ముంబైలో భారీ వర్షాలు,వరదలు వచ్చి వీధుల్లో వాహనాలు కొట్టుకుపోతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తు ముంబయిలో ప్రస్తుత పరిస్థితి దారుణంగా తయారైందని వీడియోతో చేసిన దావా చెబుతోంది.
Mumbai Rains From “What a Lovely to Vaat Lavali” in just 30 min 😜
ముంబైలో ప్రస్తుత భారీ వర్షాల కారణంగా, భారత వాతావరణ శాఖ (IMD) ముంబై నగరం మరియు దాని పరిసరాల్లో థానే, నవీ ముంబై, పన్వెల్ మరియు రత్నగిరి-సింధుదుర్గ్‌తో సహా “రెడ్ అలర్ట్” ప్రకటించింది.
FACT CHECK
Digiteye India బృందం కీలకఫ్రేమ్‌లను తీసుకొని,వాటిని Google రివర్స్ ఇమేజ్ సెర్చ్‌లో పరిశీలించినప్పుడు, 2020లో నగరంలో భారీగా వరదలు వచ్చినప్పుడు న్యూస్ టీవీ ఛానెల్‌లు ఇలాంటి వీడియోలను ప్రసారం చేశాయని కనుకొన్నాము.ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేసిన ఒరిజినల్ వీడియోను ఇక్కడ చూడండి:
వాదన లో పేర్కొన్న వీడియో,దక్షిణ ముంబైలోని అనేక ప్రాంతాలు వరదలను ఎదుర్కొన్నప్పుడు ఆగస్ట్ 2020 నాటి వీడియో అని వార్తా నివేదికలు ధృవీకరించాయి.నగరంలో గంటకు 70 కి.మీ వేగంతో గాలులు వీచాయని, వందలాది చెట్లు నేలకూలాయని, అనేక రహదారులు జలమయమయ్యాయని నివేదికలు తెలిపాయి.
కాబట్టి ఇటీవల షేర్ చేయబడిన వీడియో ఆగస్ట్ 2020 నాటిది, దీనిని ముంబైలోని కవాస్జీ పటేల్ ట్యాంక్ రోడ్‌లో చిత్రీకరించారు.
కోచినియల్ కీటకాలతో తయారు చేసిన రంగును ఉపయోగించి ‘లిప్‌స్టిక్’ తయారీ ప్రక్రియను తెలిపే వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయబడుతోంది.Digiteye India టీమ్ తమ Whatsapp టిప్‌లైన్‌లో ఈ వీడియోలోని వాస్తవాన్ని పరిశీలించమని అభ్యర్ధనని అందుకుంది.
మేము YouTubeలో మరింత పరిశీలించినప్పుడు, లిప్‌స్టిక్‌ను ఎలా తయారు చేస్తారో చూపించే ఇలాంటి అనేకమైన వాదనలను/క్లెయిమ్‌లను గమనించాము.
FACT-CHECK:
ప్రపంచవ్యాప్తంగా చాలా మంది మహిళలు మరియు బాలికలు రోజూ లిప్‌స్టిక్‌ను ఉపయోగిస్తున్నందున Digiteye India బృందం ఈ అభ్యర్థనను స్వీకరించింది. వాస్తవానికి, ప్రతి తయారీదారుడు రంగును తయారు చేయడానికి జంతువులు లేదా కీటకాల ఉపఉత్పత్తులను ఉపయోగించి తమ ఉత్పత్తులను తయారుచేయడం గురించి బహిరంగంగా అంగీకరించారు.
కోచినియల్ బగ్ప్రాథమికంగా మెక్సికో మరియు నైరుతి యునైటెడ్ స్టేట్స్(ఉష్ణమండల మరియు ఉపఉష్ణమండల)కి చెందినది,ఈ కీటకం కాక్టిపై నివసిస్తుంది,మొక్కల తేమ మరియు పోషకాలను తింటుంది.ఈ కీటకాలు ప్రిక్లీ పియర్ కాక్టి యొక్క ప్యాడ్‌లపై కనిపిస్తాయి, వాటిని మొక్కల నుండి బ్రష్ చేయడం ద్వారా సేకరించి,ఆ తర్వాత ఎండబెట్టడం జరుగుతుంది.
ఆడ కోచినియల్ బగ్‌లను సేకరించి, ఎండలో ఎండబెట్టి, చితకొట్టి, ఆపై ఒక ఆమ్ల ఆల్కహాల్‌తో కలిపి క్రిమ్సన్, పింక్, ఎరుపు, ఊదా లేదా లేత గులాబీ వంటి మిరుమిట్లు గొలిపే రంగులు తయారు చేస్తారు. ఈ కీటకం కార్మినిక్ యాసిడ్‌ను ఉత్పత్తి చేయడం వలన, ఇది ఇతర కీటకాలచే వేటాడకుండా దోహదపడుతుంది.
