Claim: ఎలోన్ మస్క్ X ప్లాట్‌ఫారమ్‌లో లైక్ బటన్‌ను మార్చారనేది వాదన.
Conclusion: పూర్తిగా తప్పు. ఎలోన్ మస్క్ X ప్లాట్‌ఫారమ్‌లోని లైక్ బటన్‌ను మార్చలేదు మరియు యూసర్ ఎంగేజ్మెంట్ (User Engagement) పెంచడానికి చేసే ఇటువంటి ఉపాయాలకు/కార్యకలాపాలకు X వ్యతిరేమని హెచ్చరించారు.
Rating: పూర్తిగా తప్పు —
(యూసర్ ఎంగేజ్మెంట్ (User Engagement): యూసర్ ఎంగేజ్మెంట్ అనేది వెబ్‌సైట్ లేదా యాప్‌తో వినియోగదారులు ఎలా పరస్పర చర్య చేస్తారో, తరచుగా దాన్ని ఉపయోగిస్తున్నారు మరియు ఎంతకాలం వారు దానిపై ఉంటారనేది కొలిచే మెట్రిక్. )
వాస్తవ పరిశీలన పూర్తి వివరాలను వీడియోలో చూడటానికి కింది చిత్రంపై క్లిక్ చేయండి.
లేదా దిగువ కథనాన్ని చదవండి.
***********************************************************************
భారతీయ చలనచిత్రాలు ప్రతి చిత్రానికి ఖర్చును పెంచుతున్నందున, తెలుగు నటుడు అల్లు అర్జున్ యొక్క “పుష్ప 2 చిత్రం” చుట్టూ జరుగుతున్న ప్రచారం కొత్త స్థాయికి చేరుకుంది.ఈ తీవ్ర ప్రచారం మధ్య, ఎలోన్ మస్క్ లైక్ బటన్‌ను మార్చినట్లు సూచిస్తూ Xలో సోషల్ మీడియా పోస్ట్ షేర్ చేయబడింది.
It’s not fake Elon Musk has changed a like button to this❤️🔥
Click on it and see ❤️ – >❤️🔥#WildfirePushpa #Pushpa2 #AlluArjun #Pushpa2ThRule pic.twitter.com/SOJHJYndyd
— Socialist Spirit (@SocialistSpirit) December 5, 2024
వాదన/దావా ఇలా ఉంది: “ఇది అబద్ధం/ఫేక్ కాదు, ఎలోన్ మస్క్ ‘లైక్’ బటన్‌ను దీనికి మార్చారు❤️🔥 దానిపై క్లిక్ చేసి చూడండి.”
“ఎలోన్ మస్క్ నిజంగా లైక్ బటన్‌ను మార్చారు-ఇది నిజం!”,అంటూ, మరొక వినియోగదారుడు దీనికి మద్దతు తెలిపారు.
“Elon Musk really changed the like button—it’s true!”
— Bhullur Sonkar💙🏏🏏 (@bhullur_sonkar) December 5, 2024
డిసెంబర్ 5, 2024, గురువారం నాడు పాన్-ఇండియా స్థాయిలో వేర్వేరు డబ్బింగ్ వెర్షన్‌లతో తెలుగు చలనచిత్రం పుష్ప 2 విడుదలైంది. ఈ సినిమా మొదటి భాగం పెద్ద హిట్ అయ్యింది మరియు దాని సీక్వెల్ కూడా ఊపందుకుంటున్నది.
వాస్తవ పరిశీలన
ఎక్స్ పాలసీలో లైక్ బటన్‌లపై అటువంటి మార్పు కోసం బృందం పరిశీలించినప్పుడు, ఎలోన్ మస్క్ ‘పుష్ప 2’ చిత్రం కోసం లైక్ బటన్‌ను మార్చలేదని మరియు అది ఫేక్ క్లెయిమ్/వాదన అని తేలింది.
బటన్‌పై ఒకరు క్లిక్ చేసినప్పుడు, అది ఆటోమేటిక్‌గా పోస్ట్‌ను ఇష్టపడుతున్నట్టు(లైక్ చేస్తున్నట్టు) తెలుపుతుంది.అంతేకాకుండా,షేర్ చేయబడిన వీడియో, లైక్ బటన్ ద్వారా ఇష్టపడేలా చేసి యూసర్ ఎంగేజ్మెంట్ పెంచడానికి చేసే మోసపూరిత ప్రక్రియ కోసం ఉద్దేశించబడింది,ఇది x విధానానికి విరుద్ధం.
ఇలాంటి కార్యకలాపాలకు/మాయలకు వ్యతిరేకంగా ఏప్రిల్‌లో ఎలాన్ మస్క్ హెచ్చరించారు.
Any accounts doing engagement farming will be suspended and traced to source
— Elon Musk (@elonmusk) April 19, 2024
అందువల్ల, ఈ దావా/వాదన పూర్తిగా తప్పు.
మరి కొన్ని వాస్తవ పరిశీలన కధనాలు:
ఈ వీడియోలో కమలా హారిస్ ‘Xని షట్ డౌన్ చేయాలి’ అన్నారా? వాస్తవ పరిశీలన