విండ్ టర్బైన్ల కారణంగా మిలియన్ల కొద్ది పక్షులు చనిపోతున్నాయా; ఏది నిజం [FACT CHECK]

2025 నాటికి దేశంలోని దాదాపు మొత్తం తీరప్రాంతంలో పెద్ద ఎత్తున wind farmsను అభివృద్ధి చేసే ప్రణాళికను అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ప్రభుత్వం అక్టోబర్ 15, 2021న ప్రకటించిన తర్వాత, విండ్ టర్బైన్‌లు(wind turbines) పక్షుల మరణానికి దారితీస్తాయనే పాత చర్చ మళ్లీ దృష్టికి వచ్చింది. .

బోస్టన్‌లో జరిగిన విండ్ పవర్ ఇండస్ట్రీ కాన్ఫరెన్స్‌లో ఇంటీరియర్ సెక్రటరీ ‘దేబ్ హాలాండ్(Deb Haaland)’ ప్రకటన చేసిన వెంటనే, యునైటెడ్ స్టేట్స్‌లోని తీరప్రాంతంలో విండ్ టర్బైన్‌లను ఏర్పాటు చేస్తే పక్షులు ఎక్కువగా ప్రభావితమవుతాయని ట్విట్టర్‌లో అనేక సందేశాలు వచ్చాయి. ఇక్కడ కొన్ని ఉన్నాయి:

https://twitter.com/InfoHarvester/status/1448728457442172934?s=20

 

FACT CHECK

అనేక రకమైన పక్షులు కనుమరుగయ్యే/అంతరించిపోయే పరిస్తితి లో ఉన్నందున పర్యావరణంపై దాని ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని వాస్తవం పరిశీలించటం కోసం సమస్యను Digiteye India స్వీకరించింది.యునైటెడ్ స్టేట్స్ ఫిష్ అండ్ వైల్డ్ లైఫ్ సర్వీస్ ప్రకారం, విండ్ టర్బైన్‌ల కంటే పిల్లుల వలన పక్షి జాతికి తీవ్ర హాని కలుగుతుంది.

పిల్లుల దాడి వలన పక్షి మరణాల సంఖ్య 2.4 బిలియన్లుగా ఉన్నట్లు అంచనా.పిల్లులు మరియు గాజు భవనాలు వలన పక్షి జాతికి కలిగించే హాని/నష్టంతో పోల్చితే భూమిపై ఉన్న విండ్ టర్బైన్‌లు వలన జరిగె హాని చాల తక్కువ శాతం.

ల్యాండ్ విండ్ టర్బైన్‌లు వలన 200,000 పైగా పక్షులు మారణిoచగా, గాజు భవనాలు ఢీకొనడం వలన దాదాపు 600 మిలియన్ల పక్షులు మరణిస్తున్నాయని అంచనా వేయబడింది, అయితే ‘యునైటెడ్ స్టేట్స్ ఫిష్ అండ్ వైల్డ్ లైఫ్ సర్వీస్’వారు ఆఫ్‌షోర్ విండ్ టర్బైన్‌ల వల్ల సంభవించే మరణాలకు అంచనాలను అందించలేదు.

పొడవైన విండ్ టర్బైన్‌లు వల్ల పక్షులకు ఖచ్చితంగా ప్రమాదం ఉందని మా పరిశోదనలో తేలింది, కాని పిల్లులు మరియు నగరాల్లో ఎత్తైన గాజు భవనాలు వలన పక్షి జాతికి కలిగించే హాని/నష్టంతో పోల్చితే భూమిపై ఉన్న విండ్ టర్బైన్‌లు వలన జరిగె హాని చాల తక్కువ శాతం. గాజు భవనాలు/కిటికీల ద్వారా చనిపోయిన 624 మిలియన్ల పక్షులతో పోలిస్తే టర్బైన్లు వలన 0.1% పక్షులు మరియు పిల్లులతో పోలిస్తే 0.03% చొప్పున పక్షులు చనిపోతున్నాయి.

నివేదికను ఇక్కడ చూడండి.