ఎండిన కీటకాల మొత్తం బరువులో సాధారణంగా 17-24 శాతం బరువు ఉండే కార్మినిక్ యాసిడ్‌ను శరీరం మరియు గుడ్ల నుండి సేకరించి, అల్యూమినియం లేదా కాల్షియం లవణాలతో కలిపి కార్మైన్ డైని (carmine dye)తయారు చేయవచ్చు. నేడు, కార్మైన్ డై ప్రధానంగా ఆహారంలో మరియు లిప్‌స్టిక్‌లలో (E120 లేదా సహజ ఎరుపు 4) రంగు కొరకు ఉపయోగించబడుతుంది.
మరియు కార్మినిక్ యాసిడ్ (C22H20O13) అనేది ఈ కోకినియల్ కీటకాలలో సహజంగా సంభవించే ఎరుపు రంగు గ్లూకోసిడల్ హైడ్రాక్సీయంత్రపూరిన్.
ఈ దావాను PETA (పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్‌మెంట్ ఆఫ్ యానిమల్) సౌందర్య సాధనాలపై తన నివేదికలో ఈ దావాను బలపరిచింది.”మేకప్ ఔత్సాహికులు: మీ ముఖంపై డెడ్ బగ్స్‌ను పూయడం ఆపండి” అనే శీర్షికతో కలిగి ఉంది.
BBC సైన్స్ ఫోకస్ కూడా లిప్‌స్టిక్‌లలో కోచినియల్ బగ్స్ డై వాడకాన్ని ధృవీకరిస్తుంది.
కోచినియల్ బగ్స్ డైని ఉపయోగించి లిప్‌స్టిక్ తయారీ ప్రక్రియను చూపించే అనేక వీడియోలు అందుబాటులో ఉన్నాయి. మీరు క్రింద కొన్ని వీడియోలను చూడవచ్చు:
ఎరుపు రంగు సింథటిక్ డై నుండి కూడా వస్తుంది (బొగ్గు/తారు/పెట్రోలియం ఉపఉత్పత్తుల నుండి తయారు చేయబడింది) కానీ వినియోగదారు ఉత్పత్తులలో కృత్రిమ రంగుల వాడకంపై పరిమితి ఉన్నందున, తయారీదారులు/అనేక అగ్ర బ్రాండ్‌లు తమ లేబుల్‌లపై “కోచినియల్”ని సహజమైన డై అని పేర్కొంటూ తమ ఉత్పత్తులలో దాన్ని ఉపయోగిస్తున్నారు.
ఆహార ఉత్పత్తులు లేదా లిప్‌స్టిక్ లేబుల్ పై “కార్మైన్(రంగు సంకలితం లేదా రంగు E120) , CI 75470,” “కొచినియల్ ఎక్స్‌ట్రాక్ట్,” “క్రిమ్సన్ లేక్,” “సహజ ఎరుపు 4,” లేదా “కార్మైన్” అని పేర్కొన్నట్లయితే ఉత్పత్తి ఎండిన మరియు ఉడికించిన కోచినియల్ కీటకాలను కలిగి ఉందని అర్ధం.
ఎరుపు రంగు లిప్‌స్టిక్‌లో, ఇది తప్పనిసరి. అందువలన, కొన్ని లిప్‌స్టిక్‌లలో కోచినియల్ కీటకాల/బగ్‌ల నుండి తయారైన రంగు ఉంటుందనే వాదన నిజం. వినియోగదారులు ఉత్పత్తి లేబుల్‌లను నిశితంగా పరిశీలించి నిర్ధారించుకోవాలి.
ఒకే రాయితో(ఏకశిలా) చెక్కబడిన హిందూ నిర్మాణాన్ని చూపించే ఫోటో రాజస్థాన్‌కు చెందిన 5,000 సంవత్సరాల నాటి రాతి కట్టడం అనే వాదనతో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ఒక పోస్ట్ షేర్ చేయబడుతోంది.దిగువ వాదన/దావాను చూడండి:
Digiteye India బృందం దేవాలయానికి సంబంధించిన సమాచారం కోసం చూడగా, స్థలం పేరు ఇవ్వకుండా ఇది ఒకే రాతితో చెక్కబడిన దేవాలయమనే వాదనలతో కొన్ని సంవత్సరాల క్రితం X లో క్లెయిమ్/వాదన షేర్ చేయబడిందని గమనించాము.
