Tag Archives: earpiece

సెప్టెంబరు 10న ట్రంప్‌తో ప్రెసిడెన్షియల్ డిబేట్ సమయంలో కమలా హారిస్ తన చెవిపోగుల్లో ‘ఇయర్‌పీస్’ పెట్టుకున్నారా? వాస్తవ పరిశీలన

వాదన/Claim: సెప్టెంబరు 10 ప్రెసిడెన్షియల్ డిబేట్ సందర్భంగా డెమోక్రటిక్-నామినీ కమలా హారిస్ NOVA H1 వైర్‌లెస్ ఇయర్‌పీస్ ధరించారనేది వాదన.

నిర్ధారణ/Conclusion: తప్పు దారి పట్టించే వాదన. సెప్టెంబరు 10న చర్చకు హారిస్ ధరించిన చెవిపోగులు ఆమె పాత ఆభరణాలలోనివి మరియు వాదన చేయబడినట్లు NOVA H1 ఇయర్‌పీస్‌లు కాదు.అలాగే, ఆ ​​చెవిపోగులు తమ హెచ్1 ఆడియో ఇయర్ రింగ్స్ కాదని “ఐస్‌బాచ్ సౌండ్ సొల్యూషన్స్” కూడా స్పష్టం చేసింది.

రేటింగ్/Rating:తప్పు దారి పట్టించే వాదన. —

డెమొక్రాట్ అభ్యర్థి కమలా హారిస్ మరియు రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మధ్య సెప్టెంబర్ 10, 2024న జరిగిన US ప్రెసిడెన్షియల్ డిబేట్/చర్చ ప్రపంచవ్యాప్తంగా ముఖ్యాంశంగా మారింది.అయితే, సోషల్ మీడియాలో షేర్ అవుతున్న ఒక వాదన ఆసక్తికరంగా మారింది. కమలా హారిస్ చెవిపోగులో వైర్‌లెస్ ఇయర్‌ఫోన్‌ను పొందుపరిచినట్లు ఒక కథనం.

చర్చ నిబంధన ప్రకారం, ABC న్యూస్ నిర్వహించే చర్చలో అభ్యర్థులు విరామ సమయంలో ఆధారాలు,చర్చకు సంబంధించి ముందుగా వ్రాసిన పెట్టుకున్న పంక్తులు లేదా వారి ప్రచార సిబ్బందితో పరస్పర చర్యకు అనుమతించబడరు.

సోషల్ మీడియా లో పోస్ట్ ఈ విధంగా ఉంది:

ఆమె ఒక విధమైన ఇయర్‌పీస్‌ని వింటున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది.

అందుకే నిన్న రాత్రి జరిగిన #PresidentialDebateని చాలా మంది ప్రశ్నిస్తున్నారు.

మీరు ఏమనుకుంటున్నారు??

 

It has been widely shared and can be accessed here and here.

 

FACT CHECK

Digiteye India బృందం వాట్సాప్‌లో వాస్తవ పరిశీలన అభ్యర్థనను స్వీకరించినప్పుడు,మేము కమలా హారిస్ చెవిపోగుల కోసం X లో పరిశీలించగా,అవి చెవిపోగులు పాతవని, ఆమె గతంలో చాలాసార్లు ధరించారని తేలింది. వాదన ప్రకారం ఇయర్‌పీస్ నోవా హెచ్1 అని, మ్యూనిచ్ ఆధారిత “ఐస్‌బాచ్” సౌండ్ సొల్యూషన్స్ విక్రయిస్తున్నందున, మేము ఇయర్ రింగ్‌ల వివరాల కోసం మరింత అన్వేషించగా, వైర్‌లెస్ ఇయర్‌ఫోన్‌లు ఒక జత ముత్యాల చెవిపోగులలో పొందుపరిచినట్లు కనుగొన్నాము..

అయితే, ఐస్‌బాచ్ సౌండ్ సొల్యూషన్స్ సంస్థ, సెప్టెంబర్ 13న ఒక పత్రికా ప్రకటనలో, చర్చలోని ఫోటోల విశ్లేషణ ఆధారంగా, “ఇవి మా H1 ఆడియో ఇయర్ రింగ్‌లు కాదని మేము నిర్ధారణకు వచ్చాము” అని తెలిపింది.

Xలోని ఒక వినియోగదారు హారిస్‌ ధరించిన చెవిపోగుల వంటి మరొక “టిఫనీ” చెవిపోగుల ఫోటోను షేర్ చేసారు, ఇది $3,300 కంటే ఎక్కువ ధర చేయబడుతుంది కానీ టిఫనీ వెబ్‌సైట్‌లో ఇప్పుడు అందుబాటులో లేదు.

చర్చకు ముందు కూడా హారిస్ ఇవే చెవి రింగులు ధరించినట్లు మేము కనుగొన్నాము. వైట్ హౌస్‌లో ఏప్రిల్లో జరిగిన ఈవెంట్, ఫిలడెల్ఫియాలో మేలో జరిగిన క్యాంపెయిన్ ఈవెంట్, మరియు జూన్ 2024లో జరిగిన కన్సర్ట్/కచేరీలోని రాయిటర్స్ ఫోటోలు చూడవచ్చు. చర్చ జరిగిన తర్వాత కూడా, ఆమె 9/11 దాడుల 23వ వార్షికోత్సవ వేడుకకు హాజరైనప్పుడు వాటిని ధరించడం కనిపించింది.

అంతేకాదు, ప్రెసిడెన్షియల్ డిబేట్/చర్చ సమయంలో అభ్యర్థులు ఇయర్‌పీస్‌ను ఉపయోగిస్తున్నారన్న ఆరోపణలు
రావడం కొత్తేమీ కాదు.2020లో అప్పటి డెమోక్రటిక్ అభ్యర్థి బిడెన్‌పై ఇలాంటి ఆరోపణలు వచ్చాయి. 2016లో డెమోక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌పై కూడా ఇలాంటి ఆరోపణలు వచ్చాయి.

కాబట్టి, ఈ వాదన/దావా తప్పు.

మరి కొన్ని వాస్తవ పరిశీలన కధనాలు:

VPనామినీ J.D. వాన్స్ పేరు ప్రకటించినప్పుడు US రిపబ్లికన్ కన్వెన్షన్‌లో ‘ఇండి77యా-ఇండియా’ అన్న నినాదాలు వినిపించాయా? వాస్తవ పరిశీలన

ఈ వీడియోలో కమలా హారిస్ ‘Xని షట్ డౌన్ చేయాలి’ అన్నారా? వాస్తవ పరిశీలన

కమలా హారిస్‌ అమెరికా యొక్క సహజసిద్దమైన పౌరురాలు కాదా? US ప్రెసిడెంట్ అభ్యర్థి యొక్క అర్హతపై వాదన మళ్లీ తెరపైకి వచ్చింది; వాస్తవ పరిశీలన