వాదన/Claim: వైరల్ అవుతున్న వీడియో జూన్ 12, 2025న కూలిపోవడానికి ముందు ఎయిర్ ఇండియా విమానం AI-171 లోపలి దృశ్యాల వీడియో, అనేది వాదన.

Conclusion/నిర్ధారణ: తప్పుగా చూపించే ప్రయత్నం. వైరల్ అవుతున్న వీడియో జనవరి 15, 2023న నేపాల్‌లోని పోఖారాలో కుప్పకూలిన యతి ఎయిర్‌లైన్స్ విమానం లోపల చిత్రీకరించిన వీడియో ఫుటేజీ.

రేటింగ్/Rating: తప్పుగా చూపించే ప్రయత్నం —

వాస్తవ పరిశీలన పూర్తి వివరాలను వీడియోలో చూడండి

లేదా వాస్తవ పరిశీలన కధనం చదవండి
******************************************************

జూన్ 12న, 242 మంది ప్రయాణికులు మరియు సిబ్బందితో లండన్‌కు వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం AI171 అహ్మదాబాద్ విమానాశ్రయం నుండి ఆకాశంలోకి ఎగిరిన (టేక్ ఆఫ్ అయిన) కొన్ని నిమిషాలకే, విషాదకరంగా కూలిపోవడం అనేక వాదనలకు/ఆరోపణలకు దారితీసింది. వాటిలో, ప్రమాదానికి కొన్ని నిమిషాల ముందు విమానం లోపల చిత్రీకరించినట్లు చూపుతున్న ఒక వీడియో సోషల్ మీడియాలో షేర్ అవుతోంది.

విమానం లోపల ప్రయాణికులు ఉండగా, ఒక వ్యక్తి బయట ఉన్న దృశ్యాన్ని చిత్రీకరించడాన్నీ వీడియోలో చూడవచ్చు.కాని అంతలోనే విమానం నియంత్రణ కోల్పోయి, కుప్పకూలిపోయే ముందు ప్రయాణీకుల అరుపులు,కేకలు,పొగ మరియు మంటలు కెమెరాలో బంధించబడటం చూడవచ్చు.

X లో వీడియోను షేర్ చేస్తూ, ఒక వినియోగదారుడు హిందీలో ఇలా రాశారు: “23 सैकेंड का ये विडीओ जिसमें सब कुछ एक सैकेंड में बदल गया, कैसे हंसी भरी विडियो एकदम से चीखों में बदल गईं। Prayers for all passenger! Death is so unpredictable! ओम् शांति.” [తెలుగు అనువాదం: “23 సెకన్ల వ్యవధి గల ఈ వీడియోలో ఒక్కసారిగా అంతా ఒక్క క్షణంలోనే మారిపోయింది, అందరు సంతోషంగా కనిపిస్తున్న ఈ వీడియో అకస్మాత్తుగా ఆర్తనాదాలతో ఎలా మారిపోయిందో. ప్రయాణీకులందరి కోసం ప్రార్థనలు! మరణం ఊహించలేనిది! ఓం శాంతి.”]

అదే వీడియోని మరొక వినియోగదారుడు ఇంగ్లీషులో ఇలా షేర్ చేశారు:

హృదయవిదారకమైనది: గుజరాత్‌లోని అహ్మదాబాద్ సమీపంలో జరిగిన ఎయిర్ ఇండియా AI171 విషాద విమాన దుర్ఘటనకు కొన్ని క్షణాల ముందు ఫేస్‌బుక్ లైవ్ వీడియో కనిపించింది.

విమానంలో ప్రయాణిస్తున్న ప్రయాణీకులందరి కోసం ప్రార్థనలు.💔

వాస్తవ పరిశీలన

Digiteye India బృందం తమ వాట్సాప్ టిప్‌లైన్‌లో ఈ వాదన గురించి అభ్యర్థన రాగ, వీడియో యొక్క ప్రామాణికతను తనిఖీ చేసింది. వీడియో నుండి కీలక ఫ్రేమ్‌లను తీసుకొని గూగుల్ రివర్స్ ఇమేజ్‌ పద్దతిలో పరిశీలించగా, ఆ వీడియో 2023లో నేపాల్‌కు చెందిన యెటి ఎయిర్‌లైన్స్ హిమాలయాలలో కుప్పకూలిపోయిన దుర్ఘటనకు సంబంధించిన వీడియో అని ఫలితాలు వెలువరించాయి.

2023లో వైరల్ అయిన అసలు వీడియోను క్రింద చూడవచ్చు:
X వినియోగదారుడు చేసిన ట్వీట్: నేపాల్ విమాన ప్రమాదం: మొత్తం 72 మంది ప్రయాణికులు మరణించారు ‘పారాగ్లైడింగ్ కోసం నలుగురు భారతీయులు పోఖారాకు వెళ్తున్నారు #నేపాల్ ప్లేన్ క్రాష్ #నేపాల్

 

జనవరి 15, 2023న నేపాల్‌లోని పోఖారాలో యేతి ఎయిర్‌లైన్స్ విమానం కూలిపోవడానికి ముందు ఆ ఫుటేజ్ చిత్రీకరించబడిందని నిర్ధారించే అనేక వార్తా నివేదికలు ఈ ప్రమాదాన్ని ప్రచురించాయి.

జనవరి 15న ఖాట్మండులోని త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుండి బయలుదేరిన ఏతి ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 691, పోఖారాలోని పాత మరియు కొత్త విమానాశ్రయాల మధ్య ఉన్న సేతి రివర్ లోయలో కూలిపోయింది, ఇందులో ఐదుగురు భారతీయులతో సహా 70 మందికి పైగా మరణించారు.

కాబట్టి, ఈ వీడియో జూన్ 12, 2025న అహ్మదాబాద్ సమీపంలో కుప్పకూలిన AI-171 ఫుటేజీ అనే వాదన తప్పు.

మరి కొన్ని వాస్తవ పరిశీలన  కధనాలు:

అయోధ్యలో దొరికిన రాగి స్క్రోల్ (రాగి ఫలకం)బౌద్ధుల కాలానికి చెందినదని వీడియో పేర్కొంది; వాస్తవ పరిశీలన

మాల్దీవుల నుంచి 28 దీవులను భారత్ కొనుగోలు చేసిందా? వాస్తవ పరిశీలన

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.

Exit mobile version