వాదన/Claim: వీడియో క్లిప్‌లో లడఖ్ పర్యావరణవేత్త సోనమ్ వాంగ్‌చుక్ కాశ్మీర్ కోసం ప్రజాభిప్రాయ సేకరణను కోరుతున్నారనేది వాదన.
నిర్ధారణ/Conclusion: తప్పుడు వాదన. కార్గిల్‌పై పర్యావరణవేత్త సోనమ్ వాంగ్‌చుక్ చేసిన ప్రకటనను వక్రీకరించి, అసందర్భానుసారంగా చేసారు.
రేటింగ్: తప్పుగా చూపించే ప్రయత్నం —
Fact Checks వివరాలు:
లడఖ్ పర్యావరణవేత్త సోనమ్ వాంగ్‌చుక్ కాశ్మీర్ కోసం ప్రజాభిప్రాయ సేకరణ కోరుతున్నట్లు సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది.వీడియో క్లిప్‌లో సోనమ్ వాంగ్‌చుక్, “రిఫరెండమ్‌లు మరియు ప్రజాభిప్రాయ సేకరణలు జరగాలని మీరు విని ఉండవచ్చు,మరి అందరూ అలా అనుకుంటే,ఎందుకు చేయకూడదు?” అని అనడం వినవచ్చు.
Sad to see Environmentalist Sonam Wangchuk in Leh demanding a plebiscite for Kashmir. Mr. Wangchuk, Jammu & Kashmir is an integral part of India, will always remain so. Last hurdle of Article 370 was nullified both by Indian Parliament and Supreme Court. Don’t push separatism. pic.twitter.com/wrziWywbXB
— Aditya Raj Kaul (@AdityaRajKaul) May 19, 2024
క్యాప్షన్ ఈ విధంగా ఉంది: “కశ్మీర్ కోసం ప్రజాభిప్రాయ సేకరణ కొరకై లేహ్‌లో పర్యావరణవేత్త సోనమ్ వాంగ్‌చుక్ డిమాండ్ చేయడం విచారకరం.మిస్టర్ వాంగ్‌చుక్, జమ్మూ మరియు కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం మరియు ఎల్లప్పుడూ అలాగే ఉంటాయి.ఆర్టికల్ 370 య అడ్డంకును భారత పార్లమెంటు మరియు సుప్రీంకోర్టు రెండూ రద్దు చేశాయి. వేర్పాటువాదాన్ని(సెపరేటిజంను)ముందుకు తేవాలని చూడవద్దు”.
పోస్ట్ ఇక్కడ మరియు ఇక్కడ Xలో షేర్ చేయబడింది.
FACT CHECK
సున్నితమైన సమస్య కారణంగా,Digiteye India బృందం కొన్ని కీలక ఫ్రేమ్‌లను తీసుకొని, Google రివర్స్ ఇమేజ్ సెర్చ్‌లో పరిశీలించగా,అసలు ఇంటర్వ్యూని (అసలు వీడియో)ది ఫోర్త్ ఎస్టేట్ Youtube ఛానెల్ మే 13, 2024న అప్‌లోడ్ చేసిందని గుర్తించాము. వీడియోను ఇక్కడ చూడండి:
వీడియోలో 14:23 నిమిషాల వద్ద, ది ఫోర్త్ ఎస్టేట్ రిపోర్టర్ రవీంద్ర సింగ్ కార్గిల్ నివాసితులు ఇంకా జమ్మూ మరియు కాశ్మీర్‌తో అనుబంధం కోరుకుంటున్నారా అని సోనమ్ వాంగ్‌చుక్‌ను అడగగా, దానికి వాంగ్‌చుక్ ఇలా సమాధానమిచ్చారు, “లేదు, ఇది కొంతమంది వ్యక్తిగత అభిప్రాయమా (లేదా) మొత్తం ప్రాంతం జనాభాదా అని నేను అడగాలనుకుంటున్నాను.అప్పుడు మేము ప్రార్థన చేస్తూ ఆ దిశలో పని చేస్తాము. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా, ప్రజలు సంతోషంగా ఉండాలి, ప్రజలు ఎక్కడికి వెళ్లాలన్నస్వేచ్ఛ ఉండాలి.అందుకే రెఫరెండమ్స్ మరియు ప్రజాభిప్రాయ సేకరణలు ఉన్నాయి. అందరూ ఇదే విధంగా ఆలోచిస్తే కాశ్మీర్‌లో ఎందుకు ఉండకూడదు?
