ఈ చిత్రంలో చూపినట్ల  నిజంగానే 2026 ప్రపంచ కప్‌కు ముందు పోర్చుగల్ జట్టు కొత్త జాకెట్‌ను ధరించబోతుందా? వాస్తవ పరిశీలన

వాదన/Claim: చిత్రంలో చూపినట్ల 2026 ప్రపంచ కప్‌కు ముందు పోర్చుగల్ జట్టు కొత్త జాకెట్‌ను ధరించబోతుందనేది వాదన.

నిర్ధారణ /Conclusion: ఈ వాదన అవాస్తవం. ఆ చిత్రాలను ఏఐ (AI) ఉపయోగించి రూపొందించారు మరియు పోర్చుగల్ జాతీయ జట్టు అధికారిక దుస్తుల విభాగం నుండి అటువంటి అధికారిక ప్రకటన ఏదీ లేదు. అంతేకాకుండా, ఆ జాకెట్‌పై నైక్ లోగో ఉన్నప్పటికీ, పోర్చుగల్ నైక్‌తో తమ భాగస్వామ్యాన్ని ముగించి, జనవరి 1, 2025 నుండి పూమా (Puma)తో దీర్ఘకాలిక ఒప్పందం కుదుర్చుకుంది.

 రేటింగ్ /Rating: అవాస్తవం


2026 ఫీఫా ప్రపంచ కప్‌కు ముందు పోర్చుగల్ జాతీయ ఫుట్‌బాల్ జట్టు కొత్త జాకెట్లను విడుదల చేసిందని పలువురు వినియోగదారులు సోషల్ మీడియాలో చిత్రాలను షేర్ చేసారు.వెరిఫైడ్ X యూజర్ ‘ఫుటాస్పోర్’ ఇలాంటి ఒక పోస్ట్‌ను ఈ క్యాప్షన్‌తో షేర్ చేసారు(తెలుగు అనువాదం ఈ ఉంది): “పోర్చుగల్ జాతీయ జట్టు 2026 ప్రపంచ కప్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన తమ ప్రీ-మ్యాచ్ జాకెట్‌ను ప్రదర్చించింది .” ఈ పోస్ట్‌కు జత చేసిన రెండు చిత్రాలలో క్రిస్టియానో ​​రొనాల్డో మరియు పోర్చుగల్ ఆటగాళ్లు ప్రముఖ నైక్ స్వూష్ లోగో ఉన్న ఈ కొత్త జాకెట్‌ను ధరించి ఉన్నారు. కింది పోస్ట్‌ను చూడవచ్చు.

ఇతర వినియోగదారులు ఇలాంటి పోస్ట్‌లనే ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు షేర్ చేసారు.

 వాస్తవ పరిశీలన 

ఈ వాదనను’డిజిటై’ బృందం పరిశీలించగా, అది అవాస్తవం గుర్తించింది.ఈ చిత్రాలు AI ద్వారా రూపొందించబడినట్లు తెలుస్తుంది , అలాగే అటువంటి జాకెట్‌కు సంబంధించి పోర్చుగల్ జాతీయ జట్టు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. అంతేకాకుండా, పోర్చుగల్ నైకీ (Nike)తో తన దీర్ఘకాలిక భాగస్వామ్యాన్ని ముగించి, 2025 జనవరి 1 నుండి పూమా (Puma)తో కొత్త ఒప్పందాన్ని ప్రారంభించినప్పటికీ, చిత్రాలలో కనిపించే జాకెట్‌పై నైకీ లోగో ఉంది.

వివరాలు:

మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి, మేము మొదట “Portugal Football New new jacket 2026” అనే పదబంధంతో ‘రివర్స్ ఇమేజ్ సెర్చ్’ (reverse image search) నిర్వహించగా , అటువంటి వార్తను ధృవీకరించేలా ఏ వార్తా సంస్థల కథనాలు గానీ, పోర్చుగల్ జట్టుకు సంబంధించిన అధికారిక పోస్ట్‌లు గానీ మాకు లభించలేదు . దానికి బదులుగా, FIFA వరల్డ్ కప్ 2026 కోసం పోర్చుగల్ జట్టు యొక్క అధికారిక ‘హోమ్’ మరియు ‘అవే’ జెర్సీలను ప్రదర్శిస్తూ ESPN ప్రచురించిన ఒక కథనం మాకు లభించింది.

కింద, రెండు జెర్సీల చిత్రాల స్క్రీన్‌షాట్‌లను చూడండి

తరువాత, మరింత సమాచారం కోసం అన్వేషించగా, నవంబర్ 27, 2024న ప్రచురితమైన న్యూయార్క్ టైమ్స్ నివేదిక ఒకటి మాకు లభించింది. దాని ప్రకారం, “పోర్చుగల్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ (FPF) నైక్‌తో తమ 27 ఏళ్ల భాగస్వామ్యాన్ని ముగిస్తూ, పూమాతో ఒక కొత్త దీర్ఘకాలిక ఒప్పందంపై సంతకం చేసింది.” ఈ ఒప్పందం “జనవరి 1, 2025 నుండి అమల్లోకి వస్తుందని ” మరియు “పోర్చుగల్ పురుషుల మరియు మహిళల జాతీయ జట్ల కోసం పూమా కిట్‌లను ఉత్పత్తి చేస్తుందని” ఆ నివేదికలో పేర్కొనబడింది.

చివరగా, ఆ క్లెయిమ్‌/వాదనలో ఉన్న చిత్రాన్ని డౌన్‌లోడ్ చేసి, దాని ప్రామాణికతను తనిఖీ చేయడానికి ‘Hive Moderation‘ వారి AI డిటెక్టర్ ద్వారా పరిశీలించగా,ఆ చిత్రం AI ద్వారా సృష్టించబడిందని మరియు అది అసలైనది కాదని ఫలితాలు ధృవీకరించాయి. ఆ ఫలితాల స్క్రీన్‌షాట్‌ను కింద చూడవచ్చు  

కాబట్టి, ఈ వాదన అసత్యం.


మరికొన్ని వాస్తవ పరిశీలన కధనాలు:

భారత రాజధాని ఢిల్లీ త్వరలో ఇంద్రప్రస్థగా పేరు మారబోతుందా?వాస్తవ పరిశీలన

భారత గణతంత్ర దినోత్సవ పరేడ్ సందర్భంగా బైక్ విన్యాసాలు చేస్తున్న బైకర్లు కింద పడిపోయారా ?వాస్తవ పరిశీలన

 

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.