Tag Archives: assam chief minister

Is Rahul Gandhi carrying a copy of Chinese Constitution instead of Indian constitution in public rallies? Fact Check

రాహుల్ గాంధీ బహిరంగ సభల్లో భారత రాజ్యాంగానికి బదులు చైనా రాజ్యాంగం కాపీని తీసుకువెళుతున్నారా? వాస్తవ పరిశీలన

వాదన/Claim: రాహుల్ గాంధీ బహిరంగ సభల్లో భారత రాజ్యాంగానికి బదులు చైనా రాజ్యాంగం కాపీని ప్రదర్శిస్తూ కనిపిస్తున్నారనేది వాదన.

నిర్ధారణ/Conclusion: తప్పుడు వాదన.రాహుల్ గాంధీ చైనా రాజ్యాంగాన్ని కాకుండా గోపాల్ శంకరనారాయణన్ (EBC ద్వారా ప్రచురించబడింది) వ్రాసిన భారత రాజ్యాంగంతో (కోటు పాకెట్ పుస్తకం) కనిపిస్తున్నారు.

రేటింగ్: పూర్తిగా తప్పు

Fact Check వివరాలు:

ఇటీవల అనేక ర్యాలీలలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ భారత రాజ్యాంగం యొక్క ఎరుపు రంగు కాపీని ప్రదర్శిస్తూ కనిపిస్తుండంతో,అతని ప్రత్యర్థులు ఆ కాపీ చైనా రాజ్యాంగం కాపీ అని, భారత రాజ్యాంగం కాదని పేర్కొనడం జరిగింది.

అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వాస్ శర్మ పోస్ట్ చేసిన దావాను క్రింద చూడండి:

భారత రాజ్యాంగం కవర్ నీలం రంగులో ఉంది. చైనా రాజ్యాంగం కవర్ ఎరుపు రంగులో ఉంది. రాహుల్ చైనా రాజ్యాంగాన్ని ప్రదర్శిస్తూ కనిపిస్తున్నారా? ధృవీకరించవలసిన అవసరం ఉంది.

“రాహుల్ తన సమావేశాలకు హాజరయ్యే ప్రజలకు ఎరుపు రంగులో ఉన్న చైనా రాజ్యాంగాన్ని ప్రదర్శిస్తున్నారు.నీలి రంగులో ఉన్న మన రాజ్యాంగం, ‘రాష్ట్ర విధాన నిర్దేశక సూత్రాలు’ అనే అధ్యాయాన్ని కలిగి ఉంది.ఈ అధ్యాయం మన దేశంలో యూనిఫాం సివిల్ కోడ్‌ని అమలు చేయడం ఒక విధి అని సూచిస్తుంది.దీన్ని ఇప్పుడు రాహుల్ వ్యతిరేకిస్తున్నారు.అందుకే అతని చేతిలో ఉన్న రాజ్యాంగం తప్పనిసరిగా చైనాదేనని నేను ఖచ్చితంగా భావిస్తున్నానని”ఆయన మరుసటి రోజు,మే 18, 2024న సమర్ధించుకున్నారు.

పైన ట్వీట్‌లో చూసినట్లుగా, ఎరుపు రంగు కవర్‌తో ఉన్న చైనా రాజ్యాంగం మరియు మరొకటి నీలం రంగు కవర్‌తో ఉన్న భారత రాజ్యాంగం చూడవచ్చు.ఈ ట్వీట్ వైరల్‌గా మారి సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది.

FACT-CHECK

తన ఇటీవలి బహిరంగ ర్యాలీలన్నింటిలో, రాహుల్ గాంధీ ఎరుపు రంగు కవర్‌తో ఉన్న పుస్తకంతో కనిపించారు.భారతదేశంలోని బడుగు బలహీన వర్గాల ప్రజలకు రిజర్వేషన్లు కల్పించడంతో పాటు,ఒకే విధమైన ప్రాథమిక హక్కులతో పేదలు మరియు ధనికుల మధ్య సమానత్వాన్ని నిర్ధారించిన రాజ్యాంగం యొక్క ప్రాముఖ్యతను ఆయన నొక్కి చెప్పారు.మేము పుస్తకాన్ని నిశితంగా పరిశీలించినప్పుడు, ఎరుపు కాపీపై “భారత రాజ్యాంగం” అని స్పష్టంగా వ్రాయబడిందని మేము గ్రహించాము.Digiteye బృందం పుస్తకాన్ని నిశితంగా పరిశీలించినప్పుడు,ఎరుపురంగు కాపీపై “భారత రాజ్యాంగం” అని స్పష్టంగా వ్రాయబడిందని మేము గమనించాము.

ఆంగ్లంలో మరియు చేతితో వ్రాసిన అసలు భారత రాజ్యాంగం ఇక్కడ చూడవచ్చు:

అయితే, ఎరుపు రంగు కవర్‌తో ఉన్న భారత రాజ్యాంగం పుస్తకం, గోపాల్ శంకరనారాయణన్ వ్రాసిన ‘కాన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా (కోట్ పాకెట్ ఎడిషన్)’ అనే ప్రత్యేక సంచికను ఈస్టర్న్ బుక్ కంపెనీ (EBC) ప్రచురించింది, ఇది EBC వెబ్‌స్టోర్‌లో మరియు అమెజాన్ ఆన్‌లైన్ షాపింగ్ లో కూడా అందుబాటులో ఉంది:

కావున,రాహుల్ గాంధీ బహిరంగ సభల్లో ప్రదర్శిస్తున్న కాపీ,గోపాల్ శంకరనారాయణన్ వ్రాసిన EBC ఎడిషనని తెలుస్తుంది.
చైనీస్ రాజ్యాంగం కూడా ఎరుపు రంగులో కనిపిస్తుంది, కానీ కవర్ పైన అక్షరాలు దివువన ఉండడం చూడవచ్చు.

కాబట్టి, ఈ వాదన తప్పుడు వాదన.
మరి కొన్ని Fact Checks:

రాహుల్ గాంధీ కాంగ్రెస్ కార్యకర్తకు కుక్క బిస్కెట్ ఇచ్చారా?; వాస్తవ పరిశీలన
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ దివ్యాంగ వ్యక్తితో కరచాలనం చేస్తూ కనిపించే వీడియో, తప్పు దారి పట్టించే ప్రయత్నం. వాస్తవ పరిశీలన