ఈ వీడియోలో సముద్రంలోని ప్లాస్టిక్ వ్యర్థాలను చైనా యంత్రాలు శుభ్రం చేస్తున్నాయా ? వాస్తవ పరిశీలన
వాదన/Claim : సముద్రంలోని ప్లాస్టిక్ వ్యర్థాలను చైనా యంత్రాలు శుభ్రంచేస్తున్నాయనేది వాదన.
నిర్ధారణ /Conclusion : తప్పుగా చూపించే ప్రయత్నం. వాస్తవానికి ‘ది ఓషన్ క్లీనప్’ అనే సంస్థ, ఓషన్ క్లీనప్ సాంకేతికతను రూపొందించి , అమలుపరిచి, దానితో సముద్రాన్ని శుభ్రపరిచే ప్రక్రియను నిర్వహిస్తున్నారు. ఇది నెదర్లాండ్స్‌కు చెందిన ఒక స్వచ్ఛంద సంస్థ సంస్థ(NGO), అంతేగానీ చైనాకు చెందిన యంత్రం లేదా సాంకేతికత కాదు.
రేటింగ్ /Rating : తప్పుగా చూపించే ప్రయత్నం ![]()
******************************************************
వాస్తవ పరిశీలన పూర్తి వివరాలను వీడియోలో చూడండి
లేదా వాస్తవ పరిశీలన కధనం చదవండి
******************************************************
చైనా యంత్రాలు సముద్రం నుండి ప్లాస్టిక్ వ్యర్థాలను శుభ్రం చేస్తున్నాయని సోషల్ మీడియా వినియోగదారులు పేర్కొన్నారు.‘En_chinaNews’ అనే X వినియోగదారుడు ,అటువంటి 48 సెకన్ల వీడియోను ఇలా షేర్ చేసారు: “చైనా యంత్రం సముద్ర ప్లాస్టిక్ వ్యర్థాలను శుభ్రపరుస్తుంది!” ఈ వీడియోలో,నౌకల ద్వారా లాగబడే ఒక పెద్ద తేలియాడే యంత్ర వ్యవస్థ, సముద్ర ప్లాస్టిక్‌ను ఒక నిల్వ ప్రాంతంలోకి సేకరిస్తున్నట్లు వీడియోలో చూపబడింది. వ్యవస్థ/సిస్టమ్ 3, వ్యవస్థ/సిస్టమ్ 4 మరియు ఇతర సిస్టమ్ జోన్లు ఏ విధంగా గుర్తించబడి, పని చేయబడుతున్నాయో వీడియోలో చూడవచ్చు .ఈ పోస్ట్‌ను 505,000ను కంటే ఎక్కువ మంది వీక్షించారు ;దీనిని క్రింద చూడవచ్చు.
Chinese machine cleans marine plastic waste! pic.twitter.com/wR6SYI83qi
— China in English (@En_chinaNews) March 23, 2026

