జపాన్‌లో 5వ అంతస్తు నుండి కింద పడుతున్న 3 ఏళ్ల చిన్నారిని కాపాడిన దృశ్యాలు ఈ వీడియోలో కనిపిస్తున్నాయా ? వాస్తవ పరిశీలన

వాదన/Claim : జపాన్‌లో 5వ అంతస్తు నుండి కింద పడుతున్న 3 ఏళ్ల చిన్నారిని కాపాడిన దృశ్యాలు ఈ వీడియోలో కనీపిస్తున్నాయనేది వాదన.

నిర్ధారణ /Conclusion : ఈ వాదన తప్పుదారి పట్టించేలా ఉంది. చైనాలో 5వ అంతస్తులోని ఫ్లాట్ నుండి కింద పడిపోతున్న రెండేళ్ల చిన్నారిని కాపాడిన దృశ్యాలు వాస్తవానికి ఆ వీడియోలో ఉన్నాయి. ఈ వీడియోలో ఒక వ్యక్తి సాహసోపేతంగా ఒక చిన్నారిని కాపాడుతున్న చర్యను చూపిస్తుంది, కానీ ఆ ఘటన జపాన్‌లో కాకుండా 2022లో చైనాలో జరిగింది.

రేటింగ్ /Rating : తప్పుదారి పట్టించే వాదన 


ఇటీవల, ఐదవ అంతస్తు నుండి కింద పడుతున్న ఒక చిన్నారిని కాపాడిన దృశ్యాలున్న వీడియోను పలువురు సోషల్ మీడియా వినియోగదారులు పంచుకున్నారు. ‘TheWolfman’ అనే ధృవీకరించబడిన (verified) X వినియోగదారు ఈ క్రింది విధంగా పేర్కొంటూ ఒక పోస్ట్‌ను షేర్ చేశారు: “జపాన్‌లో, 3 ఏళ్ల చిన్నారి ఒకరు ఐదవ అంతస్తు నుండి కింద పడ్డారు. అటుగా వెళ్తున్న ఒక వ్యక్తి ఆ చిన్నారి ప్రాణాలను కాపాడారు. ఆ వ్యక్తిని దేశం ఒక హీరోగా కొనియాడుతున్నారు.” 14 సెగల నిడివి గల వీడియోను కింద చూడవచ్చు :

ఇతర వినియోగదారులు కూడా ఇదే వాదనను ఇక్కడ మరియు ఇక్కడ షేర్ చేసారు.

వాస్తవ పరిశీలన 

‘డిజిటై’ఇండియా బృందం ఈ వాదనను బృందం పరిశీలించగా, అది అవాస్తవమని గుర్తించింది.చైనాలో 5వ అంతస్తులోని ఫ్లాట్ నుండి కింద పడిపోతున్న రెండేళ్ల చిన్నారిని కాపాడిన దృశ్యాలు వాస్తవానికి ఆ వీడియోలో ఉన్నాయి. ఈ వీడియో ఒక వ్యక్తి సాహసోపేతంగా ఒక చిన్నారిని కాపాడుతున్న చర్యను చూపిస్తుంది.ఈ సంఘటన వాస్తవమైనది, కానీ ఆ ఘటన జపాన్‌లో కాకుండా 2022లో చైనాలో జరిగింది.

సందర్భం గురించి మరింత తెలుసుకోవడానికి మేము మొదట వీడియోలోని వివిధ కీలక ఫ్రేమ్‌లపై రివర్స్ ఇమేజ్ సెర్చ్ నిర్వహించగా , ChinaViewTV అప్‌లోడ్ చేసిన ఒక యూట్యూబ్ షార్ట్‌ను గుర్తించాము.దాని వివరణలో ఇలా ఉంది: “తూర్పు చైనాలోని జెజియాంగ్ రాష్ట్రంలోని టోంగ్‌జియాంగ్ నగరంలో ఆరవ అంతస్తు నుండి పడిపోయిన రెండేళ్ల బాలికను పట్టుకోవడానికి ఇద్దరు వ్యక్తులు పరుగెత్తుకొచ్చారు.” దీని వీడియో మరియు స్క్రీన్‌షాట్‌ను కింద చూడవచ్చు :

 

దీనిపై మరింత నిర్ధారణ కోసం, మేము “2 year old baby rescued after falling from the 5th floor, China” అనే పదబంధంతో వెబ్లో అన్వేషించాము. MetroUK నివేదిక ప్రకారం, ఆ చిన్నారి “ఐదవ అంతస్తు కిటికీ నుండి కిందకు పడి”,మొదటి అంతస్తులోని టెర్రస్‌పై పడింది; అయితే, రోడ్డుకు అవతలి వైపున తన కారును పార్క్ చేస్తున్న 31 ఏళ్ల షెన్ డాంగ్ (Shen Dong) ఆ పెద్ద శబ్దాన్ని విని, పరిస్థితిని గమనించి, ఆ చిన్నారి కాంక్రీటు నేలను తాకకముందే ఆమెను పట్టుకుని కాపాడారు.

అయితే, ‘Peopleapp’కు చెందిన మరో నివేదిక ప్రకారం, ఆ బాలిక 6వ అంతస్తు (లేదా 5వ అంతస్తులోని ఫ్లాట్) నుండి కింద పడిపోయింది; ఈ సంఘటన జెజియాంగ్ ప్రావిన్స్‌లోని జియాక్సింగ్ నగర పరిధిలో ఉన్న టోంగ్‌క్సియాంగ్ నగరంలో జరిగింది. అలాగే, జెజియాంగ్ ప్రావిన్స్‌లోని టోంగ్‌క్సియాంగ్ నగర ప్రజా భద్రతా విభాగం (Public Security Bureau) ఆ ఇద్దరు వ్యక్తుల ధైర్యసాహసాలను గుర్తించి, వారికి ప్రశంసా పత్రాలను అందజేసిందని కూడా ఆ నివేదిక పేర్కొంది.నివేదికలోని కొంత భాగాన్ని కింద చూడవచ్చు :

చివరగా, జపాన్‌లో ఐదవ లేదా ఆరవ అంతస్తు నుండి 3 ఏళ్ల చిన్నారి కింద పడిన ఘటనకు సంబంధించి మేము ఆరా తీయగా, ఎటువంటి విశ్వసనీయమైన సమాచారం లభించలేదు. ఆన్‌లైన్‌లో వైరల్ అవుతున్న పోస్ట్‌లలో దీనిని “జపాన్” అని తప్పుగా పేర్కొనడం తరచుగా జరుగుతున్న పొరపాటు.

కాబట్టి, ఈ వాదన అవాస్తవం.


మరికొన్ని వాస్తవ పరిశీలన కధనాలు:

ఫిబ్రవరి 08న నాసా ఆర్టెమిస్ 11 ప్రోగ్రామ్ ద్వారా మానవులను చంద్రునిపైకి పంపుతుందా? వాస్తవ పరిశీలన

భారత రాజధాని ఢిల్లీ త్వరలో ఇంద్రప్రస్థగా పేరు మారబోతుందా?వాస్తవ పరిశీలన

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.