Tag Archives: S Somanath visited the RSS office

చంద్రయాన్-3 ల్యాండింగ్ తర్వాత ఇస్రో చీఫ్ సోమనాథ్ బెంగళూరులోని ఆర్‌ఎస్‌ఎస్ కార్యాలయాన్ని సందర్శించారా? Fact Check

చంద్రుని దక్షిణ ధ్రువంపై చంద్రయాన్-3 విజయవంతంగా సాఫ్ట్-ల్యాండింగ్ అయిన తర్వాత, ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ గురించి పలు వీడియోలు సోషల్ మీడియాలో ప్రసారం చేయడం ప్రారంభం అయ్యాయి.అంతకుముందు చంద్రుని దక్షిణ ధ్రువంపై చంద్రయాన్-3 విజయవంతంగా సాఫ్ట్-ల్యాండింగ్ అయిన సందర్భంగా ఇస్రో చీఫ్ సంబరాలు చేసుకుంటున్న పాత వీడియో వైరల్‌గా మారింది.ఈసారి ఆయనను సత్కరిస్తున్న మరో వీడియో ప్రసారం చేయడం జరిగింది.

0:09 నిమిషాల నిడివి ఉన్న వీడియోలో ఇద్దరు వ్యక్తులు తెల్లటి దుస్తులు ధరించి S సోమనాథ్‌ను సత్కరిస్తున్నట్లు చూపబడింది.వారు అతని భుజాలపై శాలువా కప్పుతుంటే,అతను చేతులు జోడించి ‘నమస్తే’చేస్తున్నట్లు చూపబడింది.ఇస్రో చీఫ్ బెంగళూరులోని ఆర్‌ఎస్‌ఎస్ కార్యాలయాన్ని సందర్శించారని, ఈ వీడియో ఆ ఈవెంట్‌లోనిదేనని సోషల్ మీడియాలో పలు వీడియోలు పేర్కొంటున్నాయి.

వీడియో ఇక్కడ, ఇక్కడ, మరియు  ఇక్కడ షేర్ చేయబడ్డది.

ఈ వైరల్ వీడియోను పరిశీలన చేయమని Digiteye India కి WhatsApp అభ్యర్థన వచ్చింది.

FACT CHECK

Digiteye India బృందంవారు వీడియోని అనేక కీఫ్రేమ్‌లుగా విభజించి Googleలో రివర్స్ ఇమేజ్ ఉపయోగించి వీడియోని పరిశీలించారు.ఇలాంటి దావాతో అనేక మంది వ్యక్తులు ఈ వీడియోను భాగస్వామ్యం(share) చేయడాన్ని మేము గమనించాము.కీలక పదాలతో మరింత వెతికినప్పుడు, RSS ప్రమోషన్ అండ్ పబ్లిసిటీ హెడ్ – రాజేష్ పద్మర్ చేసిన ఈ ట్వీట్ మాకు కనిపించింది.అతని ట్వీట్‌లో మూడు చిత్రాలు మరియు అదే వైరల్ వీడియో ఉన్నాయి.

జూలై 19, 2023 నాటి తన ట్వీట్‌లో, చంద్రయాన్-3 మిషన్‌ను విజయవంతంగా నడిపించినందుకు S సోమనాథ్‌ను RSS ప్రధాన కార్యదర్శి – దత్తాత్రేయ హోసబాలే అభినందించారు.చంద్రునిపై చంద్రయాన్-3 రోవర్ ల్యాండింగ్‌కు ముందే బెంగళూరులోని చామరాజపేటలోని రాష్ట్రోత్థాన పరిషత్‌లో ఈ సన్మానం జరిగిందని అందులో పేర్కొన్నారు. రోవర్ ఆగష్టు 23, 2023న చంద్రునిపై దిగింది.

మేము రాష్ట్రోత్థాన పరిషత్‌ గురించి గూగుల్ సెర్చ్ చేసాము. “వ్యక్తిగతంగా సమాజంలో పరివర్తన తీసుకురావడం ద్వారా ఆరోగ్యకరమైన మరియు స్థిరమైన సమాజాన్ని సృష్టించే దిశగా 1965 నుండి కృషి చేస్తున్న ఒక NGO అని ఫలితాలు చూపించాయి.వీడియో తేదీని ధృవీకరించడానికి మేము రాష్ట్రోత్థాన పరిషత్ యొక్క సోషల్ మీడియా హ్యాండిల్‌లను పరిశీలించాము. వారి బ్లాగ్ పోస్ట్‌లలో ఒకదానిలో, వారు ఈ ఈవెంట్ గురించి వ్రాసారు మరియు అదే చిత్రాలను షేర్ చేసారు.

అంతరిక్ష శోధనలో అతను సాధించిన విజయాలను జరుపుకోవడానికి మరియు ఇస్రో యొక్క భవిష్యత్తు మిషన్లకు తన మద్దతును తెలియజేయడానికి” ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు బ్లాగ్ పోస్ట్ పేర్కొంది.

మేము బహుళ కీవర్డ్‌లను ఉపయోగించి వీడియోని ధృవీకరించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు కర్ణాటకలోని విశ్వ సంవాద కేంద్రం చేసిన ఈ ట్వీట్‌ని చూశాము. వీడియోలో పేర్కొన్నట్లుగా ఇస్రో చీఫ్ ఆర్‌ఎస్‌ఎస్ కార్యాలయాన్ని సందర్శించలేదని ట్వీట్‌లో పేర్కొన్నారు.

అతను ‘తపాస్’ ప్రాజెక్ట్‌కు నాయకత్వం వహిస్తున్న వ్యక్తులను కలవడానికి రాష్ట్రోత్థాన పరిషత్‌ని సందర్శించారు. ఈ NGO చేస్తున్న ప్రాజెక్ట్ సమాజంలోని అణగారిన వర్గాలకు చెందిన విద్యార్థులను IITలో చదివేలా చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. కాబట్టి,ఇది తప్పుడు వాదన/claim.

CLAIM/దావా: చంద్రయాన్-3 విజయవంతంగా ల్యాండింగ్ అయిన తర్వాత ఇస్రో చీఫ్, ఎస్ సోమనాథ్ బెంగళూరులోని ఆర్‌ఎస్‌ఎస్ కార్యాలయాన్ని సందర్శించారు.

నిర్ధారణ:ఈ వీడియో జూలై 2023 నాటిది, S సోమనాథ్ బెంగళూరులోని ఒక NGOని సందర్శించి, చంద్రయాన్-3 మిషన్‌కు నాయకత్వం వహించినందుకు సత్కరించారు.అంతే కాని ఆర్‌ఎస్‌ఎస్ కార్యాలయాన్ని సందర్శించలేదు.

RATING: Misrepresentation —

[మరి కొన్ని Fact Checks:: Does this video show ISRO Chief celebrating success of Chandrayaan-3? Fact Check]