వాదన/Claim : 2024-25 అసెస్‌మెంట్ సంవత్సరానికి ‘ఆదాయపు పన్ను రిటర్న్స్’ గడువు సెప్టెంబర్ 30 వరకు పొడిగించబడిందనేది వాదన/దావా.

నిర్ధారణ/Conclusion : తప్పుడు వాదన. ‘ఆదాయపు పన్ను రిటర్న్స్’ చివరి తేదీ సెప్టెంబర్ 30న వరకు పొడిగించబడిందనేది తప్పుడు వార్త. ‘ఆదాయపు పన్ను రిటర్న్స్’ గడువు 16 సెప్టెంబర్, 2025 అని అధికారిక ప్రభుత్వ వర్గాలు ధృవీకరించాయి.

రేటింగ్/Ratingపూర్తిగా అబద్ధం/తప్పు 


ఇటీవల, చాలా మంది సోషల్ మీడియా వినియోగదారులు ‘ఆదాయపు పన్ను రిటర్న్స్'(ఐటీఆర్) గడువును సెప్టెంబర్ 30 వరకు పొడిగించినట్లు పేర్కొంటూ నకిలీ నోటీసును షేర్ చేసారు.  X వినియోగదారు ‘RohitAg81157’ 14 సెప్టెంబర్ 2025న “#itrduedateextension #ITR2025” శీర్షికతో అటువంటి నోటీసును షేర్ చేసారు.

“V. రజిత, కమీషనర్ ఆఫ్ ఇన్‌కమ్ టాక్స్ (మీడియా & టెక్నికల్ పాలసీ) పేరుతొ ఉన్న 14 సెప్టెంబర్ 2025 తేదీ నాటి నోటీసులో ,”ITR ఫారమ్‌లలోని ‘సవరణలు,సిస్టమ్ డెవలప్‌మెంట్ అవసరాలు మరియు వాటాదారుల సమస్యలు’ పొడిగింపుకు కారణాలుగా పేర్కొంది. పోస్ట్ 10,000 కంటే ఎక్కువ వీక్షణలను పొందింది, క్రింద చూడవచ్చు:

 వాస్తవ పరిశీలన

DigitEYE India బృందం ఈ దావాను తనిఖీ చేయాలని నిర్ణయించుకొని పరిశీలించగా, 30 సెప్టెంబర్ 2025 వరకు పొడిగింపు కల్పితమని,అందులో వాస్తవం లేదని కనుగొన్నారు. అధికారిక రికార్డులు ప్రకారం నాన్-ఆడిట్ కేసుల (ITR-1 నుండి ITR-4) మొట్టమొదటి గడువు 31 జూలై 2025, అయితే దానిని మే నెలలో 15 సెప్టెంబర్ 2025 వరకు పొడిగించబడింది.

కానీ చివరి రోజున పోర్టల్/వెబ్ సైట్ అవాంతరాల కారణంగా, IT శాఖ గడువు తేదీని ఒక రోజు పెంచుతూ సెప్టెంబర్ 16వ తేదీ వరకు పొడిగించింది. సెప్టెంబర్ 30 వరకు ఇంకా పొడిగిస్తున్నట్లు ప్రకటనలాంటిదేదీ చేయలేదు.

పూర్తి వివరాలు:

14 సెప్టెంబర్ 2025న, ఆదాయపు పన్ను శాఖ సోషల్ మీడియా ఖాతా ‘ఇన్‌కమ్‌టాక్స్ఇండియా’ ఈ పుకారును కొట్టిపారేస్తు క్రింది వివరణను పోస్ట్ చేసింది:

“ఐటిఆర్‌లను దాఖలు చేయడానికి గడువు తేదీని 30.09.2025 . ✅ వరకు పొడిగించారని పేర్కొంటూ ఒక నకిలీ వార్త ప్రచారంలో ఉంది. ITRలను దాఖలు చేయడానికి గడువు తేదీ 15.09.2025గానే ఉంటుంది.” దిగువ పోస్ట్‌ను చూడవచ్చు :

IT డివిభాగం వారు  చేసిన రెండు పోస్ట్‌లను క్రింద చూడవచ్చు:

మరుసటి రోజు అంటే సెప్టెంబరు 15న,’ఆదాయపు పన్ను శాఖ ఖాతా’ మరొక ప్రకటన ద్వారా, గడువు తేదీని 16 సెప్టెంబర్, 2025 వరకు పొడిగించినట్లు తెలియజేసింది. గడువు తేదీని 30 సెప్టెంబర్, 2025 వరకు పొడిగించినట్లు ఎక్కడా పేర్కొనబడలేదు. దిగువ పోస్ట్‌ను చూడవచ్చు:

మేము 15 సెప్టెంబర్ 2025న జారీ చేయబడిన అధికారిక CBTD సర్క్యులర్‌ను పరిశీలించగా, ఇ-ఫైలింగ్ పోర్టల్ ఓవర్‌లోడ్‌ కారణంగా AY 2025-26 ‘ఆదాయపు పన్ను రిటర్న్స్'(ఐటీఆర్) గడువును 16 సెప్టెంబర్ 2025 వరకు మాత్రమే పొడిగిస్తున్నట్లు పేర్కొనటం గమనించాము.

దావా చేయబడిన విధంగా ‘సవరణలు, సిస్టమ్ డెవలప్‌మెంట్ అవసరాల’కారణంగా,సెప్టెంబర్ 30న వరకు గడువును పొడిగిస్తున్నట్లు CBTD సర్క్యులర్‌ ఎక్కడ పేర్కొనలేదు.క్రింద అధికారిక సర్క్యులర్ను చూడవచ్చు:

సెప్టెంబరు 18న ప్రచురించబడిన టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక కూడా ఐటీఆర్ దాఖలు చేయడానికి గడువు చివరి తేదీ సెప్టెంబర్ 16, 2025 అని స్పష్టం చేసింది. కథనం నుండి తీసిన కొంత భాగం దిగువ చూడవచ్చు.

అధికారిక CBDT రికార్డులు/పోస్ట్స్ ద్వారా కేవలం ఒక రోజు మాత్రమే అంటే సెప్టెంబరు 15 నుంచి సెప్టెంబరు 16కి అవాంతరాల కారణంగా గడువును పెంచుతున్నట్లు తెలుస్తుంది. ఆదాయపు పన్ను శాఖ, తదుపరి గడువు పొడిగింపుల గురించి  ప్రజలకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.

కాబట్టి, ఈ దావా పూర్తిగా తప్పు.


మరి కొన్ని వాస్తవ పరిశీలన కధనాలు:

‘కల్వకుంట్ల కవిత’ సస్పెన్షన్‌పై సంబరాలు చేసుకుంటూ హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌కు బీఆర్‌ఎస్ కార్యకర్తలు నిప్పుపెట్టారా? వాస్తవ పరిశీలన

నోబెల్ కమిటీ సభ్యుడు ‘అస్లే టోజే’ శాంతి బహుమతి కోసం భారత ప్రధాని మోడీని సమర్ధించారా? వాస్తవ పరిశీలన

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.

Exit mobile version