భారతదేశంలో దూరదర్శన్ నిజంగానే ఫిఫా వరల్డ్ కప్ 2026ను ప్రసారం చేయనుందా? వాస్తవ పరిశీలన
వాదన/Claim: ప్రసార హక్కుల కోసం ఏ ప్రైవేట్ ప్రసార సంస్థా బిడ్లు(వేలంపాట) దాఖలు చేయకపోవడంతో, భారతదేశంలో ఫిఫా ప్రపంచ కప్ మ్యాచ్‌లను దూరదర్శన్ ప్రత్యక్ష ప్రసారం చేయనుందనేది వాదన.
నిర్ధారణ/Conclusion: ఈ వాదన తప్పుదోవ పట్టించేలా ఉంది. ఫిఫా (FIFA) ప్రపంచ కప్‌ను దూరదర్శన్ ప్రసారం చేస్తుందని నిరూపించే నివేదికలు, ప్రకటనలు లేదా ఆధారాలు ఏవీ లేవు.2026 మరియు 2030 సీజన్లకు సంబంధించి భారతదేశంలో ఫిఫా ప్రపంచ కప్ అధికారిక ప్రసారకర్తగా ‘జీ’ (Zee) వ్యవహరించేలా జూన్ 2, 2026న ‘జీ’ మరియు ఫిఫా మధ్య ఒప్పందం కుదిరింది. అయితే, దూరదర్శన్ స్పోర్ట్స్ ఛానల్ మాత్రం ‘DD Free Dish’ ద్వారా ఫిఫా ప్రపంచ కప్ 2026కు సంబంధించిన ప్రారంభ మ్యాచ్, అన్ని క్వార్టర్ ఫైనల్స్, సెమీ ఫైనల్స్ మరియు గ్రాండ్ ఫైనల్ మ్యాచ్‌లను మాత్రమే ప్రత్యక్ష ప్రసారం (LIVE) చేస్తుంది..
రేటింగ్/Rating: తప్పుదోవ పట్టించే వాదన
భారతదేశంలో ఫిఫా (FIFA) వరల్డ్ కప్ 2026ను దూరదర్శన్ ప్రసారం చేయనుందని పలువురు వినియోగదారులు సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ‘abdulrahmanmash’ అనే X వినియోగదారుడు, “భారతదేశంలో ఫిఫా వరల్డ్ కప్‌ను ప్రసారం చేయడానికి దూరదర్శన్ సిద్ధమైంది!!!” అనే క్యాప్షన్‌తో పోస్ట్‌ను షేర్ చేశారు. ఆ పోస్ట్‌కు జత చేసిన చిత్రం ఈ విధంగా ఉంది– “బ్రేకింగ్: దూరదర్శన్ పునరాగమనం: బిడ్లు(వేలంపాట) దాఖలు కాకపోవడంతో భారతదేశంలో ఫిఫా వరల్డ్ కప్ 2026ను దూరదర్శన్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది”. ఆ పోస్ట్‌ను కింద చూడవచ్చు:
Doordarshan set to telecast FIFA World Cup in India!!!#FIFA #IndianFootball pic.twitter.com/c2EMbpFpH2
— Abdul Rahman Mashood (@abdulrahmanmash) May 5, 2026
ఇక్కడ మరియు ఇక్కడ మరిన్ని తాజా వాదనలు చేయబడ్డాయి.
వాస్తవ పరిశీలన
ఈ వాదనను’డిజిటై’ బృందం పరిశీలించగా, అది తప్పుదోవ పట్టించేలా ఉందని గుర్తించింది. FIFA ప్రపంచ కప్‌లోని మొత్తం 104 మ్యాచ్‌ల ప్రసార హక్కులను దూరదర్శన్ పొందిందని తెలిపే విశ్వసనీయమైన నివేదికలు లేదా అధికారిక ప్రకటనలు ఏవీ లేవు. కానీ, 2026 మరియు 2030 సీజన్లకు సంబంధించి అధికారిక ప్రసారకర్తగా వ్యవహరించేలా జీ ఎంటర్‌టైన్‌మెంట్ (Zee Entertainment)తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు FIFA జూన్ 2, 2026న ధృవీకరించింది.