మేము Google రివర్స్ ఇమేజ్ సెర్చ్‌లో చిత్రం యొక్క సమాచారం కోసం ప్రయత్నించగా, ఒకే రాయితో చేసిన ఆలయం గురించి అనేక పరిశోధన పత్రాలు మరియు వార్తా నివేదికలున్నాయని తెలుసుకున్నాము. కానీ ఆలయ ప్రదేశం రాజస్థాన్ కాదు, తమిళనాడు. మరియు ఈ ఆలయాన్ని వెట్టువన్ కోయిల్ అని పిలుస్తారు, ఇది తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా, కలుగుమలైలో ఉన్న ఒకే రాక్-కట్(ఏకశిలా) ఆలయం మరియు ఇది అన్ని సోషల్ మీడియా పోస్ట్‌లలో క్లెయిమ్ చేసినట్లుగా 5000 సంవత్సరాల పురాతన ఆలయం కాక 8వ శతాబ్దం(8the century AD )లో నిర్మించబడిందని అంచనా వేయబడింది.
వెట్టువన్ కోయిల్ 760-800 AD లో ఒక ఏకశిలా ఆలయంగా నిర్మించబడింది, ఇది దీర్ఘచతురస్రాకారపు రాతి నుండి ఉద్భవిస్తున్న ద్రవిడ విమానాన్ని కలిగి ఉంటుంది. అందువల్ల, ఈ వైరల్ చిత్రం తమిళనాడులోని 8వ శతాబ్దపు ఏకశిలా దేవాలయం, క్లెయిమ్ చేసినట్లుగా రాజస్థాన్లోని 5,000 సంవత్సరాల నాటి పురాతనమైనది ఆలయం కాదు.
వాదన/దావా: : ఒకే రాయితో చెక్కబడిన హిందూ నిర్మాణాన్ని చూపించే ఫోటో భారతదేశంలోని రాజస్థాన్‌కు చెందిన 5,000 సంవత్సరాల నాటి రాతి కట్టడం అనేది వాదన.
నిర్ధారణ: తప్పుడు వాదన. చిత్రం తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాలో వెట్టువన్ కోయిల్ అని పిలువబడే 8వ శతాబ్దపు ఏకశిలా దేవాలయం మరియు ఇది క్లెయిమ్ చేసినట్లుగా 5,000 సంవత్సరాల పురాతనమైన ఆలయం కాదు.
హైదరాబాద్‌లో ఓ యువకుడు రీళ్లు (Reel) తయారు చేసేందుకు వేగంగా వస్తున్న బస్సు ముందు హఠాత్తుగా పడుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ స్టంట్ వీడియోను చాలా మంది సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో షేర్ చేశారు. రద్దీగా ఉండే రోడ్డుపై ఈ యువకుడు ప్రమాదకరమైన స్టంట్ చేస్తున్నాడని వాదన/దవా పేర్కొంది.
దావా ఇలా ఉంది: “హైదరాబాద్‌లో వేగంగా వస్తున్న బస్సు ముందు రోడ్డుపై అకస్మాత్తుగా పడుకుని ప్రమాదకరమైన స్టంట్ చేస్తూ ఒక యువకుడు తన ప్రాణాలను పణంగా పెట్టాడు. ఈ స్టంట్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది, నెటిజన్లలో ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది. .(sic)”
దిగువ వాదన/దవాలను చూడండి:
In a bid to make #reel, a youngster risked his life by doing dangerous stunt by suddenly laying on road in front of a running bus in #Hyderabad. The stunt video is now going viral on #SocialMedia, triggering outrage among netizens pic.twitter.com/5bD2XQuEAT
#Viralvideo| In a bid to make #reel, a youngster risked his life by doing dangerous stunt by suddenly laying on road in front of a running bus in #Hyderabad. The stunt video is now going viral on #SocialMedia, triggering outrage among netizens pic.twitter.com/ycNmD7ew1d
DigitEye India బృందం వైరల్ వీడియోను నిశితంగా పరిశీలించినప్పుడు అది మార్చబడిన వీడియో అని మేము గమనించాము, ఒక వ్యక్తి రోడ్డు దాటుతున్నట్లు చూపుతున్న వీడియోలోని చిత్రాన్ని మార్ఫింగ్ చేశారు. ఇక్కడ, ఈ వీడియో గ్రాబ్‌లో, యువకుడు రోడ్డుపై నడుస్తూ, బస్సు దగ్గరకు వచ్చినప్పుడు, అతను బస్సు వైపు తిరిగి రోడ్డుపై పడుకోవడం చూడవచ్చు. రోడ్డు మధ్యలో ఉన్న వ్యక్తిని చూసినప్పుడు ఏ బస్సు డ్రైవర్ అయినా వెంటనే బస్సు వేగాన్ని తగ్గించడం లేదా బ్రేక్ వేయడం చేస్తాడు కానీ నిర్లక్ష్యంగా ముందుకు వెళ్ళడు.
దిగువ చిత్రాల్లో మీరు దీన్ని గమనించవచ్చు:
ఈ సంఘటనపై తెలంగాణ పోలీసు లేదా రవాణా శాఖ నుండి ఏదైనా పోస్ట్/వివరణ ఉందా అని మేము పరిశీలించినప్పుడు, అది ఫేక్ వీడియో అని స్పష్టం చేస్తూ MD,తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్, VC సజ్జనార్ తన X అధికారిక హ్యాండిల్‌లో ఒక వివరణను గమనించాము.
