సమయం వ్యతిరేక దిశలో (సమయం వెనుకకు)వెలుతున్న సమాంతర విశ్వాన్ని NASA కనిపెట్టిందనే వాదనలతో ఇంటర్నెట్ సంచలనమైంది.అనేక వార్తాపత్రికలు మే 20 మరియు 21 తేదీలలో ఈ కథనాన్ని Google search ట్రెండ్‌లలో అగ్రస్థానంలో ప్రసారం చేశాయి, ఎక్కువగా న్యూయార్క్ పోస్ట్, ఎక్స్‌ప్రెస్ మరియు డైలీ స్టార్ వంటి టాబ్లాయిడ్‌లు ‘నాసా శాస్త్రవేత్తల వద్ద సమాంతర విశ్వం ఉందని నిరూపించగల సాక్ష్యాలు ఉన్నాయని’ కోట్ చేసారు.
మే 21న సెర్చ్ స్ట్రింగ్ ‘ప్యారలల్ యూనివర్స్’ కోసం గత 24 గంటల యొక్క Google గ్రాఫ్ని దిగువన చూడండి:
NASA ఈ సమాంతర విశ్వాన్ని కనుగొన్నట్లు అన్ని వార్తా సంస్థలు పేర్కొన్నాయి మరియు Google searchలో కొన్ని ఫలితాలు క్రింద చూడగలరు:
Fact Check
న్యూ సైంటిస్ట్‌లోని ఒక వార్తా కథనం ప్రకారం,భూమి వాతావరణంలోకి cosmic-rays ప్రవేశించడం వలన కలిగె గాలి జల్లులను (air showers) గుర్తించే అంటార్కిటిక్ ఇంపల్సివ్ ట్రాన్సియెంట్ యాంటెన్నా (ANITA– 37,000 మీటర్ల ఎత్తులో ఎగురుతున్న బెలూన్‌పై అమర్చిన ఒక రేడియో డిటెక్టర్‌ను) NASA బృందం వారు ఆపరేట్ చేస్తున్నారు.అంటార్కిటికాలో రీడింగులను వక్రీకరించే రేడియో శబ్దం(radio noise) లేనందున, ANITA దానిపై హోవర్ చేయగలదు.
యాంటెన్నా ఇప్పటివరకు భౌతిక శాస్త్రంలో తెలిసినట్లుగా బాహ్య అంతరిక్షం నుండి క్రిందికి ప్రవహించకుండా భూమి లోపల నుండి పైకి ప్రయాణించే అధిక-శక్తి కణాల “గాలి”ని(“wind” of high-energy particles) కనుగొంది. దీనికి మరింత వివరణ ఇస్తు, పీటర్ గోర్హామ్ అనే ఒక పరిశోధకుడు, సమాంతర విశ్వం ఉనికిలో ఉండవచ్చని మరియు దానిలో సమయం రివర్స్‌లో( వెనుకకు ) వెలుతుందనే అనే సిద్ధాంతాన్ని ఉదహరించారు.
వాస్తవానికి, సమాంతర విశ్వం యొక్క సిద్ధాంతం పాత కల్పన కానీ ఈ ఊహ ఆధారంగా అనేక హాలీవుడ్ సినిమాలు నిర్మించబడ్డాయి. ప్రముఖ సిట్‌కామ్ ‘బిగ్ బ్యాంగ్ థియరీ’లో ప్రధాన నటుడు లియోనార్డ్, షెల్డన్ కూపర్‌తో కలిసి అంటార్కిటికాను సందర్శించి “గ్రౌండ్ బ్రేకింగ్ డిస్కవరీ” చేస్తాడు, కానీ ప్రయత్నం ఫలించదు. ఈసారి NASAకి ఆపాదించబడిన claim/వాదన వైరల్‌గా మారింది.
2006లో మరియు 2014లో ANITA ప్రాజెక్ట్ కనుగొన్న కణాల(particles) ప్రవర్తన భౌతిక శాస్త్రంలో తెలిసిన కణాలకు బిన్నంగా ఉంది.లేదా కణాలు కనుగొనబడిన అంటార్కిటికాలోని మంచుతో కూడా సంబంధం కలిగి ఉండవచ్చు. కణాల యొక్క విచిత్రమైన తలక్రిందుల కదలిక పరిశిలిస్తే, ఎక్కడో, సమయం వెనుకకు వెలుతుందని, అందుకే, సమాంతర విశ్వం యొక్క ఆలోచన ఉద్భవించిందని, దీనిలో సమయం మరియు భౌతిక శాస్త్రం రెండూ భిన్నంగా ప్రవర్తిస్తాయనే ముందుకు తీసుకురాబడింది.
Australia’s national science ఏజెన్సీ యొక్క గౌరవ సభ్యుడు ‘Ron Ekers’ CNETతో ఇలా అన్నారు: “నాలుగు సంవత్సరాల తర్వాత ANITA కనుకొన్న అసాధారణ సంఘటనల గురించి సంతృప్తికరమైన వివరణ లేదు కాబట్టి , ఈ ప్రాజెక్ట్ లో పాల్గొన్న వారిని ఇది చాలా నిరాశపరిచింది.
కానీ కొన్ని వార్తలు పేర్కొన్నట్లు NASA ఈ సమాంతర విశ్వంని కనుగొనలేదు. NASA వెబ్‌సైట్‌లో అటువంటి దావా/వాదన గురించి ఎటువంటి ప్రస్తావన లేదు. సమయం వెనుకకు నడిచే సమాంతర విశ్వంని NASA నిజంగా కనిపెట్టినట్లయితే, , అది పరిశోధకులకు తగిన గుర్తింపు ఇచ్చీ అధికారిక ప్రకటన చేసి ఉండెది.
Claim/వాదన: సమయం వెనుకకు నడిచే సమాంతర విశ్వంని NASA కనుగొందా? Fact Check
నిర్ధారణ: ఈ వాదనలు NASA చేసినవి కావు, సమాంతర విశ్వంని గురించి NASAకి ఆపాదించబడిన claim/వాదన తప్పు. Rating Misrepresentation.