WhatsAppలో ‘view once’ (ఒక్కసారి మాత్రమే చూసే) ఫైళ్లను తిరిగి తెరవడానికి “.rvo” కమాండ్‌ను ఉపయోగించవచ్చా? వాస్తవ పరిశీలన

వాదన/Claim : WhatsAppలో “view once” (ఒక్కసారి మాత్రమే చూసే) ఫైల్‌ను తెరిచిన తర్వాత, రిప్లైగా “.rvo” అని టైప్ చేస్తే ఆ ఫోటో ఆటోమేటిక్‌గా మళ్లీ కనిపిస్తుందనేది వాదన.

నిర్ధారణ/Conclusion: ఆ వాదన పూర్తిగా అబద్ధం. అధికారిక వాట్సాప్ యాప్‌లో “.rvo” అని టైప్ చేయడం వల్ల ఏమీ జరగదు. ఒకసారి మాత్రమే చూడగలిగే ఫోటో లేదా వీడియోను చూసిన తక్షణం,అది శాశ్వతంగా అదృశ్యమవుతుంది మరియు దానిని మళ్లీ చూడలేము.

రేటింగ్/Rating: పూర్తిగా అబద్ధం Five rating

******************************************************

వాస్తవ పరిశీలన పూర్తి వివరాలను వీడియోలో చూడండి

లేదా వాస్తవ పరిశీలన కధనం చదవండి

******************************************************

సోషల్ మీడియాలో చాలా మంది వినియోగదారులు ఒక వీడియోను షేర్ చేస్తూ, రిప్లైగా “.rvo” అని టైప్ చేస్తే ఒక ఫైల్ మళ్లీ కనిపిస్తుందని పేర్కొన్నారు.
X వినియోగదారు ‘Alphx_Elite’ ఒక పోస్ట్‌ను: “ఈ వాట్సాప్ పద్ధతి ద్వారా,”view once” (ఒక్కసారి మాత్రమే చూసే) ఫైల్‌ను/ సందేశాలను మళ్లీ చూడటం సాధ్యమని పేర్కొన్నారు. మీరేమనుకుంటున్నారు, ఇది నిజమేనా?” అనే క్యాప్షన్‌తో షేర్ చేసారు.  ఈ పోస్ట్‌లో ఆ ట్రిక్‌ను చూపిస్తూ 16 సెకన్ల నిడివి గల ఒక వీడియో జతచేయబడింది,
ఆ పోస్ట్‌ను కింద చూడండి:

ఇతర వినియోగదారులు ఇలాంటి వాదనలనే ఇక్కడ మరియు ఇక్కడ షేర్ చేసారు.

FACT CHECK

ఈ వాదనను పరిశీలించాలని “డిజిటై బృందం” నిర్ణయించి,పరిశీలించగ, అది అవాస్తవమని నిర్ధారించింది. అధికారిక వాట్సాప్ (WhatsApp) అప్లికేషన్‌లో “.rvo” కమాండ్ ఎటువంటి ప్రభావం చూపదు. ‘View Once’ (ఒక్కసారి మాత్రమే చూసే) ఫోటో లేదా వీడియోను తెరిచి చూసిన తర్వాత, దానిని యాప్ ద్వారా మళ్లీ పొందడం/యాక్సెస్ చేయడం సాధ్యం కాదు.

మేము అధికారిక ప్లేస్టోర్/యాప్ స్టోర్ నుండి డౌన్‌లోడ్ చేసుకొని మా సొంత వాట్సాప్ యాప్‌లో ఈ ఫీచర్‌ను మొదట పరీక్షించగా, ఈ పద్ధతి పనిచేయదని మరియు దీనికి విరుద్ధంగా చెప్పడానికి విశ్వసనీయమైన నివేదికలు లేదా ఆధారాలు ఏవీ లేవని కనుగొన్నము .పేరు సూచించినట్లుగా, ఈ ఫీచర్ (View Once)”ఒకసారి చూడటానికి” మాత్రమే రూపొందించబడింది మరియు దానిని తిరిగి తెరవడానికి వీలు పడదు .

