వాదన/Claim: వీడియో క్లిప్‌లో ఢిల్లీ మంత్రి అతిషి విద్యుత్ సబ్సిడీని రేపటి నుండి (మే 23, 2024) నిలిపివేస్తున్నట్లు వెల్లడిస్తున్నారనేది వాదన.
నిర్ధారణ/Conclusion: తప్పుడు వాదన. ఏప్రిల్ 2023 నాటి మంత్రి అతిషి యొక్క పాత వీడియో ఇటీవల జరిగిన సంఘటనగా షేర్ చేయబడుతోంది.అయితే,తాజా అధికారిక ధృవీకరణ ప్రకారం ఉచిత విద్యుత్ సబ్సిడీ 2025 వరకు కొనసాగుతుంది.
రేటింగ్: తప్పుగా చూపించే ప్రయత్నం —
మరి కొన్ని Fact Checks:
శనివారం, మే 25, 2024న ఢిల్లీలో ఏడు లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, ఢిల్లీ వాసులకు కేజ్రీవాల్ ప్రభుత్వం ఇచ్చిన విద్యుత్ సబ్సిడీని ఉపసంహరించుకుంటున్నట్లు ఒక వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేయబడుతోంది.మరుసటి రోజు (May 23, 2024) నుంచి ఉచిత విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని ఢిల్లీ మంత్రి అతిషి మర్లెనా చెబుతున్నట్లు వీడియో క్లిప్‌లో ఉంది.
लो भाई उतर गया बुखार😂😂😂people who voted for freebies deserved this. Freebies are a sure recipe for economic disaster✌
याने कल से फोकटगिरी बंद ! @AamAadmiParty का फोकटिया वादा अब चुकाओ बिल ज्यादा ।इसीलिए चुनो मोदी का वादा। @BJP4India pic.twitter.com/nMA182LBaC— Jc Naithani🇮🇳*Modi Ka Parivar (@JcNaithani) May 23, 2024
వాదన ఈ విధంగా ఉంది: “ఉచిత పథకాలు/ఉచిత రాయితీలు ఖచ్చితంగా ఆర్థిక విపత్తుకు దారి తీస్తాయి.ఉచిత పథకాలు కోసం ఓటు వేసిన వ్యక్తులు దీనికి కారణం,కావున మీరే బాధపడతారు.”
ఢిల్లీ వాసులకు ఢిల్లీ ప్రభుత్వం 300 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను అందజేస్తున్న సంగతి తెలిసిందే. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆధ్వర్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)అందజేస్తున్న ఈ సబ్సిడీ దేశ రాజధానిలో రాజకీయ పార్టీల మధ్య వివాదంగా మారింది.
విభిన్న వ్యాఖ్యలు మరియు శీర్షికలతో వాదన/దావా ఇక్కడ మరియు ఇక్కడ షేర్ చేయబడింది.
FACT-CHECK
Digiteye India బృందం WhatsAppలో అభ్యర్థనను స్వీకరించినప్పుడు, మేము ముందుగా Atishi మరియు AAP యొక్క అధికారిక హ్యాండిల్ కోసం పరిశీలించగా,ఒక సంవత్సరం క్రితం వార్తా సంస్థ ANI అప్‌లోడ్ చేసిన అసలైన వీడియోలో మంత్రి అతిషి విద్యుత్ సబ్సిడీ గురించి మాట్లాడుతున్నట్లు మేము గుర్తించాము.ఇది ఏప్రిల్ 14, 2023న ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతున్నప్పుడు పోస్ట్ చేయబడింది, మే 24, 2024న జరిగిన సంఘటన కాదు.
#WATCH | From today, the subsidized electricity given to the people of Delhi will be stopped. This means from tomorrow, the subsidized bills will not be given. This subsidy is stopped because AAP govt has taken the decision to continue subsidy for the coming year, but that file… pic.twitter.com/lYZ3lJ0Od7
— ANI (@ANI) April 14, 2023
ఏఎన్‌ఐ(ANI) కథనం ప్రకారం, “ఈ రోజు నుండి, ఢిల్లీ ప్రజలకు ఇచ్చే సబ్సిడీ విద్యుత్ నిలిపివేయబడుతుంది. అంటే రేపటి నుండి,సబ్సిడీ బిల్లులు ఇవ్వబడవు.AAP ప్రభుత్వం రాబోయే సంవత్సరానికి సబ్సిడీని కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది,కానీ ఆ ఫైల్ ఢిల్లీ LG (లెఫ్టినెంట్ గవర్నర్) పరిశీలనలో ఉంది మరియు ఫైల్ ఆమోదించే వరకు, AAP ప్రభుత్వం సబ్సిడీ బిల్లును విడుదల చేయడం కుదరదు: ఢిల్లీ మంత్రి అతిషి” మరియు తేదీ ఏప్రిల్ 14, 2023 అని స్పష్టంగా కనపడుతుంది.
ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ దగ్గర సబ్సిడీ ఫైల్ పెండింగ్‌లో ఉండడం వలన ఆలస్యానికి కారణమైందని అతిషి హిందీలో చెప్పడం వీడియోలో వినవచ్చు. అయితే, తాజా అధికారిక ధృవీకరణ ప్రకారం సమస్య పరిష్కరించబడిందని మరియు సబ్సిడీని 2025 వరకు కొనసాగించాలనే నిర్ణయం జరిగిందని వార్తా నివేదికలు ధృవీకరించాయి.
ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీ.కే సక్సేనా ఏప్రిల్ 13, 2024న ఢిల్లీలో విద్యుత్, నీరు, బస్సు ఛార్జీల రాయితీలు యధావిధిగా కొనసాగుతాయని,మరియు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జైలులో ఉన్నందున పథకాలను నిలిపివేస్తామనే ప్రకటనలను పట్టించుకోవద్దని/నమ్మవద్దని ప్రజలను కోరారు.
కాబట్టి ఈ వాదన/దావా తప్పు.
AAP నేతలు అతిషి, సౌరభ్ భరద్వాజ్ X (ట్విట్టర్)లో కేజ్రీవాల్‌ను అనుసరించటం లేదా? వాస్తవ పరిశీలన