ఈ మనిషి యోగా శక్తితో గాలిలో తేలియాడుతున్నాడా? Fact Check

వాట్సాప్‌లో ఓ వీడియో వైరల్‌ అవుతోంది. వైరల్ వీడియోలో ఒక వ్యక్తి ఎటువంటి మద్దతు/సహాయం లేకుండా గాలిలో తేలుతున్నట్లు ఆరోపిస్తున్నారు.యోగా శక్తి వల్లే మనిషి గాలిలో తెలియాడుతున్నడని వీడియోతో వైరల్ అవుతున్న వాదనలు పేర్కొంటున్నాయి.దావాలో ఒకటి ఈ విధంగా ఉంది,

यह लड़का तमिलनाडु का रहने वाला है। इसने योग विद्या के बल पर आसमान में उड़कर दिखाया। यह देखकर वैज्ञानिक भी हैरान हैं। श्रीरामचरित मानस और पवनपुत्र श्री हनुमान जी को काल्पनिक बताने वालों के लिये खुली चुनौती|

(అనువాదం:ఈ అబ్బాయి తమిళనాడుకు చెందినవాడు. యోగ శక్తితో ఆకాశంలో ఎగురుతున్నాడు. ఇది చూసి శాస్త్రవేత్తలు కూడా ఆశ్చర్యపోతున్నారు. శ్రీ రామచరిత్ర మానస్ మరియు పవన పుత్ర శ్రీ హనుమంతుడు ఊహాత్మకమైన/కల్పితం అని పిలిచే వారికి ఇది ఓపెన్ ఛాలెంజ్. )

వాట్సాప్‌లో వైరల్ అయిన ఈ వీడియోను యొక్క వాస్తవాన్ని తనిఖీ చేయమని డిజిటీ ఇండియాకు అభ్యర్థన వచ్చింది.

FACT CHECK

మనిషిని గాలిలో ఎక్కువసేపు తేలుతూ ఉండేలా ఏ విధమైన పరికరాలు, క్రేన్‌లు లేదా సపోర్టును ఉపయోగించారో తెలుసుకోవడానికి Digiteye India బృందం వీడియోను నిశితంగా పరిశీలించింది.మేము వీడియో యొక్క దిగువ ఎడమ వైపున వాటర్‌మార్క్‌ని (2 నిమిషాల 12 సెకన్లు వద్ద)చూడగా, ఇది మెజీషియన్ విఘ్నేష్ ప్రభుదని పేర్కోనుంది.ఆ తర్వాత వీడియోలో వాటర్‌మార్క్ చాలాసార్లు కనిపించింది. మేము ఈ ఆధారాన్నీ /క్లూను ఉపయోగించి,Googleలో కీవర్డ్ సెర్చ్ను(keyword search) నిర్వహించాము.

కీవర్డ్ సెర్చ్ను(keyword search)నిర్వహించగా, అది విఘ్నేష్ ప్రభు వెబ్‌సైట్‌కి దారితీసింది.తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన విఘ్నేష్ ప్రభు అంతర్జాతీయ మెజీషియన్, మెంటలిస్ట్ అని వెబ్‌సైట్ వెల్లడించింది.వీడియోలో లెవిటేటింగ్ మ్యాజిక్ గురించి కూడా ప్రస్తావించబడింది.ఇటీవల కోయంబత్తూరులోని ప్రోజోన్ మాల్‌లో తన క్లోజ్‌అప్ మ్యాజిక్ షోను ప్రదర్శించాడు. ఒక వ్యక్తి తన ల్యాప్‌టాప్‌ను గాలిలో తేలియాడేలా చేయమని అడిగాడు. కానీ మెజీషియన్ విఘ్నేష్ ప్రభు నేల మట్టం నుండి 160 అడుగుల ఎత్తులో సన్నని గాలిలో ఎగురుతూ (లేవిటేట్) మాయాజాలంలో భారతదేశ చరిత్రను సృష్టించాడు, ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాడు” అని వెబ్‌సైట్ పేర్కొంది.

