Tag Archives: paris Olympics

ప్యారిస్ ఒలింపిక్స్‌లో అనర్హత వేటు వేయడానికి ముందు వినేష్ ఫోగట్ 2.1 కిలోల బరువు ఎక్కువగా ఉందా? వాస్తవ పరిశీలన

వాదన/Claim: భారత మహిళా రెజ్లర్ వినేష్ ఫోగట్ అనుమతించదగిన పరిమితి కంటే 2.1 కిలోల బరువు ఎక్కువగా ఉండటంతో ఒలింపిక్స్ ఫైనల్‌లో అనర్హతకు గురైందనేది వాదన.

నిర్ధారణ /Conclusion:తప్పు దారి పట్టించే వాదన. వినేష్ ఫోగట్ తన బరువు కేటగిరీలో 50 కిలోల పరిమితి కంటే కేవలం 100 గ్రాముల బరువు మాత్రమే ఎక్కువగా ఉండటం వలన అనర్హురాలయ్యారు.

రేటింగ్/Rating: :తప్పు దారి పట్టించే వాదన —

వాస్తవ పరిశీలన పూర్తి వివరాలను వీడియోలో చూడటానికి కింది చిత్రంపై క్లిక్ చేయండి.

లేదా దిగువ కథనాన్ని చదవండి.

************************************************************************

భారతీయ మహిళా రెజ్లర్ వినేష్ ఫోగాట్ 2024 పారిస్ ఒలింపిక్స్ లో విజయవంతమైన బౌట్‌లు సాధించడంతో ఆగస్టు 6,2024న ముఖ్యాంశాలుగా మారి అందరి దృష్టి అమెపై పడింది. అయితే మరుసటి రోజు ఉదయం ఆమె అధిక బరువు కారణంగా ఫైనల్‌లో పాల్గొనేందుకు అనర్హురాలంటూ  దిగ్భ్రాంతికరమైన న్యూస్ వెలువడింది.

ఎక్కువ వివరాలను చెప్పకుండా వినేష్ ఫోగట్ తన 50 కిలోల బరువు కేటగిరీలో “కేటగిరీ” కంటే కొంచెం ఎక్కువని IOA అధికారికంగా పేర్కొంది.

“ఆమె 2.1 కిలోల అధిక బరువుతో ఉంది. 2 కిలోలు అనుమతించదగిన పరిమితి. వినేష్ 2 కిలోలు + 100 గ్రాముల బరువుతో ఉన్నారు” అని సోషల్ మీడియాలో వాదన/దావా పోస్ట్ చేయబడింది.

వినేష్ ఫోగట్ 50 కిలోల పరిమితి కంటే 2.1 కిలోల బరువు ఎక్కువగా ఉన్నారని, అందువల్ల అనర్హురాలంటూ పేర్కొంటూ సోషల్ మీడియా మొదట పోస్ట్‌లు వైరల్ అయ్యాయి.

FACT-CHECK

ఇండియన్ ఒలింపిక్స్ అసోసియేషన్ (IOA) అధికారిక ప్రకటన ప్రకారం, రెజ్లర్ “50 కిలోల కంటే కొన్ని గ్రాముల బరువు కలిగి ఉన్నారు”, ఇది ఆమె అనర్హతకు దారితీసింది.
Xలో IOA ఇలా పేర్కొంది: “ఉమెన్స్ రెజ్లింగ్ 50 కిలోల విభాగం నుండి వినేష్ ఫోగాట్ యొక్క అనర్హత వార్తను భారత బృందం తెలియపరచడం విచారకరం. రాత్రంతా బృందం ఎంత శ్రమించినప్పటికీ, ఆమె ఈ ఉదయం 50 కిలోల కంటే కొన్ని గ్రాముల అధిక బరువుతో ఉంది”.

