Tag Archives: freedom of speech

ఈ వీడియోలో కమలా హారిస్ ‘Xని షట్ డౌన్ చేయాలి’ అన్నారా? వాస్తవ పరిశీలన

వాదన/Claim: X ప్లాట్‌ఫారమ్‌ను మూసివేయాలని(షట్ డౌన్) కమలా హారిస్ అన్నారనేది వాదన.

నిర్ధారణ/Conclusion: తప్పుగా చూపించే ప్రయత్నం. ట్రంప్ యొక్క ట్విట్టర్ ఖాతా రద్దుపై చేసిన పాత ఇంటర్వ్యూ వీడియోను, హారిస్ Xని మూసివేయాలని కోరుతున్నట్లు తప్పుగా షేర్ చేయబడింది.

రేటింగ్/Rating: తప్పుగా చూపించే ప్రయత్నం–

వాస్తవ పరిశీలన పూర్తి వివరాలను వీడియోలో చూడటానికి కింది చిత్రంపై క్లిక్ చేయండి.

లేదా దిగువ కథనాన్ని చదవండి.

************************************************************************

అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ ఎక్స్ ఓనర్ ఎలోన్ మస్క్ గురించి మాట్లాడుతూ ఆయన తన ఎక్స్ షట్ డౌన్ చేయాలని చెప్పినట్లు ఒక వీడియో షేర్ చేయబడుతోంది.

“ఆయన తన అధికారాలను కోల్పోయారు మరియు తన Xని షట్ డౌన్ చేయాలి. ముఖ్యమైన విషయం ఏమిటంటే, Facebook కోసం ఒక నియమం మరియు Twitter కోసం వేరే నియమం ఉంది. ఈ సోషల్ మీడియా సైట్‌ల యొక్క శక్తి సామర్ధ్యాలని అర్థం చేసుకోవడానికి వాటిపై ఒక బాధ్యత ఉంచబడాలి.వారు ఎటువంటి విధమైన పర్యవేక్షణ లేదా నియంత్రణ లేకుండా లక్షలాది వ్యక్తులతో నేరుగా మాట్లాడుతున్నారు, అది ఆపివేయాలి” అని హారిస్ వీడియోలో చెప్పడం చూడవచ్చు.

“ఇది X ప్లాట్ఫారం లో వాక్ స్వాతంత్య్రాన్ని నియంత్రించే ప్రయత్నమంటూ” ఇక్కడ షేర్ చేయబడింది.

FACT CHECK

మేము కీలక ఫ్రేమ్‌లను తీసుకొని Google రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, X (గతంలో ట్విట్టర్)నుండి అప్పటి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఖాతాను తీసివేయడంపై CNN హోస్ట్ జేక్ తాపర్‌తో హారిస్ 2019లో మాట్లాడుతున్నప్పటి వీడియో అని కనుగొన్నాము, మరియు అది కమల హారిస్ CNNకు ఇచ్చిన అక్టోబర్ 2019 నాటి ఇంటర్వ్యూలో ట్రంప్ యొక్క X అధికారిక ఖాతాను సస్పెండ్ చేసిన సందర్భంలో మాట్లాడిన వీడియో క్లిప్ అని ఫలితాలు వెల్లడయ్యాయి. అసలు/ఒరిజినల్ ఇంటర్వ్యూని ఇక్కడ చూడండి:

ఇంటర్వ్యూలో చిన్న మార్పులు చేయబడి, హారిస్ ఎన్నికైన తర్వాత ఆమె Xని మూసివేస్తారని వాదన చేయబడింది. సోషల్ మీడియాలో ప్రసారం అవుతున్న వీడియో క్లిప్, అప్పటి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్‌ను(ప్రస్తుతం X ప్లాట్‌ఫారమ్) ఉపయోగించడం గురించి హారిస్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన 2019 నాటి ఇంటర్వ్యూ వీడియో క్లిప్ నుండి తీసుకోబడింది. అందువల్ల, హారిస్ తన ప్రచారంలో ఇప్పటివరకు Xని మూసివేయడం గురించి ఎటువంటి ప్రకటనలు చేయలేదు.

మరి కొన్ని వాస్తవ పరిశీలన కధనాలు:

VPనామినీ J.D. వాన్స్ పేరు ప్రకటించినప్పుడు US రిపబ్లికన్ కన్వెన్షన్‌లో ‘ఇండి77యా-ఇండియా’ అన్న నినాదాలు వినిపించాయా? వాస్తవ పరిశీలన

కమలా హారిస్‌ అమెరికా యొక్క సహజసిద్దమైన పౌరురాలు కాదా? US ప్రెసిడెంట్ అభ్యర్థి యొక్క అర్హతపై వాదన మళ్లీ తెరపైకి వచ్చింది; వాస్తవ పరిశీలన