ఆయన ఇచ్చిన వివరణ ఇలా ఉంది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఈ వీడియో ఫేక్. ఇది పూర్తిగా ఎడిటెడ్ వీడియో. సోషల్ మీడియాలో పాపులర్ కోసం కొందరు ఇలా వీడియోలను ఎడిట్ చేసి వదులుతున్నారు. ఇలాంటి వెకిలిచేష్టలతో ఆర్టీసీ ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం చేయడం మంచి పద్దతి కాదు. లైక్ లు, కామెంట్ల కోసం చేసే ఈ తరహా అనాలోచిత పనులను ఇతరులు అనుకరించే ప్రమాదం పొంచి ఉంది. సరదా కోసం చేసే ఎడిటెడ్ వీడియోలు ఇతరులకు ప్రాణాప్రాయం కూడా కలిగిస్తాయి. ఇలాంటి ఘటనలను #TGSRTC యాజమాన్యం సీరియస్‌గా తీసుకుంటోంది. బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది.pic.twitter.com/Eia1GCSxyr
— VC Sajjanar – MD TGSRTC (@tgsrtcmdoffice) June 21, 2024
అలాంటి ఎడిటింగ్ టెక్నిక్‌లను అనుమతించే అత్యాధునిక టెక్నాలజీలతో, కొంతమంది వీడియోలను ఎడిట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అయితే, చాలా మంది, అవి ఎడిట్ చేసిన వీడియోలనే విషయం తెలియక, సోషల్ మీడియాలో తక్షణమే పాపులర్ కావడానికి అలాంటి స్టంట్‌లను పునరావృతం చేయడం లేదా అనుకరించడం వంటివి చేస్తూ తమ ప్రాణాలకు తెగిస్తున్నారు.
కాబట్టి, హైదరాబాద్‌లో ప్రమాదకరమైన రీల్ కోసం ఈ యువకుడు వేగంగా వస్తున్న బస్సు ముందు పడుకున్నాడనే వాదన/దవా తప్పు.
వాదన/Claim: భారతీయ రైల్వే కొత్త నియమం ప్రకారం IRCTCలో స్నేహితులకు లేదా బంధువుల కోసం రైలు టికెట్లును బుక్ చేస్తే జైలు లేదా రూ.10,000 జరిమానా విధించబడుతుందనేది వాదన.
నిర్ధారణ/Conclusion:ఈ వాదన/దావా తప్పు.రైల్వే మంత్రిత్వ శాఖ అలాంటి కొత్త రూల్ ఏదీ చేయలేదు. IRCTC కూడా “వేర్వేరు ఇంటిపేర్లతో (లేదా ఇతరుల కోసం) ఇ-టికెట్ల బుకింగ్ గురించి సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న వార్తలు” తప్పు మరియు తప్పుదారి పట్టించేవి అని స్పష్టం చేసింది.
భారతీయ రైల్వే కొత్త నియమం ప్రకారం ఒక వ్యక్తి తన స్నేహితులకు లేదా బంధువుల కోసం IRCTC వెబ్‌సైట్‌లో తన వ్యక్తిగత IDని(లేదా వివిధ ఇంటి పేర్లని ) ఉపయోగించి రైలు ఇ-టికెట్లును బుక్ చేయకూడదనే ఒక సందేశం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఎవరైనా అలా చేస్తే, జైలు శిక్ష విధించబడుతుందని వాదన పేర్కొంది.