భారత రెజ్లర్ వినేష్ ఫోగట్ బరువు సమస్య ఆమె అనర్హతకు దారితీసిందని ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (IOA) చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ దిన్షా పార్దివాలా ఒక ప్రకటనలో వివరించారు.
ఈ ప్రకటనలో, పార్దివాలా మాట్లాడుతూ, “”అయితే, వినేష్ తన 50 కిలోల బరువు కంటే 100 గ్రాములు అధిక బరువు ఉన్నట్లు కనుగొనబడటంతో ఆమెపై అనర్హత వేటు పడింది.ఆమె జుట్టు కత్తిరించడం సహా అన్ని కఠినమైన చర్యలు ప్రయత్నించినప్పటి ఆమె అనుమతించబడిన 50 కిలోల బరువుకు రాలేక పోయింది.

మరియు, కేంద్ర క్రీడా శాఖ మంత్రి కూడా పార్లమెంటులో తన ప్రకటనలో ఈ క్రింది విధంగా చెప్పారు:


అందువల్ల, వినేష్ ఫోగట్ 50-కిలోల పరిమితి కంటే 2.1 కిలోల బరువు ఎక్కువగా ఉన్నారనే వాదన నిరాధారమైనది మరియు తప్పు.

మరి కొన్ని వాస్తవ పరిశీలన కధనాలు:

మీ లిప్ స్టిక్ కోచినియల్ బగ్స్ నుండి తీసిన రంగుతో తయారు చేయబడిందా? వాస్తవ పరిశీలన

IRCTCలో స్నేహితులకు లేదా బంధువుల కోసం రైలు టికెట్లును బుక్ చేస్తే జరిమానా విధించబడుతుందా? వాస్తవ పరిశీలన

 

ఇజ్రాయెలీ ఈతగాళ్ల రూపొందించిన ‘బ్రింగ్ దెమ్ హోమ్ నౌ’అనే పాత విన్యాసాన్ని పారిస్ ఒలింపిక్స్ విన్యాసంగా షేర్ చేయబడిందా? వాస్తవ పరిశీలన

వాదన/దావా: మహిళా స్విమ్మర్‌లు “బ్రింగ్ దమ్ హోమ్ నౌ”అనే ఆకారాన్ని ఏర్పరుచుకున్న చిత్రం, ప్రస్తుతం జరుగుతున్న పారిస్ 2024 ఒలింపిక్స్‌లో ఇజ్రాయెల్ బృందం ఈ విధంగా ఒక ప్రత్యేకమైన రీతిలో నిరసన తెలియజేస్తోందనే వాదనతో షేర్ చేయబడుతోంది.

నిర్ధారణ/Conclusion: తప్పుగా చూపించే ప్రయత్నం. నవంబర్ 19, 2023నాటి పాత చిత్రం పారిస్ ఒలింపిక్స్‌లోని ఇటీవలి ఫోటోగా షేర్ చేయబడింది.

రేటింగ్/Rating: తప్పుగా చూపించే ప్రయత్నం —

వాస్తవ పరిశీలన పూర్తి వివరాలను వీడియోలో చూడటానికి కింది చిత్రంపై క్లిక్ చేయండి.

లేదా దిగువ కథనాన్ని చదవండి.

************************************************************************

మహిళా స్విమ్మర్‌లు “బ్రింగ్ దమ్ హోమ్ నౌ”అనే ఆకారాన్ని ఏర్పరుచుకున్న చిత్రం, ప్రస్తుతం జరుగుతున్న పారిస్ 2024 ఒలింపిక్స్‌లో ఇజ్రాయెల్ బృందం ఈ విధమైన ఒక ప్రత్యేకమైన రీతిలో నిరసన తెలియజేస్తోందనే వాదనతో షేర్ చేయబడుతోంది.

దావా/వాదన ఇలా ఉంది: “పారిస్ ఒలింపిక్స్ సమయంలో బందీల కోసం ఇజ్రాయెల్ ఒలింపిక్ జట్టు పసుపు రిబ్బన్ పిన్‌లను ధరించడానికి అనుమతించబడలేదు. కాబట్టి బదులుగా, వారు ఇలా చేసారు.(sic)” “బ్రింగ్ దమ్ హోమ్ నౌ” ఆకారం చిత్రంలో కనిపిస్తుంది.

