వాదన/Claim : తెలంగాణలోని మంచిర్యాలలో ఒక కాథలిక్ పాఠశాలను ‘ఆర్‌ఎస్‌ఎస్ తీవ్రవాదులు ధ్వంసం’ చేశారని, ప్రిన్సిపాల్ ఫాదర్ రైమోన్ జోసెఫ్‌పై దాడి చేశారని వైరల్ వీడియోలో దావా/వాదన చేయబడింది.

నిర్ధారణ /Conclusion : తప్పుగా చూపించడం. ఉత్తరప్రదేశ్‌లోని హమీర్‌పూర్‌లో జరిగిన ఒక వివాహంలో అతిథులు చిప్స్ వంటి ఉచిత స్నాక్స్ కోసం పరిగెత్తడంతో తొక్కిసలాట లాంటి పరిస్థితి ఏర్పడింది,ఇదే గందరగోళాన్ని మనం వీడియోలో చూడవచ్చు. వీడియో  కాథలిక్ పాఠశాలలో జరిగిన సంఘటన సంబంధించింది కాదు.

 రేటింగ్ /Rating : తప్పుగా చూపించడం–


తెలంగాణలోని మంచిర్యాలలోని ఒక కాథలిక్ పాఠశాలపై ఆర్‌ఎస్‌ఎస్ తీవ్రవాదులు దాడి చేశారనే వాదనతో పాటు,దానికి సంబంధించిన క్లిప్‌ను అనేక మంది సోషల్ మీడియా వినియోగదారులు షేర్ చేశారు. X యూజర్ ‘కుస్సిఖుయేలాఫ్న్’ వాదనను ఈ విధంగా షేర్ చేసారు , “వారు ప్రిన్సిపాల్ ఫాదర్ రైమోన్ జోసెఫ్ పై దాడి చేసి, బలవంతంగా అతని నుదిటిపై తిలకం పెట్టారు”.”ఇది గాంధీగారి భారతదేశం కాదు”,ఈ క్లిప్ను 35,500 కంటే ఎక్కువ మంది చూసారు ,దీనిని క్రింద చూడవచ్చు :

వాస్తవ పరిశీలన

DigitEYE India బృందం ఈ వాదనను దర్యాప్తు చేసి,అది అబద్ధమని కనుగొన్నారు.ఈ క్లిప్‌లో ఆర్‌ఎస్‌ఎస్ తీవ్రవాదులు తెలంగాణలోని కాథలిక్ పాఠశాలను ధ్వంసం చేసినట్లు లేదా ఫాదర్ రైమోన్ జోసెఫ్‌ను కొడుతున్నట్లు కాకుండ, ఉత్తరప్రదేశ్‌లోని హమీర్‌పూర్‌లో జరిగిన ఒక వివాహం వేడుకలో, అతిథులు ఉచిత ఆహారం కోసం పరుగెత్తుతు గందరగోళం సృష్టించడం చూడవచ్చు.

మూల(అసలు )వీడియోను కనుగొనడానికి మేము మొదట రివర్స్ ఇమేజ్ సెర్చ్ (reverse image search) చేయగా, 27 నవంబర్, 2025న ఒరిస్సాపోస్ట్ లైవ్ అప్‌లోడ్ చేసిన యూట్యూబ్ షార్ట్‌ను మేము కనుగొన్నాము. క్లిప్ యొక్క శీర్షిక “ హమీర్‌పూర్ సామూహిక వివాహంలో ఫలహారాల లూటీ ” మరియు పరిస్థితిని వివరించే వివరణతో అప్‌లోడ్ చేయబడింది. దిగువ స్క్రీన్‌షాట్‌ను చూడవచ్చు :

ఇదే సంఘటనను ఇతరులు నివేదించిన రిపోర్టును ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు:

మరియు హమీర్‌పూర్ సామూహిక వివాహాల సంఘటన వాస్తవంగా జరిగిందా లేదని మేము “సామూహిక వివాహంలో అతిథులు స్నాక్స్ ను దోచుకున్న సంఘటన”అనే పదంతో అన్వేషించగా, Big TV వారు నివేదించిన రిపోర్టును కనుగొన్నాము.
నవంబర్ 28, 2025న వారు ప్రచురించిన నివేదిక ప్రకారం, “ఈ వారం ఉత్తరప్రదేశ్‌లో జరిగిన సామూహిక వివాహ వేడుక హింసాత్మకంగా గందరగోళంగా మారింది. హమీర్‌పూర్ జిల్లాలోని పేద జంటల కోసం ఈ కార్యక్రమం నిర్వహించబడింది. సంతోషమైన వేడుకగా ప్రారంభమైన త్వరగా అది  ప్రమాదకరమైన తొక్కిసలాటగా మారింది.” దిగువ నివేదికలోని కొంత భాగాన్ని చూడవచ్చు :

మరియు  నవంబర్ 27, 2025న NDTV ప్రచురించిన మరో నివేదిక ప్రకారం, “ముఖ్యమంత్రి సామూహిక వివాహ పథకం కింద 383 మంది పేద జంటల సామూహిక వివాహం రథ్ పట్టణంలోని బ్రహ్మానంద్ మహావిద్యాలయ క్రీడా మైదానంలో నిర్వహించబడింది. జంటల వివాహ ఆచారాలు పూర్తయిన తర్వాత, అతిథులు ఉచిత స్నాక్స్ (చిప్స్ ప్యాకెట్లను) కోసం పరుగెత్తడంతో, అది గందరగోళానికి దారి తీసిందని పేర్కొంది.

మరోవైపు, పాఠశాలపై దాడి గురించిన సమాచారం కోసం అన్వేషించగా, 2024 ఏప్రిల్ 16న రామ నవమి యూనిఫాం వివాదంపై కాషాయ దుస్తులు ధరించిన ఒక గుంపు ఒక మిషనరీ పాఠశాలపై దాడి చేసి ధ్వంసం చేసిందని ‘సబ్రంగ్’ ప్రచురించిన పాత నివేదికను మేము కనుగొన్నము. వారు మదర్ థెరిసా విగ్రహాన్ని ధ్వంసం చేసి, ప్రిన్సిపాల్ ఫాదర్ జైమోన్ జోసెఫ్ (క్లెయిమ్‌లో పేర్కొన్నట్లు రైమోన్ కాదు) పై దాడి చేసి, బలవంతంగా తిలకం పెట్టారని నివేదిక పేర్కొంది . క్రింద నివేదికలోని కొంత భాగాన్ని చూడవచ్చు:

కాబట్టి, దావా/వాదన చేయబడిన వీడియోలోని ఘటన ఉత్తరప్రదేశ్‌లోని హమీర్‌పూర్‌లో ఒక వివాహంలో జరిగిన ఘటన.

కాబట్టి, వీడియో ఆధారంగా చేసిన వాదనలో తప్పుగా చూపించే ప్రయత్నం జరిగింది.

******************************************************
మరికొన్ని వాస్తవ పరిశీలన కధనాలు:

ఈ వీడియోలో చూపినట్టు ఐశ్వర్య రాయ్ బచ్చన్ ప్రధాని మోదీని ఆపరేషన్ సిందూర్ విషయంలో ప్రశ్నిస్తున్నారా ?వాస్తవ పరిశీలన

ఆధార్ కార్డు ఉన్న భారతీయ పౌరులకు ప్రధాని మోదీ ఉచిత స్ప్లెండర్ బైక్ పథకాన్ని ప్రకటించారా? వాస్తవ పరిశీలన

 

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.

Exit mobile version