వివరాలు:
మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి, మొదట “Doordarshan to telecast Fifa World Cup 2026” అనే పదబంధంతో వెబ్ లో అన్వేషించగా, 2026 జూన్ 10న, DD స్పోర్ట్స్ తమ అధికారిక X (ట్విట్టర్) ఖాతా ద్వారా ఒక ప్రకటన చేసింది; దీని ప్రకారం, “FIFA వరల్డ్ కప్ 2026 ప్రారంభ మ్యాచ్, అన్ని క్వార్టర్ ఫైనల్స్, సెమీ ఫైనల్స్ మరియు గ్రాండ్ ఫైనల్ మ్యాచ్‌లు DD ఫ్రీ డిష్ (DD Free Dish) ద్వారా DD స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం (LIVE) కానున్నాయని ” తెలుకున్నాము.
మే 4, 2026న ప్రచురితమైన రాయిటర్స్ నివేదిక ప్రకారం, గత ప్రపంచ కప్ ఒప్పందాలకు సమానమైన అధిక విలువను ఆశించిన ఫిఫా (FIFA), రిలయన్స్-డిస్నీ జాయింట్ వెంచర్ సమర్పించిన 20 మిలియన్ డాలర్ల బిడ్‌ను తిరస్కరించింది. క్రికెట్‌తో పోలిస్తే భారతదేశంలో ఫుట్‌బాల్ ఇప్పటికీ ఒక పరిమిత ఆదరణ కలిగిన క్రీడగానే (niche segment) ఉందని, మరియు అమెరికా, కెనడా మరియు మెక్సికో దేశాలలో టోర్నమెంట్ నిర్వహణ కారణంగా మ్యాచ్‌లు అర్థరాత్రి వేళల్లో జరగనుండటం వల్ల వీక్షకుల సంఖ్య మరింత తగ్గే అవకాశం ఉందని ఆ నివేదిక పేర్కొంది.
“ఆర్థికంగా లాభదాయకంగా” అనిపించని కారణంగా సోనీ వంటి ప్రసార సంస్థలు కూడా ఈ హక్కులను కొనుగోలు చేయకూడదని నిర్ణయించుకున్నాయి.అడ్వర్టైజింగ్ ఏజెన్సీ ‘డెంట్సు ఇండియా’ (Dentsu India)లో స్పోర్ట్స్ విభాగం మేనేజింగ్ పార్ట్‌నర్ అయిన రోహిత్ పోట్‌ఫోడే ఈ పరిస్థితిని “చదరంగం ఆటలో మరో రెండు ఎత్తులు మాత్రమే మిగిలి ఉన్న దశ”గా అభివర్ణించారని ఆ నివేదిక పేర్కొంది. ఆ నివేదికలోని కొంత భాగాన్ని కింద చూడవచ్చు –
దీని తరువాత, మే 5, 2026న ప్రచురితమైన ఇండియా టుడే నివేదిక ఒకటి మా దృష్టికి వచ్చింది. భారతదేశంలో జరగనున్న ఫీఫా ప్రపంచ కప్ 2026 కోసం ప్రసారకర్త ఇంకా ఖరారు కాలేదని ఆ నివేదిక పేర్కొంది. ప్రసార భారతి మరియు దూరదర్శన్ కేవలం ఒక “సేఫ్టీ నెట్ ఆప్షన్” మాత్రమేనని, “తప్పనిసరి షేరింగ్ నిబంధనల ప్రకారం, ముఖ్యంగా సెమీ-ఫైనల్స్ మరియు ఫైనల్ వంటి ప్రతిష్టాత్మకమైన మ్యాచ్‌ల కోసం అవి రంగంలోకి దిగవచ్చు” అని ఆ నివేదిక పేర్కొంది. అయితే, “ఇంకా ఏ ప్రసారకర్త ఖరారు కాలేదని” అని ఆ కథనం స్పష్టంగా చెబుతోంది. అంటే, దూరదర్శన్ ఇప్పటివరకు అధికారికంగా హక్కులను పొందలేదని అర్థం. నివేదికలోని కొంత కింద చూడవచ్చు:
ఒప్పందం ఇంకా కుదరకపోవడంతో, “కేవలం ఐదు వారాల దూరంలో ఉన్న ప్రపంచ కప్ మ్యాచ్‌లను చూసే అవకాశం చైనా మరియు భారతదేశంలోని అభిమానులకు ప్రస్తుతం ఉండకపోవచ్చు” అని ఇటీవలి FTN వార్తా కథనం పేర్కొంది. “ప్రపంచ కప్‌కు ముందే ఫిఫా (FIFA) ఇప్పటికే 175 దేశాలతో ప్రసార ఒప్పందాలను ఖరారు చేసుకుంది” అని కూడా ఆ నివేదిక వెల్లడించింది. అయితే, భారతదేశం విషయంలో ఎటువంటి విశ్వసనీయ సమాచారం లేదు, అలాగే దూరదర్శన్ ప్రసార హక్కులను పొందినట్లు కూడా ఎటువంటి వార్తలు లేవు.
