వాదన/Claim: RSS (రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్) INDIA కూటమికి మద్దతు ఇచ్చింది మరియు INDIA కూటమికి అనుకూలంగా ఓటు వేయమని దేశవ్యాప్తంగా సంఘీలకు విజ్ఞప్తి చేసిందనేది వాదన.
నిర్ధారణ/Conclusion: తప్పుడు వాదన.నమోదు చేయబడని(రిజిస్టర్ కాని) సంస్థ బీజేపీ మాతృ సంస్థైన ‘రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్’ పేరుతో,ఈ విజ్ఞప్తి చేసిందని నిరూపణ అయ్యింది.
రేటింగ్: పూర్తిగా తప్పు --వాస్తవ పరిశీలన వివరాలు:
‘రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్’ అని రాసి ఉన్న బ్యానర్ ప్రముఖంగా కనిపిస్తున్న ప్రెస్ సమావేశంలో, అధికార BJP యొక్క మాతృ సంస్థ(RSS) ఏప్రిల్ 19 నుండి జూన్ 1, 2024 వరకు జరగాల్సిన లోక్‌సభ ఎన్నికలలో ప్రతిపక్ష పార్టీలతో కూడిన కూటమి(ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయన్స్–INDIA)కి తమ మద్దతు ఇస్తామని ప్రతిజ్ఞ చేసిందనే వాదనతో సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ చేయబడుతోంది.
హిందీ లోని పోస్ట్ అనువాదం ఈ విధంగా ఉంది: “RSS (రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్) INDIA కూటమికి మద్దతు ఇచ్చింది, INDIA కూటమికి అనుకూలంగా ఓటు వేయమని దేశవ్యాప్తంగా సంఘీలకు విజ్ఞప్తి చేసింది.”
🔥 Big News.. Please make viral this
देशभर में RSS (राष्ट्रीय स्वयंसेवक संघ) ने दिया INDIA गठबंधन को समर्थन,
देशभर के संघियों से INDIA गठबंधन के पक्ष में Vote करने की अपील की।संघ ने भरी हुंकार, उखाड़ फेंकों मोदी सरकार। pic.twitter.com/QI6ScAp52Q
— Naim Shanu (@ShanuNaim) March 26, 2024
ఈ వీడియోలో, జనార్దన్ మూన్ అనే వ్యక్తి, ‘రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్’ బ్యానర్ ఉన్న ప్రెస్ సమావేశంలో మాట్లాడుతూ, బిజెపిని ఓడించాలని పిలుపునిస్తున్నట్లు, INDIA కూటమికి తమ మద్దతు ప్రకటిస్తున్నట్టు చూడవచ్చు.
ఈ వీడియో Xలో వైరల్ అయ్యింది. ఇది ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.
FACT-CHECK
క్లెయిమ్ అవాస్తవంగా ఉన్నందున, Digiteye India బృందం వీడియో నుండి కొన్ని ఆధారాల కోసం వెతకగా, స్పీకర్ పేరు జనార్దన్ మూన్,వ్యవస్థాపకుడు మరియు ప్రెసిడెంట్ అని గమనించాము. దీని ఆధారంగా, మేము ఆర్‌ఎస్‌ఎస్+జనార్దన్ మూన్ అని గూగుల్‌లో సెర్చ్ చేయగా, బీజేపీ మాతృసంస్థ పేరుతో ఉన్న వేరే సంస్థకు సంబంధించిన వార్తా నివేదికలని తెలిశాయి.
వార్తా నివేదికల ప్రకారం,2017 నుండి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ పేరును నమోదు చేయడానికి జనార్దన్ మూన్ చేస్తున్న ప్రయత్నం విఫలమైంది.రిజిస్ట్రార్ మరియు బాంబే హైకోర్టు కూడా దీనిని తిరస్కరించింది.అదే సమయంలో,అసలైన RSS,జనార్దన్ మూన్ యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ వీడియోపై స్పందిస్తూ భారత ఎన్నికల కమిషన్‌ను సంప్రదించింది, మరియు RSS పేరును ఉపయోగించి ప్రజలను తప్పుదోవ పట్టించే అతని ప్రయత్నాన్ని నిరోధించమని ఎన్నికల సంఘాన్ని కోరింది.
కాబట్టి,ఈ దావా/వాదన తప్పు.
మరి కొన్ని Fact Checks: