వాదన/Claim: పోలీసు వ్యాన్‌లోని వినాయకుడి విగ్రహం ఉన్న చిత్రం సోషల్ మీడియాలో షేర్ చేస్తూ కర్నాటక పోలీసులు గణేశుడిని అరెస్టు చేసినట్లుగా క్లెయిమ్ చేయబడింది.

నిర్ధారణ/Conclusion: తప్పుగా చూపించే ప్రయత్నం. నిరసనకారులు గణేశుడి విగ్రహాన్ని నిషేధిత ప్రదేశానికి తీసుకురాగా, పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని, విగ్రహాన్ని వ్యాన్‌లో ఉంచారు, తరువాత అధికారులు సంప్రదాయబద్ధంగా నిమజ్జనం చేశారు.

రేటింగ్/Rating: తప్పుగా చూపించే ప్రయత్నం —

వాస్తవ పరిశీలన పూర్తి వివరాలను వీడియోలో చూడటానికి కింది చిత్రంపై క్లిక్ చేయండి..

లేదా దిగువ కథనాన్ని చదవండి.

************************************************************************

కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం గణేష్ జీని ‘అరెస్టు’ చేసిందన్న వాదనతో పోలీస్ వ్యాన్‌లో వినాయకుడి విగ్రహాన్ని తీసుకెళ్తున్న చిత్రం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది మరియు హిందువులు ‘అవమానించబడటానికి కాంగ్రెస్‌కు ఎందుకు ఓటు వేస్తారు’ అనే ప్రశ్నతో ఆ చిత్రాన్ని పోస్ట్ చేయబడింది.
X.comలో వాదన/దావాలను ఇక్కడ చూడండి:

The claim reads in Hindi: “कर्नाटक पुलिस ने श्री गणेश जी को हिंदू कार्यकर्ताओ के साथ हिरासत मे ले लिया
ये गिरफ्तारियां नाग मंगला मे गणेश जुलूस पर कट्टरपंथियो द्वारा किए गए पथराव की निंदा करते हुए विरोध प्रदर्शन के बाद हुईं
अभी भी समय है जाग जाओ हिंदुओ नही तो यही हाल पूरे देश मे होगा?”

తెలుగు అనువాదం ఇలా ఉంది: కర్ణాటక పోలీసులు హిందూ కార్యకర్తలతో పాటు శ్రీ గణేష్ జీని అదుపులోకి తీసుకున్నారు. నాగ్ మంగళాలో జరిగిన గణేష్ ఊరేగింపుపై జరిగిన రాళ్ల దాడిని ఖండిస్తూ నిరసనలు తెలిపిన తర్వాత అరెస్టులు జరిగాయి. సమయం మించిపోలేదు, హిందువులారా మేల్కోండి లేకపోతే దేశం మొత్తం ఇదే పరిస్థితి అవుతుంది.

 

వాదనలు/దావాలు ఇక్కడ మరియు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి.

వాస్తవ పరిశీలన వివరాలు

మొదట, మేము సంఘటన గురించి వివిధ వార్తా నివేదికలు పరిశీలించగా, కర్ణాటకలో గణేష్ పూజను ఎప్పుడూ నిషేధించలేదనే విషయాన్నీ కనుగొన్నాము. రెండవది, పోలీసు వ్యాన్‌లో గణేష్ విగ్రహాన్ని ఎందుకు తీసుకెళ్లాసిన అవసరం వచ్చిందో వార్తలు నివేదికలు(ఇక్కడ మరియు ఇక్కడ) వెల్లడించాయి.

దీని వెనక నేపధ్యం:

సెప్టెంబరు 11 న చెలరేగిన మతపరమైన అల్లర్లను అనుసరించి, కర్ణాటకలోని మాండ్య జిల్లా నాగమంగళలో గణేష్ చతుర్థి ఊరేగింపును మసీదు ముందు చాలా సమయం పాటు నిలిపివేసినప్పుడు, కర్ణాటక పోలీసులు 55 మందిని అరెస్టు చేసి రాష్ట్రవ్యాప్తంగా నిషేధాజ్ఞలు విధించారు. అరెస్టులు జరిగిన వెంటనే రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ కార్యకర్తలు నిరసనలకు దిగారు.

అసలేం జరిగింది?

సెప్టెంబరు 13, 2024న, బెంగుళూరు టౌన్ హాల్ సమీపంలో మాండ్య మత హింసపై విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ, ఆ ప్రదేశంలో నిషేధాజ్ఞలను ధిక్కరిస్తూ, అలాంటి ఒక నిరసన ప్రదర్శన జరిగింది. నిరసనకారులలో ఒక వ్యక్తి గణేశ విగ్రహాన్ని పట్టుకొని ఉన్నందున, పోలీసులు అతనితో పాటు ఇతరులను అదుపులోకి తీసుకున్నారు మరియు అతను పట్టుకున్న విగ్రహాన్ని ఖాళీ పోలీసు వ్యాన్‌లో ఉంచగా, ఇది గణేశుడిని అరెస్టు చేసినట్లు తప్పుడు వాదనకు దారితీసింది.

ఫ్రీడమ్ పార్క్ వద్ద మాత్రమే నిరసనలకు అనుమతించబడిందన్న కర్ణాటక హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ బెంగళూరులోని టౌన్ హాల్‌లో ఆందోళనకారులు సమావేశమయ్యారని బెంగళూరు పోలీసులు స్పష్టం చేశారు. బెంగళూరు సెంట్రల్ డివిజన్ డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ (DCP), శేఖర్ హెచ్. టెక్కన్నవర్ మీడియాతో ఇలా అన్నారు: “సెప్టెంబర్ 13, 2024న, నాగమంగళ గణేష్ ఊరేగింపు ఘటనపై హిందూ సంఘాలు హైకోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ బెంగళూరులోని టౌన్ హాల్‌ దగ్గర నిరసన తెలిపాయి. ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. గణపతి విగ్రహాన్ని అధికారులు పూజలతో సంప్రదాయబద్ధంగా నిమజ్జనం చేశారు.

కాబట్టి, ఈ దావా తప్పు.

మరి కొన్ని వాస్తవ పరిశీలన  కధనాలు:

మాల్దీవుల నుంచి 28 దీవులను భారత్ కొనుగోలు చేసిందా? వాస్తవ పరిశీలన

VP నామినీ J.D. వాన్స్ పేరు ప్రకటించినప్పుడు US రిపబ్లికన్ కన్వెన్షన్‌లో ‘ఇండియా-ఇండియా’ అన్న నినాదాలు వినిపించాయా? వాస్తవ పరిశీలన

 

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.

Exit mobile version