Tag Archives: bangladesh

బంగ్లాదేశ్‌లో హిందువులపై జరిగిన దాడులను BBC కవర్ చేయలేదా? వాస్తవ పరిశీలన

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా దేశం విడిచి పారిపోయిన తర్వాత హింసాత్మక అల్లర్ల చెలరేగి, అనేక ఫిర్యాదులు మరియు ఎదురు ఫిర్యాదులు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. అందులో ఒకటి బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న హింసను కవర్ చేయడంలో బీబీసీ(BBC) విఫలమైందనే వాదనతో ఒక వీడియో షేర్ చేయబడుతోంది.

వీడియోతో కూడిన దావా ఇలా ఉంది: “బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న హింసను కవర్ చేస్తున్నారో లేదో తెలుసుకోవడానికి నేను BBC న్యూస్ వెబ్‌సైట్‌కి వెళ్లాను. లేదు. దురదృష్టమైన వాస్తవం ఏమిటంటే దురాక్రమణదారులు ఇస్లామిక్ తీవ్రవాదులు. @elonmusk & @X కు ధన్యవాదాలు, వారి దుస్థితిని ప్రచారం చేయవచ్చు.”

సత్య పరిశీలన వివరాలు

BBC దక్షిణాసియాలో విస్తృత కవరేజీ రికార్డు కలిగిన గ్లోబల్ మీడియా అవుట్‌లెట్. కాబట్టి,బంగ్లాదేశ్ హింస యొక్క వార్తని BBC ప్రసారం చేసిందా, లేదాని Digiteye India బృందం పరిశీలించగా, Google మరియు Youtubeలో క్రింది ఫలితాలను సూచించింది. సోషల్ మీడియాలో క్లెయిమ్ షేర్ చేయబడిన రోజు కంటే ఒక రోజు ముందు అంటే 7 ఆగస్టు 2024న ప్రచురించబడిన BBC కథనం ఇక్కడ ఉంది.

ఇది బంగ్లాదేశ్‌లో హిందువులపై జరిగిన దాడులపై కరస్పాండెంట్ ఇచ్చిన కధనమని స్పష్టంగా తెలుస్తుంది. మరొక కథనం, హిందువులపై దాడులకు సంబంధించిన BBC వాస్తవిక పరిశీలన ఇక్కడ అందూబాటులో ఉంది.

అదనంగా, ఇక్కడ చూసినట్లుగా BBC వీడియోలు కూడా దాడులకు సంబంధించిన వార్తలను ప్రసారం చేశాయి.

కాబట్టి, బంగ్లాదేశ్‌లో హిందువులపై జరిగిన దాడులను బిబిసి కవర్ చేయలేదన్న వాదన తప్పుదారి పట్టించే విధంగా ఉంది.

వాదన/Claim:బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న హింసను కవర్ చేయడంలో బిబిసి విఫలమైందనేది వాదన.

నిర్ధారణ/Conclusion: తప్పుదారి పట్టించే వాదన/దావా. BBC బంగ్లాదేశ్‌లో హిందువులపై జరిగిన దాడులను వార్తా కథనం మరియు వీడియో రూపంలో కవర్ చేసింది.

రేటింగ్/Rating: తప్పుదారి పట్టించే వాదన/దావా —

మరి కొన్ని సత్య పరిశీలన కధనాలు:

కమలా హారిస్‌ అమెరికా యొక్క సహజసిద్దమైన పౌరురాలు కాదా? US ప్రెసిడెంట్ అభ్యర్థి యొక్క అర్హతపై వాదన మళ్లీ తెరపైకి వచ్చింది; వాస్తవ పరిశీలన

రేపటి నుంచి ఉచిత విద్యుత్ సబ్సిడీ ఆగిపోతుందని ఢిల్లీ మంత్రి అతిషి వెల్లడించారా? వాస్తవ పరిశీలన

 

 

2025 నాటికి భారతదేశం బంగ్లాదేశ్ కంటే పేదదేశంగా మారబోతుందా? పాత దావా మళ్లీ వైరల్ అవుతోంది; వాస్తవ పరిశీలన

దావా/వాదన/Claim: IMF తన ఏప్రిల్ 2024 వరల్డ్ ఎకనామిక్ ఔట్‌లుక్ నివేదికలో “2025 నాటికి బంగ్లాదేశ్ కంటే భారతదేశం పేదరికంలో ఉంటుంది” అని పేర్కొన్నదనేది వాదన.

నిర్ధారణ/Conclusion: దావా తప్పు. ఇది 2020 కోవిడ్ మహమ్మారి కాల అంచనాల ఆధారంగా రూపొందించబడింది, అయితే ప్రస్తుత IMF అంచనా ప్రకారం 2025 నాటికి మొత్తం GDP వృద్ధి పరంగా భారతదేశం బంగ్లాదేశ్ కంటే చాలా ముందుంటుంది.