వాట్సాప్ ప్రకారం, ‘వ్యూ వన్స్'(View Once) ఫీచర్ ద్వారా వినియోగదారులు పంపిన ఫోటోలు, వీడియోలు మరియు వాయిస్ మెసేజ్‌లు “స్వీకరించిన వారు వాటిని ఒకసారి తెరిచిన తర్వాత చాట్ నుండి అదృశ్యమవుతాయి.”ఒకసారి ‘వ్యూ వన్స్’ ఫైల్ పంపిన తర్వాత, పంపినవారు దానిని మళ్లీ వాట్సాప్ చాట్ లో యాక్సెస్ చేయలేరు, మరియు స్వీకరించిన వారు ఆ కంటెంట్‌ను ఫార్వార్డ్ చేయడం, సేవ్ చేయడం, కాపీ చేయడం, స్టార్ చేయడం లేదా షేర్ చేయడం వంటివి చేయలేరు.ఈ ఫీచర్‌ని(లక్షణాన్ని ) ఉపయోగించి పంపిన ఫోటోలు మరియు వీడియోలు అందుకున్న వ్యక్తి యొక్క గ్యాలరీ లేదా ఫోటోల యాప్‌లో సేవ్ చేయబడవని కూడా వాట్సాప్ పేర్కొంది.

‘వ్యూ వన్స్'(‘View Once’) మీడియా యొక్క స్క్రీన్‌షాట్‌లు నిరోధించబడినప్పటికీ, గ్రహీతలు మరొక పరికరాన్ని ఉపయోగించడం వంటి “ఇతర మార్గాల” ద్వారా కంటెంట్‌ను రికార్డ్ చేయవచ్చని లేదా సేవ్ చేసుకోవచ్చని కంపెనీ పేర్కొంది. అదనంగా, తెరవని ‘వ్యూ వన్స్’ సందేశాలను 14 రోజులలోపు తప్పనిసరిగా చూడాలి, గడువు ముగిస్తే, ఫోన్ నుండి ఆటోమేటిక్ గ తొలగించబడతాయి.దిగువ స్క్రీన్‌షాట్‌ను చూడవచ్చు:

వినియోగదారులు ‘View Once’ (ఒక్కసారి మాత్రమే చూడగలిగే) మీడియా మరియు వాయిస్ సందేశాలను ఎలా పంపాలో, అలాగే వాటిని ఎలా తెరిచి చూడాలో మరో వాట్సాప్ కథనం వివరిస్తుంది. అటువంటి కంటెంట్ “స్వీకరించేవారి ఫొటోస్/గ్యాలరీలో సేవ్ చేయబడదని”, అలాగే దానిని ఫార్వార్డ్ చేయడం,షేర్ చేయడం లేదా కాపీ చేయడం సాధ్యం కాదని వాట్సాప్ పేర్కొంది.స్వీకర్త మీడియా నుండి బయటకు వచ్చిన తర్వాత, ఆ కంటెంట్‌ను యాక్సెస్ చేయడం లేదా తిరిగి తెరవడం సాధ్యం కాదు. కథనంలోని ఒక భాగాన్ని కింద చూడండి –

అయితే, “.rvo” వంటి కమాండ్ ఎక్కడైనా వాడినట్లుగాని లేదా దానివల్ల పేర్కొన్న ఫలితాలు వచ్చినట్లు గాని ఆధారాలూ డిజిటై బృందానికి లభించలేదు, మరియు అధికారిక వాట్సాప్ అప్లికేషన్‌లో ఆ కమాండ్ పనిచేయదు.
కాబట్టి, ఆ వాదన అవాస్తవం.

******************************************************
మరికొన్ని వాస్తవ పరిశీలన కధనాలు:

భారతదేశం ఇప్పటికే దేశవ్యాప్తంగా వినియోగదారుల మధ్య ఒకరి నుంచి మరొకరికి విద్యుత్ ట్రేడింగ్‌ను ప్రారంభించిందా? వాస్తవ పరిశీలన

భారత గణతంత్ర దినోత్సవ పరేడ్ సందర్భంగా బైక్ విన్యాసాలు చేస్తున్న బైకర్లు కింద పడిపోయారా ?వాస్తవ పరిశీలన

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.