దిగువ పోస్ట్ చూడండి:
Railway Online Ticket Booking Rules Changed: Booking Train Tickets for Others via Personal IRCTC ID Can Land You In Jail
Booking train tickets for others through your personal IRCTC account may seem like a helpful gesture, but it can have severe consequences. Despite good… pic.twitter.com/yxZ6I3bXLb
ఇతరులకు టిక్కెట్లు బుక్ చేస్తే జైలు లేదా రూ.10,000 జరిమానా విధించబడుతుందని మరొక వాదన పేర్కొంది. దిగువ పోస్ట్ చూడండి:
Govt’s new rule on online train ticket booking via personal IRCTC IDs is absurd! Penalizing people with jail time and fines up to Rs. 10,000 for booking tickets for others? Srsly?! Let’s prioritize cmn sense over unnecessary regulations! #IndiaRailwayshttps://t.co/I1hkDPpNJh
ఈ వాదనలు భారతీయ రైల్వే శాఖకు సంబంధించినవి మరియు భారతదేశంలోని అన్ని తరగతుల ప్రజలచే అత్యధికంగా ఉపయోగించే రవాణా విధానం అయినందున Digiteye India బృందం ఈ వాదనలలోని వాస్తవాన్ని పరిశీలించడానికి ప్రయత్నించింది. మేము మొదట Xలో భారతీయ రైల్వే శాఖ అధికారిక హ్యాండిల్‌ను పరిశీలించగా, IRCTC అప్పటికే ఈ వాదన నకిలీదని స్పష్టం చేసిందని మరియు సరైన సమాచారం, మార్గదర్శకాలను కుడా అందించిందని గమనించాము. IRCTC అధికారిక హ్యాండిల్ యొక్క పోస్ట్ దిగువన చూడండి:
The news in circulation on social media about restriction in booking of e-tickets due to different surname is false and misleading. pic.twitter.com/xu3Q7uEWbX
The news in circulation on social media about restriction in booking of etickets due to different surname is false and misleading. pic.twitter.com/jLUHVm2vLr
— Spokesperson Railways (@SpokespersonIR) June 25, 2024
వాదన/Claim:లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవి లత ముస్లింలపై తన వైఖరిని మార్చుకున్నారని,”భారతీయ ముస్లింలు ఉగ్రవాదులు కాలేరు అని” ఆమె అన్నారనేది వాదన.
నిర్ధారణ/Conclusion: తప్పుడు వాదన. మాధవి లత ఎన్నికల ప్రచార సమయంలో ఈ మాటలు అన్నారు, తన ఓటమి తర్వాత కాదు.
2024 లోక్‌సభ ఎన్నికలలో AIMIM నాయకుడు అసదుద్దీన్ ఒవైసీ చేతిలో ఓడిపోయిన తర్వాత, హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవి లత “భారతీయ ముస్లింలు ఉగ్రవాదులు కాలేరు అని”నొక్కిచెప్పిన వీడియో వైరల్ అవుతోంది.
ప్రచారం సమయంలో,మాధవి లత తను చేసిన ముస్లిం వ్యతిరేక వ్యాఖ్యలకు మరియు ఒక బూత్‌లో కనిపించి,అక్కడి మహిళా ముస్లిం ఓటర్లను వారి బురఖాలను ఎత్తివేయమని,వారి గుర్తింపును చూపించాలని డిమాండ్ చేసినందుకు విమర్శలను ఎదురుకొన్నారు.
ఓటమి తర్వాత ఆమె మాటతీరులో మార్పు వచ్చిందని తాజా వీడియో పేర్కొంది.”భారతీయ ముస్లింలు టెర్రరిస్టులు కాలేరు” అని ఆమె చేసిన ప్రకటనకు క్రింది దావా/వాదన ఆపాదించబడింది. హిందీలో దావా/వాదన ఈ విధంగా ఉంది:”चुनाव हारते ही जिज्जी को अकल आ गई”[ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆమెకు తెలివి వచ్చింది”]
అసలు వాస్తవం ఏమిటి
Digiteye India బృందం వాట్సాప్‌లో అభ్యర్థనను అందుకుని వాస్తవాన్ని పరిశీలించగా ఏప్రిల్ 22, 2024న యూట్యూబ్ లో హైదరాబాద్ ఫెస్టివల్స్ అప్‌లోడ్ చేసిన అసలైన పోస్ట్‌ను గమనించాము. ఇది ‘హైదరాబాద్ బీజేపీ మాధవి లత ఇంటర్వ్యూ’ అనే శీర్షికతో ఉన్న ఒక ఇంటర్వ్యూలోని భాగం మరియు ఎన్నికల ప్రచారం ఊపందుకుంటున్న సమయంలో ఈ వీడియో తీయబడింది, జూన్ 4, 2024న లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత కాదు. పోలింగ్‌లో హైదరాబాద్ మే 13, 2024న జరిగింది.
ఈ వీడియోలో ఆమె పలు అంశాలపై స్పదించారు మరియు, ముస్లింలు ఉగ్రవాదులా అని అడిగినప్పుడు, భారతీయ ముస్లింలు ఉగ్రవాదులు కాలేరు, అది సాధ్యం కాదని ఆమె అన్నారు, “అయితే పేదరికంతో బాధపడే పిల్లలు, మతం పేరుతో రెచ్చగొట్టబడతారు, వారి మనస్సు ఏ దిశలో వెళ్తుంది? నేను ఏమి చెప్పగలను?” అని ఆమె వివరించారు.
సందర్భం ఏమిటంటే, ప్రతిపక్ష భారత కూటమి(INDIA bloc) ఈ పథకాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది మరియు 2022 సెప్టెంబరులో “నాలుగు సంవత్సరాల పాటు రక్షణ దళాలలోని మూడు సర్వీసుల్లోకి సైనికులను నియమించడానికి అమలు చేసిన అగ్నిపథ్” పథకాన్ని రద్దు చేస్తామని హామీ ఇచ్చింది.ఈ విధానంలో నియమించబడిన సిబ్బందిని అగ్నివీర్స్ అంటారు. సందేశం/పోస్ట్ ఇక్కడ మరియు ఇక్కడ షేర్ చేయబడింది.