కానీ సోనమ్ వాంగ్‌చుక్ కాశ్మీర్‌లో ప్రజాభిప్రాయ సేకరణ డిమాండ్‌ను ప్రస్తావిస్తున్నారనే విషయం గందరగోళాన్ని సృష్టించటంతో, వెంటనే ఇంటర్వ్యూయర్ రవీంద్ర సింగ్ షియోరాన్, మే 20, 2024న మరొక వీడియోలో ఈ క్రింది విధంగా వివరణ ఇచ్చారు:
ఈ వీడియోలో,రవీంద్ర సింగ్ షెరాన్ మాట్లాడుతూ,“ కార్గిల్ మరియు లడఖ్ కేంద్ర పాలిత ప్రాంతాలుగా మారిన తర్వాత అధ్వాన్న స్థితిలో ఉన్నాయని, మనం దుర్భర స్థితిలో ఉన్నప్పుడు కేంద్రపాలిత ప్రాంతంగా ఎందుకు వారు చేయాలనుకుంటున్నారని,మమ్మల్ని తిరిగి ఒక్కటిగా కలపడం మంచిది” అని కార్గిల్ నాయకుడు సజ్జాద్ కార్గిలీ అన్నారన్న విషయాన్నీ నేను సోనమ్ వాంగ్‌చుక్‌తో ఇంటర్వ్యూ తీసుకున్నపుడు ప్రస్తావించగా, దానికి ఇది సజ్జాద్ కార్గిలీ వ్యక్తిగత అభిప్రాయం లేదా కార్గిల్ ప్రజల వ్యక్తిగత ఎంపిక అని సోనమ్ వాంగ్‌చుక్ సమాధానమిచ్చారు. ప్రతి కార్గిల్ పౌరుడు వాళ్ళని కాశ్మీర్‌లో తిరిగి కలిపితే మంచిదనుకుంటే,కలపడంలో తప్పు లేదు.వాళ్ళు సంతోషంగా ఉంటే,కలిపితేనే మంచిదని ఆయన అన్నారు.కాశ్మీర్‌లో రెఫరెండమ్స్, ప్రజాభిప్రాయ సేకరణలు జరగడానికి ఇదే కారణమని వాంగ్‌చుక్ తెలిపారు.
వీడియోలో 2:10 నిమిషాల వద్ద, సోనమ్ వాంగ్‌చుక్ స్టేట్‌మెంట్‌ను ఎడిట్ చేసి,కాశ్మీర్‌లో ప్రజాభిప్రాయ సేకరణ కావాలని సోనమ్ చెబుతున్నట్లు మార్చారని, ఇది నిజం కాదని రవీంద్ర సింగ్ షెరాన్ అన్నారు.
అదనంగా,సోనమ్ వాంగ్‌చుక్ స్వయంగా మే 20, 2024న చేసిన ట్వీటీని మేము గుర్తించాము: “నా ప్రకటనను గుర్తించలేనంతగా వక్రీకరించడం బాధాకరం.కానీ సందర్భానికి అనుచితంగా నా వీడియో యొక్క డాక్టరేడ్ వెర్షన్ ఎలా తప్పుగా అర్థం చేసుకోబడుతుందో నేను పూర్తిగా అర్థం చేసుకోగలను. దయచేసి అబద్ధాలు కాకుండా సత్యాన్ని ప్రచారం చేయండి. సత్యమేవ జయతే” అని రాశారు.
Sad to see my statement being twisted beyond recognition. But I can totally understand how the doctored version of my video could be misunderstood when taken out of its context. Please spread truth not lies. Satyamev jayate https://t.co/v1RilzE5ZL pic.twitter.com/IopcPWq8M8
— Sonam Wangchuk (@Wangchuk66) May 20, 2024
వాంగ్‌చుక్ చేసిన రిఫరెండమ్‌లు లేదా ప్రజాభిప్రాయ సేకరణకు సంబంధించి చేసిన ఒక సాధారణ సూచనను, అతను కాశ్మీర్ ప్రజాభిప్రాయ సేకరణ గురించి మాట్లాడుతున్నారని చెప్పడానికి వక్రీకరించబడింది,కాబట్టి,ఈ వాదన/దావా తప్పు.
మరి కొన్ని Fact Checks:
రేపటి నుంచి ఉచిత విద్యుత్ సబ్సిడీ ఆగిపోతుందని ఢిల్లీ మంత్రి అతిషి వెల్లడించారా? వాస్తవ పరిశీలన