సందర్భం ఏమిటంటే, హమాస్ ఇప్పటికీ 200 మందికి పైగా ఇజ్రాయెలీ బందీలను తమ ఆధీనంలో పెట్టుకున్నారు మరియు అనేక దేశాలు ఇజ్రాయెలీలు మరియు పాలస్తీనియన్ల మధ్య శాంతిని నెలకొల్పడానికి ప్రయత్నిస్తున్నాయి. పారిస్ ఒలింపిక్స్ 2024 సందర్భంగా, ఈ చిత్రం సోషల్ మీడియాలో షేర్ చేయబడుతోంది.

FACT CHECK

ముందుగా, Digiteye India బృందం Google రివర్స్ ఇమేజ్ సెర్చ్‌లో చిత్రాన్ని తనిఖీ చేయగా పాత చిత్రం ఇటీవలి చిత్రంగా షేర్ చేయబడిందని గమనించారు. మరిన్ని వివరాలు సేకరించే ప్రయత్నంలో, ఈ ఛాయాచిత్రం నవంబర్ 2023 నాటిదని, ఇజ్రాయెల్ యొక్క వింగేట్ ఇన్స్టిట్యూట్‌లోని మహిళా స్విమ్మర్‌లు ఇజ్రాయెల్ బందీలను తిరిగి తీసుకురావాలని వారి డిమాండ్‌ను పునరుద్ఘాటించడానికి ఏర్పాటు చేసిన చిత్రమని తేలింది.

వారు ‘బ్రింగ్ దమ్ హోమ్ నౌ’ అనే నినాదాన్ని లేవనెత్తారు, ఇది పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ అయిన హమాస్ బందిఖానాలో ఇంకా 200 మందికి పైగా ఉన్న బందీలను విడుదల చేయాలని డిమాండ్ చేయడానికి ప్రపంచవ్యాప్తంగా అనేక ఇజ్రాయెల్ సమూహాలకు క్యాచ్ ఫ్రసె(catch phrase)గా మారింది.

ఇజ్రాయెల్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నవంబర్ 19, 2023న వారి అధికారిక ఫేస్‌బుక్ పేజీలో అసలు ఫోటోను పోస్ట్ చేసింది: “ఇది గాజాలో హమాస్ టెర్రరిస్టుల చేతిలో ఉన్న 240 మంది బందీలకు నివాళులర్పిస్తూ ఇజ్రాయెల్ జాతీయ మహిళా స్విమ్మర్‌ల (కళాత్మక స్విమ్మింగ్/artistic swimming)టీమ్ అందించిన అందమైన నివాళి. ప్రతి ఒక్కరినీ ఇంటికి తీసుకువచ్చే వరకు మేము ఆగము. యోవ్ బోరోవిట్జ్/Yoav Borowitz.

ఈ చిత్రాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఇక్కడ షేర్ చేయబడింది. గత ఏడాది నవంబర్‌లో నేషనల్ పూల్‌లో అథ్లెట్లు “బ్రింగ్ దెమ్ హోమ్ నౌ”అనే సందేశంతో రూపొందించిన ఫోటోను ఇజ్రాయెల్‌లోని వింగేట్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన ఆడమ్ స్పీగెల్‌ పోస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది.

కావున, ఒక పాత చిత్రం పారిస్ ఒలింపిక్స్‌లోని ఇటీవలి ఫోటోగా తప్పుగా షేర్ చేయబడింది.

మరి కొన్ని వాస్తవ పరిశీలన కధనాలు:

కమలా హారిస్‌ అమెరికా యొక్క సహజసిద్దమైన పౌరురాలు కాదా? US ప్రెసిడెంట్ అభ్యర్థి యొక్క అర్హతపై వాదన మళ్లీ తెరపైకి వచ్చింది; వాస్తవ పరిశీలన

అనేక దేశాలు భారతదేశం నుండి పండ్లు మరియు కూరగాయల దిగుమతులను నిషేధించాయా? వాస్తవ పరిశీలన