Did CJI leave courtroom when Solicitor General was presenting arguments? Fact Check

సొలిసిటర్ జనరల్ వాదనలు వినిపిస్తున్నప్పుడు CJI కోర్టు గదిని విడిచిపెట్టి వెళ్లిపోయారా? వాస్తవ పరిశీలన

వాదన/Claim: సుప్రీంకోర్టులో సొలిసిటర్ జనరల్ వాదనలు వినిపిస్తుండగా, ప్రధాన న్యాయమూర్తి అక్కడి నుంచి లేచి వెళ్లిపోయారనేది వాదన.

నిర్ధారణ/Conclusion: పూర్తిగా తప్పు.తప్పుడు వాదన చేయడం కోసం వీడియో ఆకస్మికంగా కత్తిరించబడింది. సెషన్ మొత్తం సీజేఐ అక్కడే ఉన్నట్లు ఒరిజినల్ వీడియోలో కనిపిస్తుంది.

రేటింగ్: పూర్తిగా తప్పు-- Five rating

రాజకీయ పార్టీలకు ఎన్నికల బాండ్లపై చారిత్రక తీర్పు ఇచ్చిన నేపథ్యంలో సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తన వాదనలు వినిపిస్తుండగా చీఫ్ జస్టిస్ డీ.వై చంద్రచూడ్ బయటకు వెళ్లిపోతున్న వీడియో సోషల్ మీడియాలో విభిన్నమైన వాదనలతో వైరల్‌గా మారింది.

జయేష్ మెహతా అనే వినియోగదారు చేసిన ఒక పోస్ట్ ట్విట్టర్‌లో చర్చకు దారితీసింది.

క్యాప్షన్ ఇలా ఉంది: “#CJI ఈ విధంగా ఎలా ప్రవర్తిస్తారు? SG, CJI ముందు తన వాదనలను వినిపిస్తుండగా అతను మరియు ఇతర న్యాయమూర్తులు వాయిదా వేయకుండా లేచి వెళ్లిపోయారు.. ఇది భారత ప్రభుత్వానికి ఘోర అవమానం…CJI చంద్రచూడ్‌తో సహా న్యాయమూర్తులందరినీ తీసేసి, భారత రాష్ట్రపతి ద్వారా వారందరి చేత బలవంతంగా రాజీనామా చేయించాలి. అతను మరియు ఇతర న్యాయమూర్తులు భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతీకారం తీర్చుకుంటున్నారు.. న్యాయమూర్తుల ఈ వైఖరికి గల కారణాలను నేను త్వరలోనే ఒక థ్రెడ్ ను పోస్ట్ చేస్తాను”.

Chief Justice DY Chandrachud

ప్రధాన న్యాయమూర్తి డీ.వై చంద్రచూడ్

FACT-CHECK

మొత్తం వీడియో చూసినప్పుడు, సొలిసిటర్ జనరల్ తన వాదనలు వినిపిస్తున్నప్పుడు భారత ప్రధాన న్యాయమూర్తి కోర్టు గదిని విడిచిపెట్టి వెళ్లకుండా ఉండడం గమనించవచ్చు. మేము అసలు వీడియో కోసం యు ట్యూబ్లో ప్రయత్నించగా, మార్చి 18, 2024న ఈ క్రింది వీడియో అప్‌లోడ్ చేయబడినట్లు గమనించాము.

ఆరోపించిన సంఘటన 24 నిమిషాల నుండి 27 నిమిషాల వ్యవధి మధ్యలో జరుగుతుంది మరియు ప్రధాన న్యాయమూర్తి తన సహోద్యోగులతో మాట్లాడటం మరియు తన సీటును సర్దుబాటు చేసుకుంటుడడం స్పష్టంగా చూడవచ్చు, కానీ సీటును వదిలి వెళ్ళలేదు. నిజానికి ఎలాంటి అంతరాయం లేకుండానే కోర్టు వ్యవహారాలు కొనసాగాయి.

24వ నిమిషం వద్ద వీడియోను హఠాత్తుగా ముగించడం ద్వారా, ప్రధాన న్యాయమూర్తి కోర్టు గది నుండి బయటకు వెళ్లినట్లు తప్పుడు వాదన చేయబడింది. కాబట్టి, దావా/వాదన పూర్తిగా తప్పు.

మరి కొన్ని Fact Checks:
భారతదేశ వ్యాప్తంగా అన్ని బాణసంచా అమ్మకాలు మరియు వాటి వాడకాన్ని సుప్రీంకోర్టు నిషేధించిందా? వాస్తవ పరిశీలన
బెంగళూరులో షాపుల సైన్ బోర్డులు కాషాయ రంగులో ఉంటె వాటిని బెంగళూరు పౌర సంస్థ(BBMP) తొలగిస్తోందా? వాస్తవ పరిశీలన

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*