వాదన/Claim: ​ఇంధన కొరత కారణంగా ఎయిర్ ఇండియా జూలై వరకు తన అంతర్జాతీయ విమాన సర్వీసులన్నింటినీ రద్దు చేసిందనేది వాదన.

నిర్ధారణ/Conclusion: ఈ  వాదన అవాస్తవం. ఇంధన కొరత కారణంగా ఎయిర్ ఇండియా జూలై వరకు తన అంతర్జాతీయ విమాన సర్వీసులన్నింటినీ రద్దు చేయలేదు. ఎయిర్ ఇండియా సీఈఓ, ఎండీ క్యాంప్‌బెల్ విల్సన్ కొన్నినిర్దేశిత మార్గాల్లో మాత్రం సర్వీసులని తగ్గిస్తున్నట్టు ధృవీకరించినప్పటికీ, అన్ని అంతర్జాతీయ విమాన సర్వీసులను నిలిపివేస్తున్నట్లు ఎటువంటి ఆధారాలు లేవు.. 

రేటింగ్/Rating: అవాస్తవం

******************************************************

వాస్తవ పరిశీలన పూర్తి వివరాలను వీడియోలో చూడండి

లేదా వాస్తవ పరిశీలన కధనం చదవండి

******************************************************

ఎయిర్ ఇండియా తన అంతర్జాతీయ విమానయానాలన్నింటినీ రద్దు చేస్తోందని పలువురు సోషల్ మీడియా వినియోగదారులు పేర్కొన్నారు. ‘GBX_Press’ అనే ధృవీకరించబడిన (verified) ‘X’ వినియోగదారు ఒక పోస్ట్‌ను ఇలా షేర్ చేసారు : “తాజా సమాచారం: ఆంక్షలు మరియు ఇరాన్ యుద్ధం కారణంగా ఏర్పడిన ఇంధన కొరత దృష్ట్యా, ఎయిర్ ఇండియా జూలై వరకు తన అంతర్జాతీయ విమానయానాలన్నింటినీ రద్దు చేసింది.” ఈ పోస్ట్‌తో పాటు గాలిలో ఎగురుతున్న ఎయిర్ ఇండియా విమానం యొక్క చిత్రాన్ని జత చేయబడింది . ఆ పోస్ట్‌ను కింద చూడవచ్చు –

ఇతర వినియోగదారులు ఇలాంటి వాదనలనే ఇక్కడ మరియు ఇక్కడ షేర్ చేశారు.

 వాస్తవ పరిశీలన 

ఈ వాదనను పరిశీలించాలని నిర్ణయించుకున్న డిజిట్-ఐ బృందం, అది అవాస్తవమని గుర్తించింది. జూలై వరకు తమ అంతర్జాతీయ కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించలేదు. సదరు విమానయాన సంస్థ కొన్ని మార్గాల్లో పరిమిత సర్దుబాట్లు చేస్తూ సేవలను తగ్గిస్తున్నప్పటికీ, అంతర్జాతీయ విమానాలన్నీ రద్దయ్యాయని సూచించే అధికారిక ధృవీకరణ లేదా విశ్వసనీయమైన ఆధారాలు ఏవీ లేవు.

Details:

ఈ విషయం గురించి మరింత తెలుసుకోవడానికి మేము మొదట “ఎయిర్ ఇండియా అన్ని అంతర్జాతీయ విమానాలను రద్దు చేసింది” అనే పదబంధంతో వెబ్ శోధన నిర్వహించాము. ఒక NDTV నివేదిక ప్రకారం, జెట్ ఇంధన ధరల పెరుగుదల నేపథ్యంలో ఎయిర్ ఇండియా జూలై వరకు అంతర్జాతీయ విమానాలను తగ్గించనుంది. ఆ నివేదికలో CEO మరియు మేనేజింగ్ డైరెక్టర్ క్యాంప్‌బెల్ విల్సన్ ప్రకటనను ప్రస్తావించారు, “మేము ఏప్రిల్ మరియు మే నెలలకు కొన్ని విమాన సర్వీసులను తగ్గించాము… జెట్ ఇంధన ధరలలో భారీ పెరుగుదల, దానికి తోడు గగనతల మూసివేతలు మరియు సుదీర్ఘ ప్రయాణ మార్గాల కారణంగా అనేక అంతర్జాతీయ విమానాలను నడపడం మాకు లాభదాయకం కాకుండా పోయింది.” మొత్తం రద్దువిమానాల గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. నివేదికలోని ఒక భాగాన్ని కింద చూడవచ్చు.

మే-జూలై నెలల్లో ఎయిర్ ఇండియా తన అంతర్జాతీయ విమాన సర్వీసులలో కొన్నింటిని తగ్గించనుందని (పూర్తిగా రద్దు చేయడం లేదని ) మరొక ‘హిందుస్థాన్ టైమ్స్’ నివేదిక పేర్కొంది. “మార్చి 31, 2026తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఎయిర్ ఇండియా గ్రూప్ ₹22,000 కోట్లకు పైగా నష్టాన్ని చవిచూసిందని అంచనా” అని ఆ నివేదిక వెల్లడించింది. అంతేకాకుండా, విమాన ఛార్జీల పెంపు మరియు ఇంధన సర్ఛార్జీల విధింపు వంటి ధరల పరమైన చర్యలు తీసుకున్నప్పటికీ, అవి ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఆ నివేదికలోని ఒక భాగాన్ని కింద చూడవచ్చు –

ఎయిర్ ఇండియా వెబ్‌సైట్ మరియు తాజా సమాచారలలో అంతర్జాతీయ విమాన సేవలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ఎటువంటి ప్రకటన లేదు. ఏప్రిల్ 7, 2026న ఇంధన సర్ఛార్జీల సవరణలకు సంబంధించి ఎయిర్ ఇండియా ఒక ప్రకటన విడుదల చేసింది, కానీ అంతర్జాతీయ విమానాలన్నింటినీ రద్దు చేయడం గురించి అందులో ఏమీ పేర్కొనలేదు.

డిజిట్-ఐ బృందం అంతర్జాతీయ విమానాల లభ్యత గురించి స్వయంగా తనిఖీ చేయాలనీ, కోల్‌కతా నుండి డెన్మార్క్‌కు వెళ్లే విమానం బుకింగ్ ప్రయత్నించగా, ఎయిర్ ఇండియా ఇప్పటికీ బుకింగ్‌లను అనుమతిస్తోందని కనుగొన్నారు. దీన్నిబట్టి మే మరియు జూలై మధ్య అన్ని అంతర్జాతీయ విమానాలు రద్దు కాలేదని నిరూపణ అవుతుంది. బుకింగ్‌ స్క్రీన్‌షాట్‌ను చూడవచ్చు :

కాబట్టి, ఈ వాదన అవాస్తవం/అసత్యం.

******************************************************
మరికొన్ని వాస్తవ పరిశీలన కధనాలు:

భారతదేశం ఇప్పటికే దేశవ్యాప్తంగా వినియోగదారుల మధ్య ఒకరి నుంచి మరొకరికి విద్యుత్ ట్రేడింగ్‌ను ప్రారంభించిందా? వాస్తవ పరిశీలన

భారత గణతంత్ర దినోత్సవ పరేడ్ సందర్భంగా బైక్ విన్యాసాలు చేస్తున్న బైకర్లు కింద పడిపోయారా ?వాస్తవ పరిశీలన

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.

Exit mobile version