దు రక్షణ డేటా ప్రకారం, 2024 ఆర్థిక సంవత్సరంలో US సరిహద్దు గస్తీ అధికారులు ఎదుర్కొన్న అన్ని చట్టవిరుద్ధమైన సరిహద్దు దాటడలతో పోలిస్తే, పత్రాలు లేని భారతదేశ వలసదారుల సంఖ్య 3% ఉంది.కాబట్టి, అధికారిక గణాంకాలు ప్రభుత్వానికి విడుదలయ్యే వరకు US మరియు కెనడాలో 1.2 మిలియన్ల అక్రమ వలసదారుల సంఖ్య ప్రామాణికమైనది కాదు. ప్రస్తుతానికి, 18,000 మంది పత్రాలు లేని అక్రమ వలసదారులను బహిష్కరించే(వెనక్కి పంపించే) అవకాశం ఉంది.

అందువల్ల, ఈ దావా తప్పుదారి పట్టించే విధంగా ఉంది.

మరి కొన్ని వాస్తవ పరిశీలన  కధనాలు:

కమలా హారిస్‌ అమెరికా యొక్క సహజసిద్దమైన పౌరురాలు కాదా? వాస్తవ పరిశీలన

హారిస్‌కు మద్దతు తెలిపినందుకు కంట్రీ మ్యూజిక్ ‘టేలర్ స్విఫ్ట్‌’ను నిషేధించిందా? వాస్తవ పరిశీలన

 

 

 

 

1 thought on “అమెరికా మరియు కెనడా 1.2 మిలియన్ల అక్రమ భారతీయ వలసదారులను స్వదేశానికి తిరిగి పంపించేస్తున్నారా ? వాస్తవ-పరిశీలన

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.

Exit mobile version