ఎలోన్ మస్క్ సోమాలిలాండ్ జెండా ఎమోజీని ఆ దేశం యొక్క గుర్తింపు చిహ్నంగా Xలో చేర్చారా? వాస్తవ పరిశీలన
వాదన/Claim : ఎలోన్ మస్క్ సోమాలిలాండ్ జెండా ఎమోజీని ఆ దేశం యొక్క గుర్తింపు చిహ్నంగా Xలో చేర్చారనేది వాదన/దావా .
నిర్ధారణ /Conclusion : ఈ వాదనలో నిజం లేదు.X(ఎక్స్ ) ప్లాట్‌ఫామ్‌లో సోమాలిలాండ్ జెండా ఎమోజీని చేర్చినట్లుగా ఎలాంటి ఆధారాలు లేవు,అలాగే ఎలాన్ మస్క్ కూడా దీనిపై ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అంతేకాకుండా,ఈ జెండాను X(ఎక్స్ ) ప్లాట్‌ఫామ్‌లో చెర్చబడనందున,ఎక్స్ వినియోగదారులు దీనిని ఏ పోస్ట్‌లోనూ ఉపయోగించలేరు.
రేటింగ్ /Rating : పూర్తిగా తప్పు —
ఎలోన్ మస్క్ తన ఎక్స్‌ప్లాట్‌ఫామ్ లో సోమాలిలాండ్ జెండాను చేర్చారని పలువురు సోషల్ మీడియా వినియోగదారులు పేర్కొన్నారు. ‘సైద్అడెన్365’ అనే ఎక్స్ యూజర్, “ఎలోన్ మస్క్ అధికారికంగా సోమాలిలాండ్ జెండా ఎమోజీని ఎక్స్ ప్లాట్‌ఫామ్‌లో (గతంలో ట్విట్టర్) చేర్చారని ” పేర్కొంటూ ఈ వాదన చేశారు.
ఆ పోస్ట్‌లో రెండు చిత్రాలు ఉన్నాయి: ఒకటి, ఎలాన్ మస్క్ ఫోటోపై “కొత్త స్వతంత్ర దేశం” ఆవిర్భవిస్తోందనే వాక్యం ఉన్న “బ్రేకింగ్ న్యూస్” చిత్రం/గ్రాఫిక్. రెండవ చిత్రంలో జెండా ఎమోజీల గ్రిడ్ మధ్యన సోమాలిలాండ్ జెండాను సూచిస్తూన్న గుర్తును క్రింది పోస్టులో చూడవచ్చు.
Elon Musk has officially added the Somaliland flag emoji to the X platform (formerly Twitter). Thank you, @elonmusk ; this was long overdue. pic.twitter.com/SKcnfWyz2t
— Said Aden (@SaidAden365) December 29, 2025
ఇతర వినియోగదారులు కూడా ఇలాంటి వాదనలే ఇక్కడ మరియు ఇక్కడ షేర్ చేసారు.
వాస్తవ పరిశీలన
DigitEYE India బృందం ఈ వాదనను పరిశీలించగా , అది అవాస్తవమని కనుగొన్నారు. ఇప్పటివరకు, ఎక్స్ తన ప్లాట్‌ఫామ్‌లో సోమాలిలాండ్ జెండాను చేర్చలేదు, అలాగే ఎలాన్ మస్క్ కూడా దీనిపై ఎలాంటి వ్యాఖ్య చేయలేదు,మరియు అధికారికంగా దీని గురించి ఎటువంటి సమాచారం లేదు. జెండాను ఇంకా చేర్చనందున వినియోగదారులు దానిని ఉపయోగించుకోలేరు.
వివరాలు
ఆ వాదన గురించి మరింత తెలుసుకోవడానికి మేము మొదటగా “X సోమాలిలాండ్ జెండాను చేర్చింది” అనే పదబంధంతో అంతర్జాలంలో అన్వేషించగా, ఎలాన్ మస్క్ ప్లాట్‌ఫామ్ అయిన X అలాంటి జెండాను చేర్చిందని సూచించే విశ్వసనీయమైన నివేదికలు లేదా ఆధారాలు లేవని, మరియు ఇజ్రాయెల్ సోమాలిలాండ్‌ను గుర్తించినట్లు వార్తలు ఉన్నాయి గాని X ఆ జెండాను చేర్చినట్లు ఎలాంటి వార్తలు లేవని తెలుసుకున్నాము.