రేటింగ్: తప్పుగా చూపించే ప్రయత్నం —

Fact Check వివరాలు:

2025 నాటికి భారతదేశం బంగ్లాదేశ్ కంటే పేదదేశంగా మారబోతుందని ఇటీవలి అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) వరల్డ్ ఎకనామిక్ ఔట్‌లుక్ నివేదిక హెచ్చరించిందని సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ప్రచారం చేయబడింది.శీర్షిక ఇలా ఉంది:

“India becoming poorer and poorer – ANOTHER SHOCKING REPORT BY IMF !!!*INDIA WILL POORER THAN BANGLADESH BY 2025*”

మరొక X వినియోగదారు ఈ విధంగా షేర్ చేసారు: “ఇంతవరకు ఇది సంభవించలేదు. మోదీ భారతదేశ భవిష్యత్తును పణంగా పెట్టారు. భారతదేశం ఇప్పుడు “అభివృద్ధి చెందుతున్న దేశం” కాదు.ఇది ఇక్కడ మరియు ఇక్కడ షేర్ చేయబడింది.

FACT CHECK

Digiteye India బృందం దావా/క్లెయిమ్ యొక్క ప్రామాణికతను పరిశీలించినప్పుడు, 2020లో మరియు 2021లో భారతదేశంతో సహా మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను కోవిడ్ మహమ్మారి సంభవించినప్పుడు మేము ఇదే విధమైన దావా/క్లెయిమ్‌లను గమనించాము. దీని ప్రకారం, IMF 2020 నివేదిక, భారతదేశం వాస్తవ తలసరి GDP వృద్ధి పరంగా $1,876.53 వద్ద బంగ్లాదేశ్ అంచనా $1,887.97 ( డాలర్ పరంగా)కంటే ఎలా కొంచెం తక్కువగా ఉందొ వివరించింది.

వరల్డ్ ఎకనామిక్ ఔట్‌లుక్ పేరుతో ఏప్రిల్ 2024లో ప్రచురించబడిన తాజా IMF నివేదిక, 2024లో భారతదేశ GDP 6.8% మరియు 2025లో 6.5% వృద్ధి అంచనాలను అందించింది. అదేవిధంగా, నివేదిక బంగ్లాదేశ్ జిడిపి వృద్ధికి 2024లో 5.7% మరియు 2025లో 6.6% అంచనాలను అందించింది.

అయితే, వృద్ధి రేటు దేశం యొక్క మొత్తం GDP వృద్ధిని ప్రతిబింబించదు. అంతేకాకుండా, 2024 IMF నివేదిక ప్రకారం, ప్రొజెక్షన్ తలసరి GDP గురించి ఇచ్చింది, కానీ ఇది దేశం యొక్క మొత్తం సంపదను ఎప్పుడూ ప్రతిబింబించదు. మొత్తం GDP మరియు తలసరి GDP మధ్య చాలా తేడా ఉంటుంది, ఎందుకంటే రెండోది జనాభాను పరిగణనలోకి తీసుకుంటుంది, మరియు మొత్తం GDPని జనాభాతో భాగించడం ద్వారా లెక్కించబడుతుంది. మొత్తం GDP పరంగా, అదే IMF నివేదిక 2025లో భారతదేశ GDP $4.3 ట్రిలియన్‌లకు చేరుకుంటుందని అంచనా వేసింది, అయితే బంగ్లాదేశ్ కేవలం $491.81 బిలియన్ లేదా అంతకంటే తక్కువ హాఫ్-బిలియన్‌కు చేరుకుంటుందని అంచనా.

కోవిడ్ మహమ్మారి కాలం యొక్క నివేదికను పక్కన పెడితే, 2024 IMF అంచనా ప్రకారం బంగ్లాదేశ్ యొక్క తలసరి GDP$2,650తో పోలిస్తే భారతదేశ తలసరి GDP $2,730కి చేరుతుందని సూచిస్తుంది. అందువల్ల, భారతదేశ తలసరి GDP బంగ్లాదేశ్ కంటే ఎక్కువగానే కొనసాగుతుంది మరియు తాజా అంచనాల ప్రకారం ఈ ట్రెండ్ కనీసం 2028 వరకు కొనసాగే అవకాశం ఉంది. పవర్ పర్చేజింగ్ ప్యారిటీ (PPP) పరంగా కూడా, బంగ్లాదేశ్ యొక్క $10,170తో పోలిస్తే, PPP తలసరి భారతదేశ GDP 2025 నాటికి $10,870కి చేరుతుందని అంచనా వేయబడింది.

అందుకే, బంగ్లాదేశ్‌ కంటే భారతదేశం పేదరికంలో ఉంటుందన్న వాదన తప్పుదారి పట్టించే విధంగా ఉంది.

మరి కొన్ని Fact Checks:

SC/ST/OBC రిజర్వేషన్లను బీజేపీ రద్దు చేస్తుందని అమిత్ షా తెలంగాణ బహిరంగ సభలో చెప్పారా; వాస్తవ పరిశీలన

బెంగళూరులో షాపుల సైన్ బోర్డులు కాషాయ రంగులో ఉంటె వాటిని బెంగళూరు పౌర సంస్థ(BBMP) తొలగిస్తోందా? వాస్తవ పరిశీలన