విఘ్నేష్ ప్రభు యొక్క యూట్యూబ్‌ని వెతికి లేవిటేటింగ్ వీడియోని పరిశీలించగా, అది ఆగస్టు 8, 2018న అప్‌లోడ్ చేయబడిందని కనుగొన్నాము.”FLYING MAN OF INDIA at 160 FEET | Magician Vignesh prabhu | Exclusive flying magic | Jai hind,”అనే శీర్షికతో ఉంది మరియు ఈ ట్రిక్ కోసం కెమెరా ట్రిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ లేదా రోప్‌లు పయోగించలేదని వీడియో వివరణ స్పష్టం చేసింది.

ఈ ట్రిక్ వెనుక ఉన్న సైన్స్/రహస్యాన్ని అర్థం చేసుకోవడానికి, మేము Googleలో మరింత వెతకగా,అది ఒక తమిళ వీడియోకి దారితీసింది.వీడియోలో విఘ్నేష్ ప్రభు ‘బిహైండ్‌వుడ్స్ ఎయిర్ ఛానెల్‌’కి (Behindwoods Air channel)ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో దాని వెనుక ఉన్న ఉపాయాన్ని/ట్రిక్ని వెల్లడించారు.

లెవిటేటింగ్ ట్రిక్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఇంద్రజాలికులు ఉపయోగించిన పురాతన ట్రిక్స్‌లో ఒకటి.ఈ జనాదరణ పొందిన ట్రిక్ ఎలా నిర్వహించబడుతుందో ఇంద్రజాలికుడు(మెజీషియన్) వివరించే YouTube వీడియోను మేము వీక్షించాము. తరచుగా ఈ విన్యాసాలు పట్ట పగలు సన్నని ఎయిర్ క్రాఫ్ట్ కేబుల్స్ సహాయంతో జరుగుతాయని ఇంద్రజాలికుడు వెల్లడించాడు.ఈ సన్నని కేబుల్స్/తాళ్లు పగటి పూట వెలుగులో కనిపించవు ఎందుకంటే అవి సూర్యరశ్మిని ప్రతిబింబిస్తాయి.ఇంద్రజాలికులు(మెజీషియన్) ఈ కేబుల్‌ల జాడలను తొలగించడానికి VFX మరియు ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్‌లను ఉపయోగిస్తారు. ఈ ఉపాయలన్ని దృష్టికి సంబంధించిన భ్రమలు మరియు సైన్సుపై ఆధారపడతాయి.

కాబట్టి ఈ Claim/వాదన తప్పు.

Claim/వాదన: తమిళనాడులో ఒక యువకుడు యోగా వల్ల వచ్చిన శక్తి కారణంగా గాలిలో తేలాడు.

CONCLUSION/నిర్ధారణ: ఆ వీడియోలోని కుర్రాడు ఇంద్రజాలికుడు(మెజీషియన్)విఘ్నేష్ ప్రభు. యోగా వల్ల ఆయన గాలిలో తేలలేదు.ఈ లెవిటేషన్ ట్రిక్ ఒక క్లాసిక్ మ్యాజిక్ ట్రిక్ మరియు సన్నని కేబుల్స్/తాళ్లు పగటి పూట వెలుగులో సూర్యరశ్మిని ప్రతిబింబిస్తూ,కంటికి కనబడని కారణంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇంద్రజాలికులు వీటిని ఉపయోగిస్తూ ఈ ట్రిక్ ప్రదర్శిస్తారు.

RATING: ?? – Misinterpretation

[మరి కొన్ని Fact Checks: MMR టీకాలు ఆటిజంకు కారణమవుతాయని వైరల్ సోషల్ మీడియా పోస్ట్‌లు పేర్కొంటున్నాయి; Fact Check ;

మొబైల్‌లు, టీవీలు, ఫ్రిజ్‌లపై GST 31.3% నుంచి 18%కి తగ్గిందని క్లెయిమ్/వాదన వైరల్ అవుతోంది; Fact Check

ఈ వైరల్ వీడియో ప్లాస్టిక్ నుండి గోధుమ ఉత్పత్తిని చూపుతుందా? Fact Check]

One comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*