దీని తరువాత, జెండా ఎమోజీలను(Flag Emojis) ఎలా నిర్ణయిస్తారనే దానిపై తెలిపే ఒక నివేదికను గమనించాము. దాని ప్రకారం, “ISO 3166 నిర్వహణ సంస్థ, ఐక్యరాజ్యసమితిలో సభ్య దేశాలు కాని భౌగోళిక ప్రాంతాలకు లేదా దేశాలకు అధికారిక దేశ ‘కోడ్’లను కేటాయించదు.” నివేదికలోని కొంత భాగాన్ని కింద చూడవచ్చు .
ISO 3166 కోడ్‌లు, దేశాలు మరియు వాటి ఉపవిభాగాల కోసం సంక్షిప్తమైన కోడ్‌లు- వీటిని ప్రపంచవ్యాప్తంగా IT, లాజిస్టిక్స్ మరియు డేటాబేస్‌లలో గుర్తింపు కోసం ఉపయోగిస్తారు, వీటిని ISO మూడు భాగాలుగా నిర్వచించింది:
ఉదాహరణ: ఆల్ఫా-2 (రెండు అక్షరాలు, ఉదాహరణకు, సోమాలియా కోసం SO), ఆల్ఫా-3 (మూడు అక్షరాలు, ఉదాహరణకు, SOM), మరియు సంఖ్యా రూపం (మూడు అంకెలు, ఉదాహరణకు, సోమాలియా కోసం 706).
సోమాలిలాండ్ గుర్తింపు లేని రాజ్యం మరియు అంతర్జాతీయ గుర్తింపు, మరియు ఐక్యరాజ్యసమితి (UN)లో సభ్యత్వం కలిగిలేనందున, అధికారిక ISO 3166 కోడ్ లేదు. ISO 3166 ప్రమాణాలు కేవలం ఐక్యరాజ్యసమితి సభ్య దేశాలు మరియు గుర్తింపు పొందిన భూభాగాలను మాత్రమే పరిగణలోకి తీసుకుంటుంది, సోమాలిలాండ్ దశాబ్దాలుగా స్వతంత్రంగా పనిచేస్తున్నప్పటికీ, మొత్తం ప్రాంతానికి SO (సోమాలియా) వంటి కోడ్‌లను కేటాయిస్తుంది.
ప్రపంచ ప్రమాణాల దృక్కోణం నుండి చూస్తే, సోమాలిలాండ్ సాంకేతికంగా సోమాలియాలోని ఒక ప్రాంతం కాబట్టి, అది సోమాలియా కోడ్ (SO) పరిధిలోకి వస్తుంది. అందువల్ల, సోమాలిలాండ్‌కు అధికారిక జెండా ఎమోజీ లేదు.
ఆపిల్ సపోర్ట్ కమ్యూనిటీ ప్లాట్‌ఫామ్‌లో ఒక వినియోగదారుడు జనవరి 2022లో సోమాలిలాండ్ ఎమోజీని అందించాలని అభ్యర్థిస్తూ ఒక ప్రశ్న లేవనెత్తగా, ISO 3166 కోడ్ లేకపోవడం వల్ల ఎమోజీని సృష్టించడం సాధ్యం కాదని సమాధానం వచ్చింది. దీనికి సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను కింద చూడవచ్చు .
చివరగా, సోమాలిలాండ్ జెండాను చేర్చడం గురించి ఎలాన్ మస్క్ ఎలాంటి వ్యాఖ్య /ప్రకటన చేయలేదు. మేము Xలో సోమాలిలాండ్ జెండాను ఉపయోగించడానికి ప్రయత్నించినప్పుడు, ఎలాంటి ఫలితాలు రాలేదు. జెండా కోసం కీబోర్డ్‌లో దాని పేరును టైప్ చేసి ప్రయత్నించగా , కింద చూపిన విధంగా “ఎమోజీలు కనుగొనబడలేదు” అనే ఫలితం వచ్చింది.
అందువల్ల, ఆ వాదన తప్పు.
******************************************************
మరికొన్ని వాస్తవ పరిశీలన కధనాలు:
యూరప్‌లోని ఒక చర్చిని నిజంగా నరసింహ దేవాలయంగా మార్చారా? వాస్తవ పరిశీలన