అగ్నిపథ్ (అగ్నివీర్) పథకంపై సమీక్ష కోసం ఎన్.డి.ఎ వారే మనవి చేయడంతో ఈ సందేశం సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షించింది.
అసలు వాస్తవం ఏమిటి
వాస్తవ పరిశీలనకై సమాచారం కోసం వెతకగా, అధికారిక వర్గాలు అలాంటి నివేదిక ఏది జారీ చేయలేదని తెలిసింది. అదే ప్రకటించి ఉంటె, అన్ని పార్టీల అభిప్రాయాలను కోరుతూ వార్త ఛానళ్లలో ముఖ్యాంశాలుగా ఉండేవి. ప్రభుత్వ అధికారిక PIB ఆదివారం నాడు అగ్నిపథ్ పథకం పునఃప్రారంభించబడిందనే వార్తలను తోసిపుచ్చింది, మరియు సోషల్ మీడియా సందేశాన్ని నకిలీ వార్తగా పేర్కొంది. ”
సమీక్ష తర్వాత “విధి నిర్వహణ వ్యవధిని 7 సంవత్సరాలకు పొడిగించడం, 60 శాతం శాశ్వత సిబ్బంది & పెరిగిన ఆదాయంతో సహా అనేక మార్పులతో అగ్నిపథ్ పథకం ‘సైనిక్ సమాన్ పథకం’గా మళ్లీ ప్రారంభించబడిందని # నకిలీ వాట్సాప్ సందేశం పేర్కొంది. భారత ప్రభుత్వం (GOI) అలాంటి నిర్ణయం తీసుకోలేదు” అని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(PIB) తన X హ్యాండిల్‌లో స్పష్టం చేసింది.
A #fake WhatsApp message claims that the Agnipath Scheme has been re-launched as ‘Sainik Saman Scheme’ after review with several changes including duty period being extended to 7 years, 60% permanent staff & increased income#PIBFactCheck
వాదన/Claim: ‘ఈ దేశంలో ఉండాలంటే జై శ్రీరామ్ అనడం తప్పనిసరి’ అని పట్టుబట్టిన నవనీత్ రానా, 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోయిన కారణంగా ఏడుస్తున్నారనేది వాదన.
నిర్ధారణ/Conclusion: తప్పుడు వాదన. నవనీత్ రాణా యొక్క ఏప్రిల్ 2022 నాటి పాత వీడియోను అమరావతి లోక్‌సభ స్థానంలో ఆమె ఓడిపోయిన తర్వాత ఏడుస్తున్నట్లు చిత్రీకరించడానికి ఉపయోగించబడింది.
రేటింగ్: తప్పుగా చూపించే ప్రయత్నం —
Fact Check వివరాలు:
2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ టిక్కెట్‌పై మహారాష్ట్రలోని అమరావతి నుంచి పోటీ చేసిన నవనీత్ రాణా, ఎన్నికల్లో ఓటమి కారణంగా ఏడుస్తున్నారనే వాదనతో ఒక వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
క్యాప్షన్ ఇలా ఉంది: “ప్రచార సమయంలో ~ మీరు ఈ దేశంలో ఉండాలనుకుంటే, మీరు జై శ్రీరామ్ అని చెప్పాలి… ఫలితాల తర్వాత…”
నవనీత్ రాణా మాట్లాడుతున్న సందర్భాన్ని మరియు ఆమె ఆసుపత్రి బెడ్‌పై ఏడుస్తున్నట్లు వీడియోలో చూడవచ్చు.
During Campaign ~ If you want to be in this country, you should say Jai Shri Ram
వీడియో యొక్క వాస్తవ పరిశీలనలో భాగంగా Digiteye India బృందం Googleలో సాధారణ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా న్యూస్18 TV ఛానెల్ వారు మే 5, 2022న పోస్ట్ చేసిన పాత వీడియో అని గమనించాము.హెడ్ లైన్ స్పష్టంగా కనబడుతుంది.
“అరెస్టయిన మహారాష్ట్ర ఎంపి నవనీత్ రాణా ముంబైలోని ఆసుపత్రిలో చేరారు” అనే శీర్షికతో ఉన్న వీడియో, అప్పటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే నివాసం వెలుపల హనుమాన్ చాలీసా పఠించమని పిలుపునిచ్చిన తర్వాత ఆమెను తన భర్తతో పాటు అరెస్టు చేయబడినప్పుడు తీసిన వీడియో. ఇది మీడియాలో విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది.
కాబట్టి, 2024 ఎన్నికల్లో ఓటమి కారణంగా నవనీత్ రాణా ఏడుస్తున్నారనే వాదన తప్పు.
వాదన/Claim: వారణాసి లోక్‌సభ ఎన్నికల్లో ఈవీఎంల ద్వారా లెక్కించబడిన ఓట్ల మొత్తం , పోలైన ఓట్లను మించిపోయాయనే వాదన సోషల్ మీడియాలో ఒక వీడియో ద్వార ఆరోపించబడింది.
నిర్ధారణ/Conclusion: ఈ వాదన/దావా తప్పు. 2019లో గానీ, 2024లో గానీ వారణాసిలో మోదీకి పోలైన(నమోదైన) ఓట్ల సంఖ్య, ఓటర్ల సంఖ్యను మించలేదు.
రేటింగ్: తప్పుగా చూపించే ప్రయత్నం —
Fact Check వివరాలు:
ప్రధాని నరేంద్ర మోదీ లోక్‌సభ స్థానానికి పోటీ చేసిన వారణాసిలో ఈవీఎంలలో (ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లు) పోలైన ఓట్ల కంటే ఎక్కువ ఓట్లు ఆయనకు వచ్చాయని సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతోంది.
హిందీలో వాదన ఈ విధముగా ఉంది:”वाराणसी में नरेंद्र मोदी चुनाव लड़ रहे थे। 11 लाख लोगों ने वोट डाले। ईवीएम मशीन में निकले 12 लाख 87 हज़ार। ईवीएम मशीन चोर है, चुनाव आयोग चोरों का सरदार”(తెలుగు అనువాదం:”వారణాసి ఎన్నికల్లో నరేంద్ర మోదీ పోటీ చేశారు. 11 లక్షల మంది ఓటు వేయగా, ఈవీఎం యంత్రం(EVM machine) నుంచి 12 లక్షల 87 వేల ఓట్లు వచ్చాయి. ఈవీఎం యంత్రం(EVM machine) ఒక దొంగ, ఎన్నికల కమిషన్ ఆ దొంగల నాయకుడు”)
వారణాసిలో EVMలకు సంబంధించిన 2019 ఎన్నికల గురించి ఇటీవల తాజాగా చేసిన ఇలాంటి దావాను మేము గుర్తించాము.కింద చూడవచ్చు:
2019 में वाराणसी चुनाव में 11 लाख वोट डाले गए,
लेकिन EVM में 12 लाख 87000 वोट गिने गए।
ఆల్ ఇండియా బ్యాక్‌వర్డ్ అండ్ మైనారిటీ కమ్యూనిటీస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (BAMCEF) అధ్యక్షుడు వామన్ మెష్రామ్ ఈ వీడియో ద్వార వాదన/దావా చేసారు,అతను ఎన్నికలలో EVMల వాడకాన్ని త్రీవంగా విమర్శించారు. జనవరి 31, 2024న కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయం ముందు ఈవీఎంల (EVM)ల వాడకాన్ని విమర్శిస్తూ దాని నిరసనకు నాయకత్వం వహించారు.
FACT-CHECK
ముందుగా, పోస్ట్ జూన్ 1,2024న జరిగిన ఓటింగ్ కంటే చాలా ముందుగానే ఏప్రిల్ 12, 2024న షేర్ చేయబడింది.కాబట్టి, ఇది 2024 ఎన్నికలకు వర్తించదు. 2019లో ప్రధాని మోదీ వారణాసి నుంచి విజయవంతంగా పోటీ చేసినందున, 2019 ఎన్నికల్లో నమోదైన మొత్తం ఓట్ల గణాంకాలను మేము(Digiteye India Team)పరిశీలించాము.
2019 లోక్‌సభ ఎన్నికలలో 18,56,791 మంది ఓటర్లు ఉన్నారు మరియు ECI గణాంకాల ప్రకారం, అదనంగా 2,085 పోస్టల్ ఓట్లతో పాటు, EVMలలో నమోదై,లెక్కించబడిన మొత్తం ఓట్లు సంఖ్య 10,58,744. ఈ గణాంకాలు భారత ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.
ఇటీవలి 2024 లోక్‌సభ ఎన్నికల లెక్కల ప్రకారం వారణాసి నియోజకవర్గంలో 19,97,578 మంది ఓటర్లు ఉన్నారు.నమోదైన ఓట్లు 11,27,081 మరియు పోస్టల్ ఓట్లు 3,062 తో కలిపి మొత్తం ఓట్ల సంఖ్య 11,30,143. ECI వెబ్‌సైట్లో అందుబాటులో ఉన్న డేటా ప్రకారం, PM మోడీ 1,52,513 ఓట్ల తేడాతో లేదా 52.24% ఓట్ షేర్‌తో గెలిచారు. కాబట్టి, ఈ వాదన/దావా తప్పు.
