Tag Archives: america politics

VP నామినీ J.D. వాన్స్ పేరు ప్రకటించినప్పుడు US రిపబ్లికన్ కన్వెన్షన్‌లో ‘ఇండియా-ఇండియా’ అన్న నినాదాలు వినిపించాయా? వాస్తవ పరిశీలన

వాదన/Claim:జూలై 15న మిల్వాకీలో జరిగిన రిపబ్లికన్ కన్వెన్షన్‌కు VP నామినీ J.D. వాన్స్ తన భారతీయ సంతతికి చెందిన భార్యను తీసుకువచ్చినప్పుడు “ఇండియా-ఇండియా” అనే నినాదాలు వినిపించాయనేది వాదన.

నిర్ధారణ/Conclusion: తప్పుడు వాదన. అసలు/ఒరిజినల్ వీడియోలో క్లెయిమ్ చేసినట్లుగా “ఇండియా-ఇండియా” అనే నినాదాలు వినపడలేదు.

రేటింగ్: తప్పు దారి పట్టించే ప్రయత్నం —

వాస్తవ పరిశీలన పూర్తి వివరాలను వీడియోలో చూడటానికి కింది చిత్రంపై క్లిక్ చేయండి.

లేదా దిగువ కథనాన్ని చదవండి.

************************************************************************

జూలై 15, 2024న మిల్వాకీలో జరిగిన రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్ J.D. వాన్స్‌ను వైస్ ప్రెసిడెంట్ నామినీగా ప్రకటించిన వెంటనే, “ఇండియా-ఇండియా” అనే నినాదాలు వినిపించినట్లు సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అయింది.సమావేశానికి హాజరైన ప్రతినిధులు J.D. వాన్స్ మరియు భారత సంతకి చెందిన అతని భార్య ఉషా చిలుకూరికి స్వాగతం పలికారు.

ఒక X వినియోగదారు ఇలా వ్రాశాడు, “JD వాన్స్ మరియు త్వరలో కాబోయే రెండవ మహిళ ఉషా చిలుకూరిని RNC కన్వెన్షన్‌లోకి తీసుకువస్తున్నప్పుడు ‘ఇండియా ఇండియా’ నినాదాలు.కొత్త రిపబ్లికన్ పార్టీ. ఇది నిరంతరంగా మెరుగుపడుతోంది. (Sic)”

FACT-CHECK

జూలై 15న ఫోర్బ్స్ అప్‌లోడ్ చేసిన రిపబ్లికన్ కన్వెన్షన్ వీడియోను Digiteye India బృందం పరిశీలించగా,వీడియో యొక్క 03:00 గంటల టైమ్‌స్టాంప్ వద్ద,J.D.వాన్స్ నామినేషన్ ప్రకటించినప్పుడు US బ్యాండ్ సిక్స్‌వైర్ ప్రదర్శన జరగడం (క్రింద వీడియోలో) చూడవచ్చు.

సోషల్ మీడియా పోస్ట్‌లో క్లెయిమ్ చేసినట్లుగా వీడియోలో “ఇండియా-ఇండియా” అనే నినాదాలు వినపడలేదు. అందువలన, సదస్సులోని ప్రతినిధులు ‘ఇండియా-ఇండియా’ అని నినాదాలు చేస్తున్నట్లుగా “వీడియో సౌండ్ ట్రాక్” మార్చి చూపబడింది.

మరి కొన్ని వాస్తవ పరిశీలన కధనాలు:

కమలా హారిస్‌ అమెరికా యొక్క సహజసిద్దమైన పౌరురాలు కాదా? US ప్రెసిడెంట్ అభ్యర్థి యొక్క అర్హతపై వాదన మళ్లీ తెరపైకి వచ్చింది; వాస్తవ పరిశీలన

అనేక దేశాలు భారతదేశం నుండి పండ్లు మరియు కూరగాయల దిగుమతులను నిషేధించాయా? వాస్తవ పరిశీలన

 

 

 

 

కమలా హారిస్‌ అమెరికా యొక్క సహజసిద్దమైన పౌరురాలు కాదా? US ప్రెసిడెంట్ అభ్యర్థి యొక్క అర్హతపై వాదన మళ్లీ తెరపైకి వచ్చింది; వాస్తవ పరిశీలన

వాదన/Claim: కాలిఫోర్నియాలోకి వలస వచ్చిన తల్లిదండ్రులకు జన్మించిన కమలా హారిస్, యునైటెడ్ స్టేట్స్ యొక్క “సహజసిద్ధంగా జన్మించిన పౌరురాలు(natural born citizen)” కాదు ,అందువలన US అధ్యక్ష పదవికి అనర్హురాలనేది వాదన.

నిర్ధారణ/Conclusion: తప్పుడు వాదన. కమలా హారిస్ యునైటెడ్ స్టేట్స్ యొక్క “సహజసిద్ధంగా జన్మించిన పౌరురాలు(natural born citizen)” కాబట్టి US అధ్యక్ష అభ్యర్థిగా అర్హత పొందారు.

రేటింగ్: తప్పు దారి పట్టించే ప్రయత్నం —

 వాస్తవ పరిశీలన పూర్తి వివరాలను వీడియోలో చూడటానికి కింది చిత్రంపై క్లిక్ చేయండి.

లేదా దిగువ కథనాన్ని చదవండి.

