Tag Archives: dog biscuit

రాహుల్ గాంధీ కాంగ్రెస్ కార్యకర్తకు కుక్క బిస్కెట్ ఇచ్చారా?; వాస్తవ పరిశీలన

వాదన/Claim: భారత్ జోడో న్యాయ్ యాత్రలో రాహుల్ గాంధీ కుక్క నిరాకరించిన బిస్కెట్ ను కాంగ్రెస్ కార్యకర్తకు ఇచ్చారనేది వాదన.

నిర్ధారణ/Conclusion: తప్పు వాదన. కుక్కకు ఆహారం ఇవ్వడానికి రాహుల్ గాంధీ ఆ బిస్కెట్‌ను కుక్క యజమానికి ఇచ్చారు.
అంతేకాని, ఆ కుక్క యజమాని కాంగ్రెస్ కార్యకర్త లేదా ఏ రాజకీయ పార్టీకి మద్దతుదారుడు కాదు.

రేటింగ్ :పూర్తిగా తప్పు

వాస్తవ పరిశీలన వివరాలు:

కొనసాగుతున్న భారత్ జోడో న్యాయ్ యాత్ర నేపథ్యంలో,కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ మళ్లీ ప్రతికూల కథనంకు టార్గెట్ అయ్యారు,ఈసారి కుక్కల పట్ల ఆయనకున్న ప్రేమ వలన. యాత్రలో కుక్కతో ఆడుకుంటూ బిస్కెట్ తినిపించడానికి ప్రయత్నించగా, కుక్క బిస్కట్ తీసుకోకపోవడంతో పక్కనే ఉన్న వ్యక్తికి బిస్కెట్ అందిస్తూ కనిపించారు.

అయితే, వీడియోను ఉటంకిస్తూ భారతీయ జనతా పార్టీ నాయకులు చేసిన కొన్ని వాదనలతో సహా అనేక వాదనలు ఆన్‌లైన్‌లో కనిపించాయి, విమర్శలకు దారి తీశాయి.కుక్క నిరాకరించిన బిస్కెట్‌ను పక్కనే నిలబడి ఉన్న కాంగ్రెస్‌ కార్యకర్తకు రాహుల్‌ అందించారని వీడియోతో కూడిన వాదన/దావా పేర్కొంది. ఈ ట్వీట్లను క్రింద చూడవచ్చు:

వీడియోను క్యాప్షన్‌తో షేర్ చేశారు: “అందుకే ఆత్మగౌరవం ఉన్నవారు ఎవరూ కాంగ్రెస్‌లో ఉండలేరు.ఆ రోజు హిమంత శర్మ చెప్పింది ఈ రోజు నిరూపితమైంది.రాహుల్ ముందుగా కుక్కకు బిస్కెట్ అందించారు. కుక్క నిరాకరించినప్పుడు అదే బిస్కెట్‌ను కాంగ్రెస్ కార్యకర్త (కార్మికుడు)కి ఇచ్చాడు.”

 

ఇదే వ్యాఖ్యను బీజేపీ అధికార ప్రతినిధి షెజాద్ పూనావాలా మరో వ్యాఖ్యతో షేర్ చేసుకున్నారు:”కాంగ్రెస్ కార్యకర్తలకు “న్యాయం” జరగదా? కుక్క నిరాకరించిన బిస్కెట్లను రాహుల్ గాంధీ కార్యకర్తలకు తినిపించారు! ఉన్నత వర్గం యొక్క ఆలోచనా విధానం.”

FACT CHECK

మేము ఒరిజినల్ వీడియో మొత్తం పరిశీలించగా,క్లెయిమ్ చేసినట్లు రాహుల్ గాంధీ బిస్కెట్‌ను కాంగ్రెస్ కార్యకర్తకు కాకుండా కుక్క యజమానికి ఇవ్వడాన్ని గమనించాము, చివరికి కుక్క యజమాని తన చేతితో దానికి తినిపించాడు.ఇదే విషయాన్ని వివరిస్తూ, రాహుల్ గాంధీ మీడియా సమావేశంలో మాట్లాడుతూ, కుక్క బాధను గమనించి, కుక్కకి తినిపించడానికి, బిస్కెట్ను దాని యజమానికే ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు.

రాహుల్ గాంధీ మాట్లాడుతూ, “నేను కుక్కను మరియు దాని యజమానిని పిలిచాను. కుక్క భయపడి, వణుకుతోంది,  నేను దానిని తినిపించడానికి ప్రయత్నించినప్పుడు, కుక్క భయపడింది. కాబట్టి నేను కుక్క యజమానికి బిస్కెట్లు ఇచ్చాను, కుక్క అతని చేతిలో నుండి వాటిని తినేసింది”.

రాహుల్ గాంధీ స్వయంగా కుక్కను పెంచుకుంటున్నారు మరియు కుక్కల మనస్తత్వం గురించి అవగాహన ఉంది.కుక్క యజమాని స్వయంగా రాహుల్ గాంధీ చెప్పిన కథనానికి మద్దతునిచ్చాడు మరియు అతను కాంగ్రెస్ కార్యకర్త లేదా ఏ రాజకీయ పార్టీకి మద్దతుదారుని కాదని స్పష్టం చేశారు.

ధన్‌బాద్‌లో నివాసముంటున్న జితేంద్ర కుమార్ అనే కుక్క యజమాని తర్వాత మీడియాతో మాట్లాడుతూ రాహుల్ గాంధీ తన కుక్కను నిమురుతూ,దానికి బిస్కెట్ ఇచ్చారని తెలిపారు.”నా కుక్క, లూసీ, ఒక ఆడ పోమెరేనియన్, కారుపై ఉండడం వలన భయపడి తినడానికి నిరాకరించింది.” కుక్క భయాందోళనలను అర్థం చేసుకున్న రాహుల్ గాంధీ, దానికి ఆహారం ఇవ్వమని నన్ను కోరారని ఆయన తెలిపారు.

తాను కాంగ్రెస్ కార్యకర్తనన్న బీజేపీ నేతల వాదనను కుక్క యజమాని కూడా తోసిపుచ్చారు.

అందువలన, వైరల్ వీడియోతో పాటు వచ్చిన వాదన/దావా, రాహుల్ గాంధీపై ప్రతికూల కథనంతో తప్పుగా చూపించే ప్రయత్నం జరిగింది.

మరి కొన్ని Fact Checks:

అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా 25,000 హోమ గుండాలను ఏర్పాటు చేశారా? వాస్తవ పరిశీలన

రాహుల్ గాంధీ యొక్క ‘భారత్ మాత’ ప్రసంగాన్ని అసందర్భంగా ట్వీట్ చేశారు; వాస్తవ పరిశీలన