కింది ఇన్ఫోగ్రాఫ్ వివరాలను చూపుతుంది.

Infographic: Wind Turbines Are Not Killing Fields for Birds | Statista

అయితే, ఈ భారీ టర్బైన్‌ల వల్ల వేలకొద్ది పక్షులు చనిపోతున్నాయన్నది నిజం. ఇటివల కాలంలో, దిన్ని పరిష్కరించడానికి అనేక ప్రయత్నాలు జరిగాయి.ఇప్పటికే అనేక శాస్త్రీయ పరిష్కారాలు సమర్థవంతమైన మరియు కొనుగోలు సామర్ధ్యం ఉన్న పరిష్కారాలుగా మెప్పును పొందాయి. వీడియోను ఇక్కడ చూడండి:

భారతదేశంతో సహా అనేక దేశాలలో విండ్ టర్బైన్‌లు సర్వసాధారణం కావడంతో మరియు వాతావరణ మార్పులకు అనుగుణంగా పునరుత్పాదక శక్తికి(renewable energy) అత్యంత అనుకూలమైన పరిష్కారం కాబట్టి తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకుంటే పక్షుల మరణాలను నివారించవచ్చు.

Birds (U.S. Fish & Wildlife Service)

సెన్సార్ టెక్నాలజీ

ఇటీవల, పక్షులు సమీపిస్తున్నప్పుడు టర్బైన్‌లను నెమ్మదిగా లేదా ఆపడానికి కొన్ని సెన్సార్ టెక్నాలజీ అభివృద్ధి చేయబడింది. IdentiFlight అని పిలువబడే AI-ఆధారిత కెమెరా డిటెక్షన్ సిస్టమ్ 2019 సం నుండి పవన శక్తి పరిశ్రమకు (wind energy industry) సురక్షితంగా పక్షులను రక్షించడానికి ఏంతో సహాయపడుతూ ఉంది.

IdentiFlight 360-డిగ్రీల (radiusలో) ఆకాశాన్ని స్కాన్ చేస్తుంది మరియు ఒక కిలోమీటరులోపు ఎగురుతున్న ఏదైనా వస్తువును గుర్తించగలదు. ఏదైనా ఎగిరే వస్తువు/ఇమేజ్/పక్షిని గుర్తిస్తే, సిస్టమ్ విండ్ టర్బైన్‌లను స్విచ్ ఆఫ్ చేసే ముందు, ఆ ఎగిరే వస్తువు/పక్షిని 200 ఇమేజ్ లక్షణాలలో ఉన్నా చిత్రాలతో విశ్లేషించడానికి కృత్రిమ మేధస్సును ఉపయోగించి, సమీపించే పక్షులను రక్షిస్తుంది. వాస్తవమైన వీడియోని ఇక్కడ చూడండి.

వాదన/Claim:  విండ్ టర్బైన్ల వలన లక్షలాది పక్షులు చనిపోతున్నాయి.
నిర్ధారణ:ఈ వాదన పాక్షికంగా నిజం అయితే పక్షులను చంపే ఇతర కారకాల కంటే ఈ శాతం చాలా తక్కువ.
టర్బైన్‌ల నుండి పక్షులను రక్షించడానికి కొత్త సాంకేతికతలు విజయవంతంగా పరీక్షించబడ్డాయి లేదా
పరీక్షించబడుతున్నాయి, ఎందుకంటే పునరుత్పాదక ఇంధన వనరులలో(renewable energy sources) పవన శక్తి (wind energy) కాలుష్య రహిత మరియు పచ్చని వాతావరణంకి,
శిలాజ ఇంధనాలు (fossil fuels) గ్లోబల్ వార్మింగ్ మరియు వాతావరణ మార్పులకు దోహదం చేస్తున్నాయి కాబట్టి.

Our rating: Misinterpretation

మరి కొన్ని Fact Checks: 
No, Rs.500 Indian currency notes with '*' symbol are NOT FAKE  but genuine; Fact Check ; 
Did these migratory birds Bayan and Onon reach India travelling 5,000 miles? Fact Check;

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*