Tag Archives: BBC news

బంగ్లాదేశ్‌లో హిందువులపై జరిగిన దాడులను BBC కవర్ చేయలేదా? వాస్తవ పరిశీలన

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా దేశం విడిచి పారిపోయిన తర్వాత హింసాత్మక అల్లర్ల చెలరేగి, అనేక ఫిర్యాదులు మరియు ఎదురు ఫిర్యాదులు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. అందులో ఒకటి బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న హింసను కవర్ చేయడంలో బీబీసీ(BBC) విఫలమైందనే వాదనతో ఒక వీడియో షేర్ చేయబడుతోంది.

వీడియోతో కూడిన దావా ఇలా ఉంది: “బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న హింసను కవర్ చేస్తున్నారో లేదో తెలుసుకోవడానికి నేను BBC న్యూస్ వెబ్‌సైట్‌కి వెళ్లాను. లేదు. దురదృష్టమైన వాస్తవం ఏమిటంటే దురాక్రమణదారులు ఇస్లామిక్ తీవ్రవాదులు. @elonmusk & @X కు ధన్యవాదాలు, వారి దుస్థితిని ప్రచారం చేయవచ్చు.”

సత్య పరిశీలన వివరాలు

BBC దక్షిణాసియాలో విస్తృత కవరేజీ రికార్డు కలిగిన గ్లోబల్ మీడియా అవుట్‌లెట్. కాబట్టి,బంగ్లాదేశ్ హింస యొక్క వార్తని BBC ప్రసారం చేసిందా, లేదాని Digiteye India బృందం పరిశీలించగా, Google మరియు Youtubeలో క్రింది ఫలితాలను సూచించింది. సోషల్ మీడియాలో క్లెయిమ్ షేర్ చేయబడిన రోజు కంటే ఒక రోజు ముందు అంటే 7 ఆగస్టు 2024న ప్రచురించబడిన BBC కథనం ఇక్కడ ఉంది.

ఇది బంగ్లాదేశ్‌లో హిందువులపై జరిగిన దాడులపై కరస్పాండెంట్ ఇచ్చిన కధనమని స్పష్టంగా తెలుస్తుంది. మరొక కథనం, హిందువులపై దాడులకు సంబంధించిన BBC వాస్తవిక పరిశీలన ఇక్కడ అందూబాటులో ఉంది.

అదనంగా, ఇక్కడ చూసినట్లుగా BBC వీడియోలు కూడా దాడులకు సంబంధించిన వార్తలను ప్రసారం చేశాయి.

కాబట్టి, బంగ్లాదేశ్‌లో హిందువులపై జరిగిన దాడులను బిబిసి కవర్ చేయలేదన్న వాదన తప్పుదారి పట్టించే విధంగా ఉంది.

వాదన/Claim:బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న హింసను కవర్ చేయడంలో బిబిసి విఫలమైందనేది వాదన.

నిర్ధారణ/Conclusion: తప్పుదారి పట్టించే వాదన/దావా. BBC బంగ్లాదేశ్‌లో హిందువులపై జరిగిన దాడులను వార్తా కథనం మరియు వీడియో రూపంలో కవర్ చేసింది.

రేటింగ్/Rating: తప్పుదారి పట్టించే వాదన/దావా —

మరి కొన్ని సత్య పరిశీలన కధనాలు:

కమలా హారిస్‌ అమెరికా యొక్క సహజసిద్దమైన పౌరురాలు కాదా? US ప్రెసిడెంట్ అభ్యర్థి యొక్క అర్హతపై వాదన మళ్లీ తెరపైకి వచ్చింది; వాస్తవ పరిశీలన

రేపటి నుంచి ఉచిత విద్యుత్ సబ్సిడీ ఆగిపోతుందని ఢిల్లీ మంత్రి అతిషి వెల్లడించారా? వాస్తవ పరిశీలన