వాదన/Claim: నోబెల్ శాంతి బహుమతికి భారత ప్రధాని నరేంద్ర మోడీ “అతిపెద్ద పోటీదారు” అని నార్వేజియన్ నోబెల్ కమిటీ డిప్యూటీ లీడర్ అస్లే టోజే పేర్కొన్నారనేది వాదన/దావా.

నిర్ధారణ/Conclusion: తప్పు దారి పట్టించే వాదన. ఉక్రెయిన్-రష్యా యుద్ధంపై ప్రధాని మోదీ చూపించిన వైఖరిని టోజే ప్రశంసించగా, అతను నేరుగా మోదీని సమర్ధించలేదు మరియు అధికారికంగా ఆయనే ఈ విషయాన్ని స్పష్టం చేశారు.

రేటింగ్/Rating: తప్పు దారి పట్టించే వాదన —

*****************************************************************
నోబెల్ శాంతి బహుమతికి “అతిపెద్ద పోటీదారు”గా భారత ప్రధాని నరేంద్ర మోడీని సమర్ధించారని, నోబెల్ బహుమతి కమిటీ డిప్యూటీ లీడర్ అస్లే టోజేకు ఆపాదిస్తూ, సోషల్ మీడియా వినియోగదారులు ఒక వీడియో క్లిప్‌ను షేర్ చేసారు.

X వినియోగదారు ‘amarDgreat’ ద్వారా షేర్ చేయబడిన ఆ వీడియో ‘టైమ్స్ నౌ’ టీవీ ఛానెల్ నుండి తీసినట్లుగా చెప్పబడింది. దిగువ పోస్ట్‌ను చూడవచ్చు.

ఇన్‌స్టాగ్రామ్ పేజీ ‘డిఫెన్స్‌రలర్ట్స్’ ఇదే దావాను ఈ విధంగా షేర్ చేసారు ” నోబెల్ శాంతి బహుమతి డిప్యూటీ లీడర్ మాట్లాడుతూ, ‘#నోబెల్ శాంతి బహుమతికి ప్రధానమంత్రి @నరేంద్రమోదీ అతిపెద్ద పోటీదారు.’
పోస్ట్ 16,000 కంటే ఎక్కువ లైక్‌లను సంపాదించింది మరియు ఇక్కడ చూడవచ్చు:

ఈ వాదనలు , నోబెల్ శాంతి బహుమతికి ముందునుంచి అనుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు కొత్త పోటీని ప్రేరేపిస్తున్నట్లుగా కనిపిస్తున్నాయి.
ప్రధాని మోదీకి నోబెల్ శాంతి బహుమతి అందితే అధ్యక్షుడు ట్రంప్ మరింత రెచ్చిపోతారని, భారత్‌పై ట్రంప్ అదనంగా 25 శాతం సుంకాలు వేస్తారని కొన్ని పోస్ట్‌లు సూచిస్తున్నాయి.

వాస్తవ పరిశీలన

DigitEYE India బృందం ఈ దావాను పరిశీలించగా, ఇది తప్పుదారి పట్టించేదని కనుగొన్నారు.

బృందం వీడియో మరియు చిత్రాలకు సంబంధించిన కొన్ని కీలక ఫ్రేమ్‌లను తీసుకుని, Google రివర్స్ ఇమేజ్‌లో శోధించగా, మార్చి 2023లో అస్లే టోజే భారత పర్యటనకు సంబంధించిన వీడియోలు మరియు వార్తలను కనుగొన్నారు.

నార్వేజియన్ నోబెల్ కమిటీ ఉప నాయకుడు అస్లే టోజే మార్చి 2023లో భారతదేశా సందర్శన సమయంలో, భారతదేశానికి తాను కమిటీకి డిప్యూటీ లీడర్‌గా కాకుండా “ఇంటర్నేషనల్ పీస్ అండ్ అండర్‌స్టాండింగ్” డైరెక్టర్‌గా మరియు “ఇండియా సెంటర్ ఫౌండేషన్ (ICF)కు  స్నేహితుడిగా వచ్చానని చెప్పారు.
ఉక్రెయిన్-రష్యన్ యుద్ధాన్ని ముగించడానికి ప్రధాని మోదీ చేసిన ప్రయత్నాలను ఆయన ప్రశంసించారు, కానీ నోబెల్ శాంతి బహుమతి అభ్యర్థిత్వానికి మోడీ పేరును ప్రతిపాదించలేదు/సమర్ధించలేదు.

ప్రధాని నరేంద్ర మోదీని నోబెల్ బహుమతి పోటీదారుగా పేర్కొన్నానంటూ తనకు ఆపాదిస్తున్న వ్యాఖ్యలు అవాస్తవమని, తాను మీడియా ముందు అలాంటి ప్రకటనలేవీ చేయలేదని ఆయన స్పష్టం చేశారు. టీవీ న్యూస్ ఛానళ్లు, వైరల్ పోస్టులు తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నాయన్నారు.

నోబెల్ కమిటీ వారి కఠినమైన నిబంధనల ప్రకారం ఎవరినీ ఏ పదవికి బహిరంగంగా ఆమోదించదని గమనించాలి.

2023లో హిందుస్థాన్ టైమ్స్ పోస్ట్ చేసిన వీడియో చూడండి:

భారతదేశం మరియు మోడీ గురించి అస్లే టోజే ఏమన్నారో తెలుసుకోవడానికి @IndianCompass పోస్ట్ చేసిన క్రింది చిత్రంపై క్లిక్ చేయండి.

ఈ సంఘటనను కవర్ చేసిన CNBC వార్తల నివేదిక కూడా అటువంటి వార్త గురించి ఎటువంటి ప్రస్తావన తీసుకురాలేదు.

హిందూస్తాన్ టైమ్స్ యొక్క వివరణాత్మక నివేదికను ఇక్కడ చూడండి.

అస్లే టోజే ప్రధాని మోడీని పోటీదారుగా సమర్ధించలేదు మరియు అయన దానిని స్పష్టంగా వివరించారు.

అందువల్ల, దావా తప్పుదారి పట్టించేదిగా ఉంది.

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.

Exit mobile version