ఇరాన్ అణు కేంద్రాలపై దాడులకు అమెరికా భారత గగనతలాన్ని ఉపయోగించుకుందా? వాస్తవ పరిశీలన
వాదన/Claim: జూన్ 22, 2025న ‘ఆపరేషన్ మిడ్‌నైట్ హామర్’ సమయంలో అమెరికా భారతీయ గగనతలాన్ని ఉపయోగించుకున్నదనేది వాదన.
నిర్ధారణ/Conclusion: తప్పుడు వాదన/దావా. అమెరికా దళాలు ట్రాన్స్-అట్లాంటిక్ మార్గాన్ని తీసుకున్నందున ఇరాన్ అణు కేంద్రాలపై దాడులకు భారతీయ గగనతలాన్ని ఉపయోగించలేదు.
రేటింగ్/Rating: పూర్తిగా అసత్యం —
*************************************************************
జూన్ 22, 2025 ఆదివారం నాడు మూడు ఇరాన్ అణు(న్యూక్లియర్) స్థావరాలపై అమెరికా దాడులు చేసిన తరువాత, ఇరాన్‌పై దాడులకు అమెరికా బలగాలు భారత గగనతలాన్ని ఉపయోగించినట్లు సోషల్ మీడియాలో అనేక పోస్ట్‌లు వెలువడ్డాయి.
CONFIRMED: Indian airspace was used by U.S. forces to strike Iran.
New Delhi’s quiet complicity now places it on the wrong side of history.
Iran will not forget. pic.twitter.com/cuuIeKKjXw— Sahar Emami (@iamSaharEmami) June 22, 2025
ఇక్కడ షేర్ చేయబడిన సోషల్ మీడియా పోస్ట్‌లు ఇలా పేర్కొన్నాయి, “నిర్ధారించబడింది: ఇరాన్‌పై దాడి చేయడానికి అమెరికా దళాలు భారత గగనతలాన్ని ఉపయోగించాయి.
సంక్లిష్ట వ్యవహారాల్లో మద్దతు పలుకుతున్నందుకు, భారతదేశాన్ని ఇప్పుడు చారిత్రకంగా నెగటివ్ జాబితాలో చేర్చే అవకాశం ఉంటుంది.
ఇరానియన్ TV IRIB యాంకర్ సహార్ ఇమామి పేరును ఉపయోగించినందున, ఈ దావా X ఖాతాలో విస్తృతంగా షేర్ చేయబడింది.
FACT-CHECK
వాదనలోని వాస్తవాన్నికనుగొనడానికి Digiteye India బృందం Google వార్తలను పరిశీలించగా, ఇరాన్‌పై అమెరికా దాడుల్లో భారతీయ గగనతలాన్ని ఉపయోగించారనే వాదనను తిరస్కరిస్తూ, భారతదేశ అధికారిక ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఈ దావాను “ఫేక్ న్యూస్” అని కొట్టిపారేసినట్లు ఫలితాలు వెల్లడించాయి.
PIB ఫాక్ట్ చెక్ యూనిట్ ఈ వాదనను “ఫేక్” అని నిర్ధారించింది మరియు “ఆపరేషన్ మిడ్‌నైట్ హామర్ సమయంలో అమెరికా భారతీయ గగనతలాన్ని ఉపయోగించలేదు” అని స్పష్టం చేస్తూ ఆదివారం Xలో పోస్ట్ చేసింది.
Several social media accounts have claimed that Indian Airspace was used by the United States to launch aircrafts against Iran during Operation #MidnightHammer #PIBFactCheck
❌ This claim is FAKE
❌Indian Airspace was NOT used by the United States during Operation… pic.twitter.com/x28NSkUzEh
— PIB Fact Check (@PIBFactCheck) June 22, 2025
పైగా,పెంటగాన్ అందించిన(క్రింద)చిత్రంలో చూపిన విధంగా ఆపరేషన్ మిడ్‌నైట్ హామర్ సమయంలో US క్షిపణులు తీసుకున్న మార్గంలో భారతదేశం రాదు:
పత్రికా సమావేశంలో, అమెరికా జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ చైర్ ‘జనరల్ డాన్ కెయిన్’ పై చిత్రాన్ని చూపుతూ అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా ‘అమెరికా విమానం’ ఉపయోగించిన మార్గం గురించి వివరించారు, ఇది భారత గగనతలాన్ని స్పష్టంగా మినహాయించినట్టు తెలుస్తుంది.
IRIB యాంకర్ సహార్ ఇమామి పేరు మీద షేర్ చేసిన పోస్ట్ తప్పుదారి పట్టించే విధంగా ఉంది. ఆమె దానిని తిరస్కరింస్తూ X.comలో ఒక వీడియోను పోస్ట్ చేసారు మరియు తనకు అసలు Xలో ఖాతా లేదని పేర్కొన్నారు.
the real Sahar Emami: I do not have an account on X/Twitter!
The account below is a sick grifter using her image for personal gains by engagement farming and posting fake headlines, AI images, etc. Please report and block them.
Share Sahar’s video widely. https://t.co/U5HcUgItR1 pic.twitter.com/OBhZs0gWc3
— 🌬️🏴 (@magnxsium) June 21, 2025
కాబట్టి, ఈ వాదన/దావా పూర్తిగా తప్పు.
మరి కొన్ని వాస్తవ పరిశీలన కధనాలు:
అమెరికాలో టెస్లా కార్ల ఉత్పత్తిని ట్రంప్ నిషేధించారా? వీడియో వైరల్ అవుతోంది; వాస్తవ పరిశీలన
1 thought on “ఇరాన్ అణు కేంద్రాలపై దాడులకు అమెరికా భారత గగనతలాన్ని ఉపయోగించుకుందా? వాస్తవ పరిశీలన”