ఒకే రాయితో(ఏకశిలా) చెక్కబడిన హిందూ నిర్మాణాన్ని చూపించే ఫోటో రాజస్థాన్‌కు చెందిన 5,000 సంవత్సరాల నాటి రాతి కట్టడం అనే వాదనతో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ఒక పోస్ట్ షేర్ చేయబడుతోంది.దిగువ వాదన/దావాను చూడండి:

Digiteye India బృందం దేవాలయానికి సంబంధించిన సమాచారం కోసం చూడగా, స్థలం పేరు ఇవ్వకుండా ఇది ఒకే రాతితో చెక్కబడిన దేవాలయమనే వాదనలతో కొన్ని సంవత్సరాల క్రితం X లో క్లెయిమ్/వాదన షేర్ చేయబడిందని గమనించాము.

ఇదే రకమైన పోస్ట్‌లను ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.

అసలు వాస్తవం ఏమిటి

మేము Google రివర్స్ ఇమేజ్ సెర్చ్‌లో చిత్రం యొక్క సమాచారం కోసం ప్రయత్నించగా, ఒకే రాయితో చేసిన ఆలయం గురించి అనేక పరిశోధన పత్రాలు మరియు వార్తా నివేదికలున్నాయని తెలుసుకున్నాము. కానీ ఆలయ ప్రదేశం రాజస్థాన్ కాదు, తమిళనాడు. మరియు ఈ ఆలయాన్ని వెట్టువన్ కోయిల్ అని పిలుస్తారు, ఇది తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా, కలుగుమలైలో ఉన్న ఒకే రాక్-కట్(ఏకశిలా) ఆలయం మరియు ఇది అన్ని సోషల్ మీడియా పోస్ట్‌లలో క్లెయిమ్ చేసినట్లుగా  5000 సంవత్సరాల పురాతన ఆలయం కాక 8వ శతాబ్దం(8the century AD )లో నిర్మించబడిందని అంచనా వేయబడింది.

వెట్టువన్ కోయిల్ 760-800 AD లో ఒక ఏకశిలా ఆలయంగా నిర్మించబడింది, ఇది దీర్ఘచతురస్రాకారపు రాతి నుండి ఉద్భవిస్తున్న ద్రవిడ విమానాన్ని కలిగి ఉంటుంది. అందువల్ల, ఈ వైరల్ చిత్రం తమిళనాడులోని 8వ శతాబ్దపు ఏకశిలా దేవాలయం, క్లెయిమ్ చేసినట్లుగా రాజస్థాన్లోని 5,000 సంవత్సరాల నాటి పురాతనమైనది ఆలయం కాదు.

వాదన/దావా: : ఒకే రాయితో చెక్కబడిన హిందూ నిర్మాణాన్ని చూపించే ఫోటో భారతదేశంలోని రాజస్థాన్‌కు చెందిన 5,000 సంవత్సరాల నాటి రాతి కట్టడం అనేది వాదన.

నిర్ధారణ: తప్పుడు వాదన. చిత్రం తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాలో వెట్టువన్ కోయిల్ అని పిలువబడే 8వ శతాబ్దపు ఏకశిలా దేవాలయం మరియు ఇది క్లెయిమ్ చేసినట్లుగా 5,000 సంవత్సరాల పురాతనమైన ఆలయం కాదు.

రేటింగ్: తప్పు దారి పట్టించే ప్రయత్నం —

వాస్తవ పరిశీలన వివరాలు:

మరి కొన్ని వాస్తవ పరిశీలన కధనాలు:

IRCTCలో స్నేహితులకు లేదా బంధువుల కోసం రైలు టికెట్లును బుక్ చేస్తే జరిమానా విధించబడుతుందా? వాస్తవ పరిశీలన

సైనికుల (అగ్నివీర్స్) రిక్రూట్ కోసం అగ్నిపథ్ పథకం కొన్ని మార్పులతో మళ్లీ ప్రారంభించబడిందా? వాస్తవ పరిశీలన-వీడియో

1 thought on “ఈ చిత్రం రాజస్థాన్‌లోని 5000 సంవత్సరాల పురాతన ఆలయాన్ని చూపుతుందా? వాస్తవ పరిశీలన

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.

Exit mobile version