మే 21, 2024న లండన్ నుండి సింగపూర్ వెళ్లే సింగపూర్ ఎయిర్‌లైన్స్ విమానం తీవ్ర అల్లకల్లోలాన్ని/కుదుపులను(టర్బులెన్సు) ఎదుర్కొన్న కారణంగా ఒక ప్రయాణికుడు మరణించగా, 30 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. బోయింగ్ 777-300ER 6,000 అడుగుల లోతుకు పడిపోవడంతో బ్యాంకాక్‌లో అత్యవసర ల్యాండింగ్ చేయవలసి వచ్చింది.
(బహుశా తుఫాను ఫలితంగా ఆకస్మిక,అనూహ్య గాలి కదలికల వలన విమానంలో జరిగే అల్లకల్లోలాని విమానం టర్బులెన్సుగా పరిగణిస్తారు)
ఈ సంఘటన తర్వాత, అల్లకల్లోలంగా ఉన్న విమానం వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. క్లిప్‌లో విమానం తీవ్రంగా కంపించడంతో ప్రయాణికులు అరుస్తున్నట్లు చూడవచ్చు.
“నా ప్రగాఢ సానుభూతి…సింగపూర్ ఎయిర్‌లైన్స్ #Boeing777 లండన్-సింగపూర్ విమానం ఒకరోజు లేఓవర్ సమయంలో తీవ్ర లోపం ఎదుర్కొనడంతో ఒక ప్రయాణికుడు మరణించగా, 30 మంది గాయపడ్డారు”, అనే శీర్షికతో ఒక X వినియోగదారు వీడియోను X లో షేర్ చేసుకున్నారు.
Digiteye India టీం వైరల్ వీడియో నుండి కీఫ్రేమ్‌లను తీసుకొని రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా వీడియో యొక్క మూలాన్ని గుర్తించి అది సంబంధం లేని 2019 సంఘటనగా గుర్తించారు.ఈ వీడియో ఫుటేజ్ వాస్తవానికి జూన్ 16, 2019న ప్రిస్టినా, కొసావో నుండి స్విట్జర్లాండ్‌లోని బాసెల్‌కి వెళ్లే సమయంలో తీయబడింది. ALK ఎయిర్‌లైన్స్ బోయింగ్ 737లో ఈ అల్లకల్లోలం ఏర్పడింది.మిర్జేతా బాషా అనే ప్రయాణికుడు ఈ వీడియోను చిత్రీకరించినట్లు సమాచారం.ఫ్లైట్ అటెండెంట్‌ని మరియు ఆమె డ్రింక్ కార్ట్‌ను సీలింగ్ తగిలేలా విమానం తీవ్రమైన కుదుపులకు లోనవడంతో ప్రయాణీకులు తమ వస్తువులను త్వరత్వరగా భద్రపరుచుకోవడం వీడియోలో చూడవచ్చు.విమానంలో గందరగోళం/కుదువులతో ఉన్నప్పటికీ, విమానం అత్యవసర పరిస్థితిని ప్రకటించకుండా సాధారణంగా ల్యాండ్ చేయబడింది. దీనిని వార్తా సంస్థలు కూడా నివేదించాయి.
ABC న్యూస్ నివేదిక ప్రకారం, బాసెల్‌కు చేరుకున్న తర్వాత విమానంలో ఉన్న 121 మంది ప్రయాణికులలో 10 మంది స్వల్ప గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు. పలు మీడియా సంస్థలు ఈ ఘటనను కవర్ చేస్తూ ఆ సమయంలోని వీడియోను షేర్ చేశాయి.
అందువలన, వీడియో సింగపూర్ ఎయిర్‌లైన్స్ కు సంబంధించిన దృశ్యలంటూ షేర్ చేయబడుతున్న వాదన తప్పు. ఇది ALK ఎయిర్‌లైన్స్ బోయింగ్ 737లో ప్రిస్టినా, కొసావో నుండి స్విట్జర్లాండ్‌లోని బాసెల్‌కు వెళ్లే సమయంలో, జూన్ 16, 2019లో జరిగిన వేరొక సంఘటన నుండి తీసుకోబడిన దృశ్యాలు.
వాదన/Claim: మే 21, 2024న లండన్ నుండి సింగపూర్ వెళ్లే సింగపూర్ ఎయిర్‌లైన్స్ విమానం తీవ్ర గందరగోళానికి/కుదుపులకు లోనయిందంటూ వాదన చేయబడింది.
నిర్ధారణ/Conclusion: వీడియో క్లిప్ తప్పు. ఇది సింగపూర్ ఎయిర్‌లైన్స్ విమానం నుండి కాదు, 2019లో ప్రిస్టినా, కొసావో నుండి స్విట్జర్లాండ్‌లోని బాసెల్‌కు ప్రయాణిస్తున్న ALK ఎయిర్‌లైన్స్ బోయింగ్ 737లో జరిగిన కుదుపులు/గందరగోళం.