వాదన/Claim:కార్టూన్ నెట్‌వర్క్ ఛానెల్ మూసివేయబడిందని/నిలిపివేయబడిందనేది వాదన.
నిర్ధారణ/Conclusion:తప్పుడు వాదన. కార్టూన్ నెట్‌వర్క్ ఛానల్ వార్తా సంస్థలకు ఇచ్చిన వివరణలో ఈ వాదనని/దావాని ఖండించింది.
రేటింగ్: తప్పు దోవ పట్టించే ప్రయత్నం —
వాస్తవ పరిశీలన పూర్తి వివరాలను వీడియోలో చూడటానికి కింది చిత్రంపై
లేదా దిగువ కథనాన్ని చదవండి.
************************************************************************
పొపాయ్, బాట్‌మ్యాన్, మిక్కీ మౌస్, టామ్ & జెర్రీ వంటి ప్రముఖ కార్టూన్ కార్యక్రమాలను చూపిస్తున్న పోస్టర్ “కార్టూన్ నెట్‌వర్క్ అధికారికంగా మూసివేయబడిందన్న” దావాతో షేర్ చేయబడుతోంది. కార్టూన్ నెట్‌వర్క్‌లో చిరస్మరణీయమైన చిన్ననాటి జ్ఞాపకాల యుగానికి ఇది ముగింపు.”
Digiteye India బృందం పరిశీలించగా, వాదన/క్లెయిమ్ రెండేళ్ల క్రితం నాటిదని మరియు అడపాదడపా సర్క్యులేట్ అవుతుందని గమనించాము. దాని ప్రస్తుత వాదనలు/దావా ఇక్కడ చూడవచ్చు.
Cartoon Network is dead?!?!
Spread the word about what’s at stake for animation!!! Post about your favorite Cartoon Network shows using #RIPCartoonNetwork
Active members of TAG can help by filling out your survey! Today (7/8) is the last day! pic.twitter.com/dHNMvA1q0A
— Animation Workers Ignited (@AWorkersIgnited) July 8, 2024
BREAKING!!
THE END OF GREAT CHILDHOOD ERA
CARTOON NETWORK OFFICIALLY SHUTDOWN, MY CHILDHOOD MEMORIES WILL ALWAYS BE A MEMORIES AND I WILL TREASURE THEM FOREVER💔😭 pic.twitter.com/JpXPfFzZ1O
— RAI Sahab ( Bhartiy )🇮🇳 (@Sarvesh280989) July 9, 2024
CARTOON NETWORK SHUTDOWN TODAY??? pic.twitter.com/tdCp5NwCYa
— bam (@bamnotnice) July 9, 2024
Cartoon Network is being shutdown? This genuinely makes me tear up, they produced some of my best memories EVER.
I’m actually sad, these are some of my favorites I watched and enjoyed whilst growing up with CN (feel free to share any funny clips or something about the shows) pic.twitter.com/iswDKSsqUG
— Incognito☄️ (@samirsscrolls) July 9, 2024
Cartoon Network losing their personality is still one of the worst things they’ve ever done that they have yet to recover from #RIPCartoonNetwork pic.twitter.com/biP5BxNaek
— JustAnotherArtist (@JustAnthrArtist) July 9, 2024
FACT-CHECK
గూగుల్‌లో ‘కార్టూన్ నెట్‌వర్క్ షట్‌డౌన్’కి సంబంధించిన ఏవైనా వార్తల కోసం పరిశీలించగా అనేక వివాదాస్పద వాదనలు ఉన్నాయని వెల్లడైంది, కొందరు ఇది కార్టూన్ నెట్‌వర్క్ ముగింపు అని, మరికొందరు ఈ చర్య మొత్తం యానిమేషన్ పరిశ్రమను ప్రభావితం చేయబోతోందనే నిజాన్ని తెలియజేస్తుందన్నారు.
స్టూడియోపై వార్తా కథనం ప్రకారం స్టూడియోని గత సంవత్సరం ఆగస్టు 1, 2023 దాని ప్రధాన కార్యాలయం నుండి వార్నర్ బ్రదర్స్ స్టూడియోస్‌కి మార్చినట్లు తెలిసింది.అయితే, కార్టూన్ నెట్‌వర్క్ వాళ్ళ షట్‌డౌన్ గురించి అధికారికంగా ఎటువంటి పత్రికా ప్రకటన లేదు.
మనీ కంట్రోల్ మరియు హిందుస్థాన్ టైమ్స్ వారు, కార్టూన్ నెట్‌వర్క్ ఛానెల్ క్రింద ఇచ్చిన వివరణను తమ వార్తా నివేదికల ద్వారా స్పష్టం చేసారు: “నెట్‌వర్క్ లేదా స్టూడియో మూసివేయబడుతుందనే ఊహాగానాలలో నిజం లేదని కార్టూన్ నెట్‌వర్క్ స్పష్టం చేయాలనుకుంటున్నది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మా వీక్షకులను నిరంతరం అలరించే మరియు ఉత్తేజపరిచే వినూత్న కంటెంట్‌లో పెట్టుబడి పెట్టడానికి మేము కట్టుబడి ఉన్నాము”.
యానిమేషన్ వర్కర్స్ ఇగ్నైటెడ్, యానిమేట్ యూనియన్‌ను సమర్ధించే ఖాతా ద్వారా X లో #RIPCartoonNetwork అనే హ్యాష్‌ట్యాగ్ నుండి అటువంటి పుకారు పుట్టిందని నివేదికలు పేర్కొన్నాయి. కావున ఇది తప్పుడు వాదన.
మరి కొన్ని వాస్తవ పరిశీలన కధనాలు: