500 రూపాయలలో నక్షత్రం (*) గుర్తు ఉన్నచో అది నకిలి నోటా? Fact Check

గత కొన్ని రోజులుగా చెలామణిలో ఉన్న నక్షత్రం (*) గుర్తు ఉన్న ₹500 నోట్లు నకిలీ నోట్లు అనే క్లెయిమ్‌తో సోషల్ మీడియా పోస్ట్ విస్తృతంగా షేర్ చేయబడుతోంది. ఇటీవల RBI చెలామణి నుండి రూ.2,000 నోట్లను ఉపసంహరించుకున్న సందర్భంలో, నక్షత్రం గుర్తు ఉన్న ₹500 నోటు మరింత దృష్టిని ఆకర్షించింది.

ఈ సందర్భంగా, ఫేస్‌బుక్ పోస్ట్‌లోని లో ఒక వాదన ఈ మధ్య చాలమంది షేర్ చేసారు ఇలా: “గత 2-3 రోజుల నుంచి * గుర్తుతో కూడిన ఈ 500 నోట్లు మార్కెట్‌లో చెలామణి కావడం ప్రారంభించాయి.అలాంటి నోటు నిన్న IndusInd బ్యాంక్ నుండి తిరిగి వచ్చింది. ఇది నకిలీ నోటు.ఈ రోజు కూడా, ఒక స్నేహితుడు కస్టమర్ నుండి అలాంటి 2-3 నోట్లను అందుకున్నాడు, కానీ వెంటనే వాటిని తిరిగి ఇచ్చెసాడు.అయితే ఈ నోటును ఎవరో ఉదయం ఇచ్చారని కస్టమర్ కూడా చెప్పాడు.జాగ్రత్త వహించండి. ఇక్కడ మార్కెట్‌లో నకిలీ నోట్లను చెలామణి చేసే మోసగాళ్ల సంఖ్య పెరిగింది. అబ్యర్ధన: దయచేసి అప్రమత్తంగా ఉండండి.ఈ సందేశాన్ని మీ సోదరులకు తెలియజేయండి, తద్వారా వారు మోసం నుండి రక్షించపబడతారు. ధన్యవాదాలు.”

ఈ రకమైన వార్తలు ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చును.

FACT CHECK

చాలా మంది వ్యక్తులపై ప్రభావం చూపే అవకాశం ఉన్నందున Digiteye India team ఈ పోస్ట్‌లో ఎంత వాస్తవం ఉందొ పరిశీలనకు  తీసుకుంది. మేము రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అధికారిక వెబ్‌సైట్‌లో, ₹500నోట్లు యొక్క ప్రామాణికత కోసం పరిశీలన చేసినప్పుడు, RBI ఇటీవల జూలై 27, 2023 తేదీలో జారీ చేసినతన పత్రికా ప్రకటనలో,  ఈ నోటు చట్టబద్ధమైనదని స్పష్టం చేసింది. RBI పత్రికా ప్రకటన క్రింద చూడవచ్చు:

ఈ విషయంలో, లోపభూయిష్టంగా ముద్రించిన బ్యాంక్ నోట్లకు ప్రత్యామ్నాయంగా ఉపయోగించుట కోరకు బ్యాంక్ నోటు యొక్క నంబర్ ప్యానెల్‌లో స్టార్ (*) చిహ్నం చేర్చబడ్డదని RBI పేర్కొంది. (100 సీరియల్ నంబర్ ఉన్న బ్యాంక్ నోట్ల ప్యాకెట్‌లో స్టార్ (*) చిహ్నం చెర్చబడినది). నక్షత్రం (*) చిహ్నం ఉన్న బ్యాంక్ నోటు ఏదైనా ఇతర చట్టపరమైన బ్యాంక్ నోటుతో సమానంగా ఉంటుంది, అని RBI వెలువడించింది.

RBI యొక్క FAQ విభాగంలో కూడా “స్టార్ (*) చిహ్నం పద్దతి లోపభూయిష్టంగా ముద్రించిన బ్యాంక్ నోట్లకు ప్రత్యామ్నాయంగా ఉపయోగించుట కోరకు చెర్చబడినది అని, నక్షత్రం (*) చిహ్నం ఉన్న బ్యాంక్ నోటు ఏదైనా ఇతర చట్టపరమైన బ్యాంక్ నోటుతో సమానంగా ఉంటుంది అని అని RBI వెలువడించింది.

మేము 2006 లో జారీ చేసిన ఇదే విధమైన ప్రెస్ రిలీజ్‌ని కనుగొన్నాము. ఇక్కడ ₹10,₹20,₹50 విలువ కలిగిన
కరెన్సీ నోట్లలో ‘స్టార్’ ప్రిఫిక్స్ జోడించబడుతుందని పేర్కొంది.

Claim/వాదన: RBI యొక్క ₹500 రూపాయలలో నక్షత్రం (*) గుర్తు ఉన్నచో అది నకిలి నోటు.
నిర్ధారణ: తప్పు,రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఈ నోట్లు చట్టబద్ధమైనవని స్పష్టం చేసింది.
Rating: Misrepresentation -- 




					
					
									

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*