భారత ప్రధాన న్యాయమూర్తి DY చంద్రచూడ్ ‘ప్రజలను వీధుల్లోకి రావాలని మరియు వారి హక్కులను కాపాడుకోవడానికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలియజేయాలని’ కోరుతున్నట్టు ఆయన ఫోటోతో ఉన్న ఒక సందేశం వాట్సాప్‌లో షేర్ చేయబడుతోంది.
“భారత ప్రజాస్వామ్యం సుప్రీం కోర్ట్ జిందాబాద్” అని రాసి ఉన్న శీర్షికతో ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ ఫోటోను షేర్ చేయబడింది. ఫోటో మీద క్రింద విధంగా వ్రాసీ ఉంది.
“మేము భారత రాజ్యాంగాన్ని, భారత ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి మా శాయశక్తులా ప్రయత్నిస్తున్నాము. అయితే మీ సహకారం కూడా చాలా ముఖ్యం. దీని కోసం ప్రజలందరూ సంఘటితమై వీధుల్లోకి వచ్చి తమ హక్కుల కోసం ప్రభుత్వాన్ని అడగాలి. ఈ నియంతృత్వ ప్రభుత్వం ప్రజలను భయపెడుతుంది మరియు బెదిరిస్తుంది, కానీ మీరు భయపడాల్సిన అవసరం లేదు, ధైర్యంగా ఉండండి మరియు ప్రభుత్వాన్ని అడగండి, నేను మీతో ఉన్నాను.”
భారతదేశ సుప్రీం కోర్టు యొక్క అత్యున్నత పదవిని కలిగి ఉన్న అత్యున్నత న్యాయమూర్తి అయిన CJIకి సంబంధించిన పోస్ట్‌లోని విషయాల యొక్క వాస్తవాన్ని తనిఖీ చేయడానికి Digiteye India బృందం వాట్సాప్ అభ్యర్థనను(WhatsApp request) స్వీకరించింది.
FACT CHECK
Digiteye India బృందం అనేక అంశాలలో కోట్/Claim నకిలీదని గుర్తించింది. ఏ సీజేఐ(CJI) కూడా ఇలాంటి అప్పీలు చేయరు.వ్యాకరణం మరియు వాక్యాలలో తప్పులు చూస్తే ఆ పోస్ట్ CJI నుండి వచ్చింది కాదని వెల్లడవుతుంది.“ఇది ఫేక్ ఫార్వార్డ్”. సీజేఐ చంద్రచూడ్ లాంటి వారు అలాంటి పని చేయరు. భారత ప్రధాన న్యాయమూర్తి పైన చేసిన ఇటువంటి తీవ్రమైన దుశ్చర్యలకు తీవ్రమైన చర్యలు తీసుకోవాలి ” అని భారత సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా పునరుద్ఘాటించారు.
వెంటనే CJI మరియు సుప్రీం కోర్ట్ కార్యాలయాలు సోమవారం ఒక పత్రికా ప్రకటనను విడుదల చేసి, సుప్రీం కోర్ట్ యొక్క ఉన్నత న్యాయమూర్తి అటువంటి ప్రకటన ఎప్పుడూ చేయలేదని మరియు ఆన్‌లైన్‌లో ప్రసారం అవుతున్న సందేశాలు(Messages) తప్పుడు సందేశాలని పేర్కొంది. వారిచ్చిన ప్రకటన కాపీని ఇక్కడ చూడండి:
పై ప్రకటన అనువాదం: ఈ సందేశం(Message) యొక్క వాస్తవికతను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది, “సోషల్ మీడియాలో ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ యొక్క ఫైల్ ఫోటోను ఉపయోగించి ఆయనను తప్పుగా ఉటంకిస్తూ( Quote చేస్తు) ప్రచారం చేస్తున్నారనే పోస్ట్ చేయడం భారత సుప్రీంకోర్టు దృష్టికి వచ్చింది.ఇది నకిలీ మరియు దురుద్దేశం కలిగిన పోస్ట్. భారత ప్రధాన న్యాయమూర్తి అటువంటి పోస్ట్‌ను జారీ చేయలేదు మరియు అటువంటి పోస్ట్‌కు అధికారిక అనుమతి ఇవ్వలేదు. ఈ విషయంలో చట్టాన్ని అమలు చేసే అధికారులతో తగిన చర్యలు తీసుకుంటున్నాం.”
Claim/వాదన: భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ ప్రజలు ఏకమై తమ హక్కుల కోసం అధికారులపై పోరాడాలని కోరారు.
నిర్ధారణ: లేదు, జస్టిస్ చంద్రచూడ్ ఎప్పుడూ అలాంటి పోస్ట్‌ను జారీ చేయలేదు మరియు అలాంటి పోస్ట్‌కు అధికారిక అనుమతి ఇవ్వలేదు.
Rating: Totally False —
No, Rs.500 Indian currency notes with ‘*’ symbol are NOT FAKE but genuine; Fact Check]
One comment
Pingback: భారతదేశ వ్యాప్తంగా అన్ని బాణసంచా అమ్మకాలు మరియు వాటి వాడకాన్ని సుప్రీంకోర్టు నిషేధించిందా? Fact