జూన్ 2, 2026న ప్రచురితమైన అల్ జజీరా నివేదిక ప్రకారం, అమ్ముడుపోని ప్రసార హక్కుల విషయంలో నెలల తరబడి కొనసాగిన ప్రతిష్టంభనకు ముగింపు పలుకుతూ, 2026 మరియు 2030 ఫిఫా (FIFA) ప్రపంచ కప్‌ల ప్రసార హక్కుల కోసం ఫిఫా సంస్థ ‘జీ ఎంటర్‌టైన్‌మెంట్’ (Zee Entertainment)తో ఒప్పందం కుదుర్చుకుంది. అలాగే, 2034 వరకు జరిగే 39 FIFA టోర్నమెంట్‌లలో భాగంగా, 2026 మరియు 2030 ప్రపంచ కప్‌లు అలాగే 2027 మహిళల ప్రపంచ కప్‌ను జీ (Zee) ప్రసారం చేస్తుందని ఆ నివేదిక పేర్కొంది.
జూన్ 10, 2026న, DD స్పోర్ట్స్ తమ అధికారిక X ఖాతాలో, “FIFA ప్రపంచ కప్ 2026 యొక్క ప్రారంభ మ్యాచ్, అన్ని క్వార్టర్ ఫైనల్స్, సెమీఫైనల్స్ & గ్రాండ్ ఫైనల్ మ్యాచ్ DD ఫ్రీ డిష్ ద్వారా DD స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం” చేస్తుందని ప్రకటించింది. ఒక నివేదిక ప్రకారం, “స్పోర్ట్స్ బ్రాడ్‌కాస్టింగ్ సిగ్నల్స్ (ప్రసార భారతితో తప్పనిసరిగా పంచుకోవడం/షేర్ చేసుకోవడం) చట్టం కింద ప్రభుత్వం సవరించిన క్రీడా ప్రసారాల జాబితాను నోటిఫై చేసింది. మరియు జీ అధికారులతో సంప్రదింపుల తర్వాత ‘సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ’ సంబంధిత నోటిఫికేషన్‌ను సవరించినట్లు తెలిసింది” అని ఆ నివేదిక ఇంకా పేర్కొంది.
⚽️ The biggest football spectacle is coming to your screens FREE! 📺
📢 Watch the Opening Match, all Quarterfinals, Semifinals & the Grand Final of the FIFA World Cup 2026 LIVE on DD Sports via DD Free Dish.
— Doordarshan Sports (@ddsportschannel) June 10, 2026
కాబట్టి, 2026 ఫిఫా (FIFA) ప్రపంచ కప్‌కు సంబంధించిన మొత్తం 104 మ్యాచ్‌లను దూరదర్శన్ భారతదేశంలో ప్రసారం చేయనుందన్న వాదన తప్పుదోవ పట్టించేలా ఉంది; ఎందుకంటే దూరదర్శన్ కేవలం ప్రారంభ మ్యాచ్, అన్ని క్వార్టర్ ఫైనల్స్, సెమీ ఫైనల్స్ మరియు గ్రాండ్ ఫైనల్ మ్యాచ్‌లను మాత్రమే ప్రసారం చేస్తుంది. 2026 మరియు 2030 ఫిఫా ప్రపంచ కప్‌ల పూర్తి ప్రసార హక్కులు జీ ఎంటర్‌టైన్‌మెంట్ (Zee Entertainment) దక్కించుకుంది.
భారతదేశంలో ఫిఫా (FIFA) ప్రసార హక్కుల కోసం ఏ ప్రైవేట్ బిడ్డర్ (వేలంపాటదారు) లేరన్న వాదన కూడా తప్పుదారి పట్టించేలా ఉంది.
కాబట్టి, ఆ వాదన తప్పుదారి పట్టించేలా ఉంది.
మరికొన్ని వాస్తవ పరిశీలన కధనాలు:
టెలికాం శాఖ తమ నోటీసులో మొబైల్ టవర్ ఏర్పాటు కోసం నిజంగా ₹2,500 అడుగుతున్నారా? వాస్తవ పరిశీలన