************************************************************************

జూలై 21, 2024న అధ్యక్ష రేసు నుండి వైదొలుగుతున్నట్లు US అధ్యక్షుడు జో బిడెన్ ప్రకటించిన వెంటనే సోషల్ మీడియా ఒక పోస్ట్ వైరల్ అయ్యింది.తన స్థానంలో డెమొక్రాట్ల అభ్యర్థిగా తన ఉపరాష్ట్రపతి అభ్యర్ధి అయిన కమలా హారిస్‌ను బలపరిచారు. కానీ కమలా హారిస్ “సహజసిద్ధంగా జన్మించిన పౌరురాలు” కానందున అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేసే అర్హత లేదని సోషల్ మీడియా పోస్ట్ పేర్కొంది.

వాదన/దావాను ఫేస్‌బుక్‌లో కూడా చూడవచ్చు:

వాదన ఈ విధంగా ఉంది, “ఆమె (కమల) తండ్రి జమైకన్ జాతీయుడు, ఆమె తల్లి భారతదేశానికి చెందినది, మరియు 1964లో హారిస్ పుట్టిన సమయంలో వారిరువురు కూడా సహజసిద్ధమైన U.S. పౌరులు కారు.అది ఆమెను “సహజసిద్ధంగా జన్మించిన పౌరురాలు(natural born citizen)” గా చేయదు – అందువల్ల రాష్ట్రపతి పదవికి అనర్హురాలు.

  • సహజసిద్ధంగా జన్మించిన పౌరుడు(natural born citizen) అనేది పుట్టినప్పుడు(ఆ దేశంలో జన్మించినప్పుడు) U.S. పౌరుడిగా  సూచిస్తుంది మరియు తరువాత జీవితంలో సహజత్వం పొందాల్సిన అవసరం లేదు.
  • ఇమ్మిగ్రేషన్ అండ్ నేషనాలిటీ యాక్ట్ (INA)లో కాంగ్రెస్ ఏర్పాటు చేసిన నియమాలను అనుసరించి తర్వాత చట్టబద్ధమైన శాశ్వత నివాసికి U.S. పౌరసత్వం మంజూరు చేసే ప్రక్రియను సహజత్వం (Naturalization) అంటారు.

FACT-CHECK

ఈ వాదన/దావా కొత్తది కాదు మరియు నాలుగు సంవత్సరాల క్రితం 2020లో కమలా హారిస్‌ను జో బిడెన్ తన వైస్ ప్రెసిడెన్షియల్ అభ్యర్ధిగా ఎంచుకున్నప్పుడు కుడా ఇది లేవనెత్తబడింది.ఇప్పుడు డెమొక్రాట్ల అధ్యక్ష అభ్యర్థిగా బిడెన్ స్థానంలో ఆమె ఎంపిక కానున్న నేపథ్యంలో మళ్లీ పాత వివాదమే తలెత్తుతోంది.అయితే, US రాజ్యాంగంలో అధ్యక్ష అభ్యర్థి యొక్క అర్హత గురించి ఖచ్చితంగా వ్రాయబడి ఉంది.

US రాజ్యాంగం ఏమి చెబుతుంది:

US రాజ్యాంగంలోని ఆర్టికల్ II ఇలా చెబుతోంది: “సహజసిద్ధంగా జన్మించిన  పౌరుడు తప్ప…వేరేవారు ప్రెసిడెంట్ పదవికి అర్హులు కారు.”
మరియు US రాజ్యాంగం యొక్క పద్నాలుగో ప్రకారం : “యునైటెడ్ స్టేట్స్‌లో జన్మించిన లేదా సహజత్వం పొందిన వ్యక్తులందరూ మరియు దాని అధికార పరిధికి లోబడి, యునైటెడ్ స్టేట్స్ మరియు వారు నివసించే రాష్ట్రంలోని పౌరులు”అనిపేర్కొంది.

(Naturalization/సహజత్వం పొందిన వ్యక్తి—“ఇమ్మిగ్రేషన్ అండ్ నేషనాలిటీ యాక్ట్ (INA)లో కాంగ్రెస్ ఏర్పాటు చేసిన నియమాలను అనుసరించిన తర్వాత చట్టబద్ధమైన శాశ్వత నివాసికి U.S. పౌరసత్వం మంజూరు చేయబడటం”)

బే ఏరియా న్యూస్ గ్రూప్ అప్‌లోడ్ చేసిన ఆమె జనన ధృవీకరణ పత్రాన్ని దిగువన చూడవచ్చును. ఆమె అక్టోబర్ 20, 1964న కాలిఫోర్నియాలోని ఓక్లాండ్‌లో జన్మించింది.

ఇది కాలిఫోర్నియాలో జన్మించిన కమలా హారిస్ యునైటెడ్ స్టేట్స్ యొక్క “సహజసిద్ధంగా జన్మించిన పౌరురాలు”గా ధృవపరుస్తుంది.అంతేకాకుండా, US రాజ్యాంగం ప్రకారం ప్రెసిడెంట్ మరియు వైస్ ప్రెసిడెంట్ ఇద్దరికీ అర్హత నియమాలు/పరిస్థితులు ఒకే విధంగా ఉంటాయి.ఇప్పటికే ఆమె U.S వైస్ ప్రెసిడెంట్‌గా పని చేస్తున్నారు కావున US ప్రెసిడెంట్ రేసుకు అర్హత సాధించారు.

కాబట్టి, ఇది తప్పుడు వాదన/దావా.

మరి కొన్ని వాస్తవ పరిశీలన కధనాలు:

న్యూజిలాండ్ హోం మంత్రి సనాతన ధర్మాన్ని స్వీకరించారని వీడియో పేర్కొంది; వాస్తవ పరిశీలన

ఒడిశాలోని కోణార్క్ ఆలయం లోపల సూర్యుడు ఉదయిస్తాడా? వాస్తవ పరిశీలన