Deposit Refund System

అయోధ్యలో ఖాళీ మినరల్ వాటర్ ప్లాస్టిక్ బాటిల్ను తిరిగి ఇస్తే ₹5 మనకు అందుతుందా? వాస్తవ పరిశీలన

వాదన/Claim: అయోధ్యలో ఖాళీ వాటర్ బాటిల్‌ను తిరిగి ఇస్తే మీకు ₹5 లభిస్తుందనేది వాదన

నిర్ధారణ/Conclusion:డిపాజిట్ రీఫండ్ స్కీమ్ యొక్క QR కోడ్ స్టిక్కర్‌ ఉన్న ఖాళీ బాటిల్‌ను మాత్రమే అయోధ్యలో తిరిగి ఇస్తే ₹5 తిరిగి లభిస్తుంది.
ఏదైనా ఖాళీ బాటిల్‌ను తిరిగి ఇస్తే ఇచ్చే చెల్లింపు పథకం కాదు

రేటింగ్: తప్పు దారి పట్టించే వార్తా — 

Fact Check వివరాలు

జనవరి 22, 2024న రామాలయాన్ని ప్రారంభించిన తర్వాత అయోధ్య ఇటీవల వార్తల్లోకి వచ్చిన నేపధ్యంలో, క్యూఆర్ కోడ్ స్టిక్కర్‌తో కూడిన ప్లాస్టిక్ మినరల్ వాటర్ బాటిల్ చిత్రం మరియు బాటిల్ తిరిగి ఇచ్చినచో ప్రజలు ₹5 వాపసు పొందవచ్చుననే’ వాదన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇది ఇక్కడ మరియు ఇక్కడ షేర్ చేయబడింది.

FACT CHECK

క్లెయిమ్/వాదనలో వాస్తవం పరిశీలించడానికి Digiteye India Team ఈ అభ్యర్థనను అందుకుంది. మొదట బాటిల్ పై ఉన్న స్టిక్కర్‌ యొక్క సమాచారం కోసం చూడగా, ఇది ‘ది కబాడీవాలా‘ పేరుతో లోగోను కలిగి ఉంది. దీని వెబ్‌సైట్ ఈ పథకానికి సంబంధించిన వివరాలను క్రింది విధంగా లభ్యపరిచారు.

ముఖ్యంగా, ఇది ఖాళీ బాటిల్‌ను అయోధ్య నగరంలో ఎక్కడా పడేయకుండా, తిరిగి ఇచ్చేలా ప్రజలను ప్రోత్సహించడానికి సంస్థ ప్రారంభించిన ‘డిపాజిట్ రీఫండ్ సిస్టమ్’ .
అయితే, నిబంధన ఏమిటంటే, బాటిల్‌ను కొనుగోలు చేసేటప్పుడు ₹5 ముందుగానే వసూలు చేయబడుతుంది మరియు ఖాళీ బాటిల్‌ను  ఇచ్చిన తర్వాత తిరిగి ₹5 ఇవ్వబడుతుంది.

ఉదాహరణకి మినరల్ వాటర్ బాటిల్ ధర ₹10 అయితే, మీరు ₹15 చెల్లిస్తారు మరియు ఖాళీ బాటిల్‌ను తిరిగి ఇచ్చిన తర్వాత, మీ డిపాజిట్ ₹5 తిరిగి ఇవ్వబడుతుంది. మేము QR కోడ్‌ని స్కాన్ చేసినప్పుడు, అయోధ్యలోని కలెక్షన్ పాయింట్‌ల జాబితా చూపబడింది. ‘ది కబాడీవాలా’ వెబ్ పేజీ కూడా ‘డిపాజిట్ రీఫండ్ స్కీమ్’ అని స్పష్టం చేసింది. కాబట్టి, ఇది ప్రతి ఖాళీ బాటిల్‌కు(కోడ్ స్టిక్కర్‌ లేని బాటిల్ కూడా) తిరిగి ఇచ్చినప్పుడు ₹5 పొందే ఏకపక్ష పథకం కాదు.

రానున్న భవిష్యత్తులో వేలాది మంది భక్తులు అయోధ్య నగరాన్ని సందర్శిస్తారని భావిస్తున్నందున పరిశుభ్రంగా ఉంచడానికి భోపాల్‌కు చెందిన స్టార్టప్ ‘ది కబాడీవాలా’, మరియు అయోధ్య నగర్ నిగమ్ మధ్య పరస్పర సహకారంతో ఈ పథకం జరిగిందని ఇతర వివరాలు ద్వారా తెలుస్తుంది.

ఇంకా, ‘ది కబాడీవాలా’ వెబ్‌సైట్ ఈ వీడియోలో ఈ పధకం గురించి స్పష్టంగా వివరిస్తుంది:

అందువలన, అయోధ్యలో క్లీన్‌నెస్ డ్రైవ్‌లో భాగంగా, ఈ వాటర్ బాటిళ్లను కొనుగోలు చేసే వ్యక్తులు డిపాజిట్‌గా ₹5 అదనంగా చెల్లించి, ఖాళీ బాటిల్‌ను ఇచ్చి డిపాజిట్ ని తిరిగి పొందవచ్చు.

మరి కొన్ని Fact Checks:

అయోధ్యలో దొరికిన రాగి స్క్రోల్ (రాగి ఫలకం)బౌద్ధుల కాలానికి చెందినదని వీడియో పేర్కొంది; Fact Check

నేపాలీ హిందువులు బహుమతులతో అయోధ్యకు చేరుకున్నట్లుగా షేర్ చేయబడిన వీడియో; వాస్తవ పరిశీలన

 

One thought on “అయోధ్యలో ఖాళీ మినరల్ వాటర్ ప్లాస్టిక్ బాటిల్ను తిరిగి ఇస్తే ₹5 మనకు అందుతుందా? వాస్తవ పరిశీలన

  1. Pingback: కల్తీ పాల వల్ల 2025 నాటికి 87% భారతీయులు క్యాన్సర్ బారిన పడతారని WHO హెచ్చరిక జారీ చేసిందా? వాస్తవ పరి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *