మే 21, 2024న లండన్ నుండి సింగపూర్ వెళ్లే సింగపూర్ ఎయిర్‌లైన్స్ విమానం తీవ్ర అల్లకల్లోలాన్ని/కుదుపులను(టర్బులెన్సు) ఎదుర్కొన్న కారణంగా ఒక ప్రయాణికుడు మరణించగా, 30 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. బోయింగ్ 777-300ER 6,000 అడుగుల లోతుకు పడిపోవడంతో బ్యాంకాక్‌లో అత్యవసర ల్యాండింగ్ చేయవలసి వచ్చింది.
(బహుశా తుఫాను ఫలితంగా ఆకస్మిక,అనూహ్య గాలి కదలికల వలన విమానంలో జరిగే అల్లకల్లోలాని విమానం టర్బులెన్సుగా పరిగణిస్తారు)
ఈ సంఘటన తర్వాత, అల్లకల్లోలంగా ఉన్న విమానం వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. క్లిప్‌లో విమానం తీవ్రంగా కంపించడంతో ప్రయాణికులు అరుస్తున్నట్లు చూడవచ్చు.
“నా ప్రగాఢ సానుభూతి…సింగపూర్ ఎయిర్‌లైన్స్ #Boeing777 లండన్-సింగపూర్ విమానం ఒకరోజు లేఓవర్ సమయంలో తీవ్ర లోపం ఎదుర్కొనడంతో ఒక ప్రయాణికుడు మరణించగా, 30 మంది గాయపడ్డారు”, అనే శీర్షికతో ఒక X వినియోగదారు వీడియోను X లో షేర్ చేసుకున్నారు.
My deepest condolences ❤️🙏🙏
One passenger has died and 30 others have been injured when Singapore Airlines #Boeing777 London-Singapore flight suffered a serious malfunction during its one-day layover. #Turbulence #sq321 #Vedant Agarwal #Sara Ali Khan #SingaporeAirlines pic.twitter.com/zW4w4hKun7— Preeti bhokar (@Preeti_bhokar) May 21, 2024
FACT-CHECK
Digiteye India టీం వైరల్ వీడియో నుండి కీఫ్రేమ్‌లను తీసుకొని రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా వీడియో యొక్క మూలాన్ని గుర్తించి అది సంబంధం లేని 2019 సంఘటనగా గుర్తించారు.ఈ వీడియో ఫుటేజ్ వాస్తవానికి జూన్ 16, 2019న ప్రిస్టినా, కొసావో నుండి స్విట్జర్లాండ్‌లోని బాసెల్‌కి వెళ్లే సమయంలో తీయబడింది. ALK ఎయిర్‌లైన్స్ బోయింగ్ 737లో ఈ అల్లకల్లోలం ఏర్పడింది.మిర్జేతా బాషా అనే ప్రయాణికుడు ఈ వీడియోను చిత్రీకరించినట్లు సమాచారం.ఫ్లైట్ అటెండెంట్‌ని మరియు ఆమె డ్రింక్ కార్ట్‌ను సీలింగ్ తగిలేలా విమానం తీవ్రమైన కుదుపులకు లోనవడంతో ప్రయాణీకులు తమ వస్తువులను త్వరత్వరగా భద్రపరుచుకోవడం వీడియోలో చూడవచ్చు.విమానంలో గందరగోళం/కుదువులతో ఉన్నప్పటికీ, విమానం అత్యవసర పరిస్థితిని ప్రకటించకుండా సాధారణంగా ల్యాండ్ చేయబడింది. దీనిని వార్తా సంస్థలు కూడా నివేదించాయి.
ABC న్యూస్ నివేదిక ప్రకారం, బాసెల్‌కు చేరుకున్న తర్వాత విమానంలో ఉన్న 121 మంది ప్రయాణికులలో 10 మంది స్వల్ప గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు. పలు మీడియా సంస్థలు ఈ ఘటనను కవర్ చేస్తూ ఆ సమయంలోని వీడియోను షేర్ చేశాయి.
అందువలన, వీడియో సింగపూర్ ఎయిర్‌లైన్స్ కు సంబంధించిన దృశ్యలంటూ షేర్ చేయబడుతున్న వాదన తప్పు. ఇది ALK ఎయిర్‌లైన్స్ బోయింగ్ 737లో ప్రిస్టినా, కొసావో నుండి స్విట్జర్లాండ్‌లోని బాసెల్‌కు వెళ్లే సమయంలో, జూన్ 16, 2019లో జరిగిన వేరొక సంఘటన నుండి తీసుకోబడిన దృశ్యాలు.
వాదన/Claim: మే 21, 2024న లండన్ నుండి సింగపూర్ వెళ్లే సింగపూర్ ఎయిర్‌లైన్స్ విమానం తీవ్ర గందరగోళానికి/కుదుపులకు లోనయిందంటూ వాదన చేయబడింది.
నిర్ధారణ/Conclusion: వీడియో క్లిప్ తప్పు. ఇది సింగపూర్ ఎయిర్‌లైన్స్ విమానం నుండి కాదు, 2019లో ప్రిస్టినా, కొసావో నుండి స్విట్జర్లాండ్‌లోని బాసెల్‌కు ప్రయాణిస్తున్న ALK ఎయిర్‌లైన్స్ బోయింగ్ 737లో జరిగిన కుదుపులు/గందరగోళం.
రేటింగ్: తప్పుగా చూపించే ప్రయత్నం —
మరి కొన్ని Fact Checks:
అనేక దేశాలు భారతదేశం నుండి పండ్లు మరియు కూరగాయల దిగుమతులను నిషేధించాయా? వాస్తవ పరిశీలన