Tag Archives: private vehicles

ఆర్మీ ప్రైవేట్ వాహనాలకు కూడా టోల్ ఫీజు మినహాయింపు పొడిగించారా? వైరల్ పోస్ట్‌పై వాస్తవ పరిశీలన

వాదన/Claim: రక్షణ సిబ్బంది ప్రైవేట్ వాహనాలకు కూడా టోల్ ట్యాక్స్ మినహాయించబడిందని వైరల్ అడ్వైజరీ లేఖ పేర్కొంది.

నిర్ధారణ/Conclusion: లేఖ నకిలీదని చాలా ఆధారాలు లభించాయి.
రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ “డ్యూటీ’లో ఉన్న వ్యక్తులకు మాత్రమే మినహాయింపు లభిస్తుంది.మరియు రిటైర్డ్ వ్యక్తులకు లభించదు.మరియు వ్యక్తిగత వాహనం ఏదైనా అధికారిక ప్రయోజనం మరియు విధిని నిర్వర్తించడానికి ఉపయోగించని పక్షంలో, అది విధి నిర్వహణ అధికారితో పాటు వచ్చినప్పటికీ, టోల్ మినహాయింపు అందుబాటులో ఉండదు. RTI ప్రశ్నలకు సమాధానమిస్తూ, NHAI కూడా అదే పేర్కొంది.

RATING: Misinterpretation —

రక్షణ సిబ్బంది ప్రైవేట్ వాహనాలకు టోల్ ఫీజు లేదు’ అంటూ ఓ అడ్విసోరీ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇండియన్ టోల్ (సైనిక దళం, వైమానిక దళం) చట్టం, 1901కి మార్పు జరిగిందని సింగిల్ పేజీ అడ్వైజరీ ఆరోపించింది.

మార్పులు మరియు కొత్త నిబంధన ప్రకారం, ఆర్మీ సిబ్బందికి టోల్ ఫీజు మినహాయింపుతో పాటు, ఆర్మీ సిబ్బంది గుర్తింపు కార్డు చూపిస్తే వారి ప్రైవేట్ వాహనాలకు కూడా అదే మినహాయింపు అమలు చేయబడింది. ఈ సమాచారాన్ని టోల్ సిబ్బందికి త్వరగా చేరవేయాలని లేఖలో పేర్కొన్నారు.

వాట్సాప్ ఫార్వార్డెడ్ మెసేజ్‌ల ద్వారా లేఖ దావానంలా వ్యాపిస్తోంది.వాట్సాప్‌లో ఈ వాదన/క్లెయిమ్‌ యొక్క వాస్తవాన్ని పరిశీలన చేయమని Digiteye India బృందానికి అభ్యర్థన వచ్చింది.

FACT CHECK

Digiteye India బృందం లేఖను పరిశీలించగా, లేఖ నకిలీదని చాలా ఆధారాలు లభించాయి.

లేఖ యొక్క హెడర్‌లో జారీ చేయబడిన మంత్రిత్వ శాఖ గురించి ప్రస్తావించబడలేదు.తేదీ ఆగస్టు 25, 2023, చేతితోవ్రాసి, ఫోటో కాఫీ చేయబడింది. లేఖలో “service pers, reg forces, gtd on pvt vehs of def pers, come, Rks, indl, fmn channel” వంటి సంక్షిప్త పదాలు(ఎక్రోనింస్) ఉపయోగించబడ్డాయి.అధికారిక అడ్విసోరీ ప్రకారం సరైన పదాలు ఇవి: “service personnel, registered forces, granted on private vehicles of defence personnel, individual.”ప్రభుత్వం నుండి వచ్చేఎటువంటి అధికారిక ప్రకటన ఇలాంటి అర్ధంలేని సంక్షిప్త పదాలను(ఎక్రోనింస్) ఉపయోగించదు.

మేము ది ఇండియన్ టోల్ (ఆర్మీ, ఎయిర్ ఫోర్స్) చట్టం, 1901ని పరిశీలించాము.
చట్టంలోని సెక్షన్ 3 ప్రకారం అధికారులు, సైనికులు, ఎయిర్‌మెన్‌లు మరియు వారి యొక్క కుటుంబ సబ్యులు లేదా అధీకృత అనుచరుల కుటుంబాలలోని సభ్యులందరికీ టోల్ చెల్లింపు నుండి మినహాయింపు ఉంది.

కొన్ని అపోహలపై జూన్ 17, 2014న రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ జారీ చేసిన వివరణను మేము పరిశీలించాము. సమస్యను మళ్లీ పరిశీలించిన మంత్రిత్వ శాఖ ఇప్పుడు “ఇండియన్ టోల్ (ఆర్మీ మరియు ఎయిర్ ఫోర్స్) చట్టం  1901 ప్రకారం, ‘డ్యూటీ’లో ఉన్న వ్యక్తులకు మాత్రమే మినహాయింపు లభిస్తుంది.మరియు రిటైర్డ్ వ్యక్తులకు లభించదు.మరియు భారతీయ టోల్ (ఆర్మీ మరియు ఎయిర్ ఫోర్స్) Ru1es,1942లో పేర్కొన్న విధంగా వ్యక్తిగత వాహనం ఏదైనా అధికారిక ప్రయోజనం మరియు విధిని నిర్వర్తించడానికి ఉపయోగించని పక్షంలో, అది విధి నిర్వహణ అధికారితో పాటు వచ్చినప్పటికీ, టోల్ మినహాయింపు అందుబాటులో ఉండదు. మరియు ‘ఆర్మీ సిబ్బంది’ గుర్తింపు కార్డు చూపిస్తేనే మినహాయింపు పొందగలరని” స్పష్టత ఇచ్చింది.

విధుల్లో ఉన్న సిబ్బందికి మాత్రమే టోల్ మినహాయింపు ఉంటుందని,రిటైర్డ్ అధికారులకు వర్తించదని మంత్రిత్వ శాఖ ఖరాఖండిగా స్పష్టం చేసింది. అధికారిక ప్రయోజనం మరియు విధి కోసం మాత్రమే ప్రైవేట్ వాహనాలపై మినహాయింపు అనుమతించబడుతుందని కూడా స్పష్టం చేసింది.

ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఫిబ్రవరి 20, 2020 నాటి నివేదిక ప్రకారం, RTI ప్రశ్నలకు ప్రతిస్పందనగా, రక్షణ సిబ్బంది విధి నిర్వహణలో ప్రయాణిస్తున్నప్పుడు మాత్రమే వారికి టోల్ టాక్స్ మినహాయించబడుతుందని NHAI పేర్కొంది. వారు విధి నిర్వహణలోలేనప్పుడు వారి ప్రైవేట్ వాహనాలకు ఎలాంటి మినహాయింపు ఉండదు.

వైరల్ లెటర్ కు సంబంధించిన వాదనలో నిజం లేదు.

మరి కొన్ని Fact Checks:

భారతదేశం గౌరవార్థం దుబాయ్‌లోని ‘అల్ మిన్‌హాద్’ అనే జిల్లా పేరును ‘హింద్’ గా మార్చారా? Fact Check:

బెంగళూరు టెర్మినల్ 2 చిత్రాలు అరుణాచల్ ప్రదేశ్‌లోని కొత్త విమానాశ్రయానికి సంబంధించినవిగా పేర్కొనబడ్డాయి; Fact Check