వాదన/Claim:పురుగుమందుల కారణంగా భారతదేశం నుండి కూరగాయల దిగుమతిని అనేక దేశాలు నిషేధించాయని వార్తాపత్రిక పేర్కొంది.
నిర్ధారణ/Conclusion: తప్పుడు వాదన. వార్తాపత్రిక క్లిప్పింగ్ (వార్తా) 2015 నాటిది, ఢిల్లీ హైకోర్టు విచారణలోకి తీసుకున్న పురుగుమందుల సమస్యకు సంబంధించినది, ఇటీవల జరిగినది కాదు.
రేటింగ్: తప్పు దోవ పట్టించే వార్తా —
Fact Check వివరాలు:
పురుగుమందుల కారణంగా అనేక దేశాలు భారతదేశం నుండి కూరగాయలను నిషేధించాయని వాట్సాప్‌లో ఇటీవల వార్తాపత్రిక క్లిప్పింగ్ ఒకటి షేర్ చేయబడింది.
పంటలు మరియు ఆహార సాగులో మితిమీరిన పురుగుమందుల వినియోగాన్ని ప్రభుత్వం నిలిపివేయాలని ఆరోపించిన పిఐఎల్‌పై(PIL) 2024 మే 17న సుప్రీంకోర్టు ఆరోగ్య, వ్యవసాయ మంత్రిత్వ శాఖలు మరియు ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) నుండి ప్రతిస్పందనను కోరింది. మితిమీరిన పురుగుమందుల వినియోగం వలన ప్రజలకు తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాన్ని కలిగిస్తుంది.
Digiteye India బృందం వాస్తవ-తనిఖీ పరిశీలన కోసం న్యూస్‌క్లిప్‌ని అందుకుంది మరియు X ప్లాట్‌ఫారమ్‌లో క్రింద చూసినట్లుగా ఒక నెల క్రితం షేర్ చేయబడిందని మేము గమనించాము:
ज्यादा कीटनाशक प्रयोग करने से हमारा देश बीमार पड़ा।
लेकिन विश्व के अन्य देश पैसे के लिए शरीर से खिलवाड़ नहीं करते।
उन्होंने एकमत होकर भारत की जहरीली सब्जियों पर ही रोक लगा दी। pic.twitter.com/OFb6gPNndv— भारत बचाओ आंदोलन (@bbarajivdixit) April 24, 2024
హిందీలో వాదన/దావా ఇలా ఉంది:”ज्यादा कीटनाशक प्रयोग करने से हमारा देश बीमार पड़ा। लेकिन विश्व के अन्य देश पैसे के लिए शरीर से खिलवाड़ नहीं करते।
उन्होंने एकमत होकर भारत की जहरीली सब्जियों पर ही रोक लगा दी।” [తెలుగు అనువాదం:“మితిమీరిన పురుగుమందుల వాడకం వల్ల మన దేశం అనారోగ్యానికి గురైంది.కానీ ప్రపంచంలోని ఇతర దేశాలు డబ్బు కోసం తమ ఆరోగ్యంతో ఆడుకోరు.భారతదేశంలోని విషపూరిత కూరగాయలపై వారు ఏకగ్రీవంగా నిషేధం విధించారు.”]
అదే క్లిప్(వార్తా)ను ఫేస్‌బుక్‌లో కూడా షేర్ చేశారు.
FACT-CHECK
Digiteye India బృందం ఈ వార్త క్లిప్ యొక్క సమాచారం కోసం మరింత పరిశీలించగా, పండ్లు మరియు కూరగాయలలో పురుగుమందులకు సంబంధించి ఢిల్లీ హైకోర్టులో దాఖలైన పిల్ గురించిన వార్తని గుర్తించాము. న్యాయమూర్తుల పేర్ల ఆధారంగా — జస్టిస్ జి. రోహిణి మరియు జస్టిస్ రాజీవ్ సహాయ్ ఎండ్లావ్, మేము Google Newsలో శోదించగా, బిజినెస్ స్టాండర్డ్‌లో ప్రచురించబడిన ఫిబ్రవరి 11, 2015 నాటి అసలు PTI వార్తా నివేదికను గురించి తెలుకున్నాము.
ఈ నివేదిక ఇలా పేర్కొంది: “మితిమీరిన పురుగుమందుల వాడకం కారణంగా చాలా దేశాలు భారతదేశం నుండి కూరగాయలు మరియు పండ్ల దిగుమతిని నిషేధించాయి, ఈ రోజు ఢిల్లీ హైకోర్టుకు ఈ విషయం తెలుపబడింది. ప్రధాన న్యాయమూర్తి జి రోహిణి మరియు జస్టిస్ రాజీవ్ సహాయ్ ఎండ్లావ్‌లతో కూడిన ధర్మాసనానికి, కోర్టు నియమించిన అమికస్ క్యూరీ సమర్పించిన నివేదిక ద్వారా అనేక కూరగాయలు మరియు తినే పదార్థాలలో, పురుగుమందుల అవశేషాలు అనుమతించదగిన పరిమితులకు మించి ఉన్నట్లు తెలుపబడింది. ఢిల్లీ అంతటా విక్రయించే తినుబండారాలలో పురుగుమందులను అధికంగా వాడుతున్నప్పటికీ, ఈ ముప్పును అరికట్టేందుకు పెద్దగా చర్యలు తీసుకోలేదని నివేదిక పేర్కొంది. ఈ సమస్య కేవలం ఢిల్లీకి మాత్రమే పరిమితం కాదని, ఇది”పాన్-ఇండియా” సమస్య అని కూడా పేర్కొంది.
అందువల్ల, పండ్లు మరియు కూరగాయలలో పురుగుమందుల వాడకంపై ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన తర్వాత ఈ పురుగుమందుల సమస్య 2014లో ప్రధాన వార్తల్లోకి వచ్చింది. అనేక దేశాల దిగుమతి నిషేధంపై న్యాయమూర్తులు ఆందోళన వ్యక్తం చేశారు.
2017లో మరియు 2021లో ఇదే న్యూస్‌క్లిప్(వార్తా)ని అనేక Facebook పేజీలు ఇక్కడ మరియు ఇక్కడ షేర్ చేయబడినట్లు మేము గమనించాము.
అందువల్ల, కొన్ని దేశాలు భారతదేశం నుండి పండ్లు మరియు కూరగాయల దిగుమతులను నిషేధించాయనే వాదన పాతది, ఇటీవలి జరిగినది కాదు.
మరి కొన్ని Fact Checks:
రేపటి నుంచి ఉచిత విద్యుత్ సబ్సిడీ ఆగిపోతుందని ఢిల్లీ మంత్రి అతిషి వెల్లడించారా? వాస్తవ పరిశీలన