FACT CHECK
DigitEYE India బృందం ఈ వాదనపై దర్యాప్తు చేయాలని నిర్ణయించి,పరిశీలించగా, అది తప్పుగా చూపించే ప్రయత్నం అని కనుగొంది. నెదర్లాండ్స్‌కు చెందిన స్వచ్ఛంద సంస్థ(లాభాపేక్షలేని సంస్థ)సముద్రాన్ని శుభ్రపరిచే ‘ది ఓషన్ క్లీనప్’అనే సాంకేతికత రూపొందించి, ఏర్పాటు చేసి, నిర్వహిస్తున్న వ్యవస్థ/సిస్టమ్‌ను వీడియోలో చూపబడింది.ఇది చైనీస్ యంత్రం లేదా వాళ్ళ సాంకేతికత అని సూచించడానికి ఎటువంటి ఆధారాలు లేవు.
అసలు/ఒరిజినల్ పోస్ట్‌ను పరిశీలించగా,అది కొత్త శీర్షికతో తిరిగి పోస్ట్ చేయబడిందని, ఒరిజినల్ పోస్ట్ ‘The Ocean Cleanup’ సంస్థకు చెందినదని మేము గుర్తించాము. ఒరిజినల్ పోస్ట్ “మా అంచనాల ప్రకారం, ‘System 03’ ఆధారంగా రూపొందించిన పది సిస్టమ్‌లను/వ్యవస్థలను ఉపయోగించి, మొత్తం ‘Great Pacific Garbage Patch’ (ఇందులో 100,000,000 కిలోల ప్లాస్టిక్ ఉంది) మొత్తాన్ని శుభ్రం చేయగలమని మేము ఆశిస్తున్నాము,”అని పేర్కొంది. ఇది సెప్టెంబర్ 20, 2022న అప్లోడ్ చేయబడింది మరియు ఇది చైనీస్ యంత్రమని తెలిపే ఎటువంటి సమాచారాన్ని కలిగి లేదు.
According to our projections, we expect to be able to clean the entire Great Pacific Garbage Patch (containing 100,000,000kg of plastic) using ten systems based on System 03. pic.twitter.com/jeDUnwcCNO
— The Ocean Cleanup (@TheOceanCleanup) September 20, 2022
మేము వీడియోలోని వివిధ కీలక ఫ్రేమ్‌లపై ‘రివర్స్ ఇమేజ్ సెర్చ్’ నిర్వహించి, పూర్తి దృశ్యాలను (పూర్తి ఫుటేజ్ ను) కనుగొన్నాము. ‘The Ocean Cleanup’ YouTube ఛానెల్లో పూర్తి వీడియో ఈ శీర్షికతో అప్లోడ్ చేయబడింది : “The End of the Great Pacific Garbage Patch | The Ocean Cleanup”. ‘Great Pacific Garbage Patch’ను శాశ్వతంగా శుభ్రం చేయడానికి ఉద్దేశించిన మా మొట్టమొదటి పూర్తి స్థాయిలో సముద్రం శుభ్రపరిచే ‘System 03’ వ్యవస్థకు ఇప్పుడు మారుతున్నాము” అని వీడియో వివరణ పేర్కొంది.దీనికి సంబంధించిన స్క్రీన్‌షాట్/వీడియోను క్రింద చూడవచ్చు –

తరువాత, ఆ పోస్ట్‌లో పేర్కొన్నట్లుగా, చైనీస్ యంత్రాలు లేదా సాంకేతికతకు సంబంధించిన ఏదైనా సమాచారం లభిస్తుందేమోనని మేము ‘The Ocean Cleanup’ అధికారిక వెబ్‌సైట్‌ను పరిశీలించాగ, డచ్ ఇంజనీర్ అయిన బోయన్ స్లాట్, 2013లో నెదర్లాండ్స్‌లో ‘ది ఓషన్ క్లీనప్’ను స్థాపించారని మేము తెలుసుకున్నాము. బోయన్ “నదిలో వ్యర్థాలను అడ్డగించడం మరియు గ్రేట్ పసిఫిక్ గార్బేజ్ ప్యాచ్‌ను శుభ్రపరచడం” రెండింటికీ 2021లో “ప్రూఫ్ ఆఫ్ టెక్నాలజీ”ని సాధించారు.”నెదర్లాండ్స్‌లోని రోటర్‌డామ్‌లోని ప్రధాన కార్యాలయంలో ఈ సాంకేతికతను రూపొందించడం, పరీక్ష మరియు నిర్వహణ కార్యకలాపాలన్నీ కూడా చైనా ప్రమేయం లేకుండానే ఈ డచ్ స్వచ్చంధ సంస్థ ద్వారానే నిర్వహించబడుతున్నాయి. బోయన్ స్లాట్ (Boyan Slat) కథనంలోని ఒక భాగాన్ని క్రింద చూడవచ్చు —

వ్యవస్థ/సిస్టమ్ 03 పరంగా, ఈ సాంకేతిక “ది ఓషన్ క్లీనప్” ద్వారా రూపొందించబడి,అమలు చేయబడి, నిర్వహించబడుతున్న సముద్రం నుండి ప్లాస్టిక్‌ను తొలగించి శుభ్రపరిచే వ్యవస్థ, అని అధికారిక వెబ్సైట్ద్వారా తెలుకున్నాము .దీనిని ఆగష్టు 2023లో గ్రేట్ పసిఫిక్ గార్బేజ్ ప్యాచ్‌లో అమలు చేశారు.ప్లాస్టిక్‌ను తొలగించడానికి, అది “అత్యధిక సాంద్రత గల ప్లాస్టిక్ ఉన్న ప్రాంతాల వైపు మళ్లించడానికి పర్యవేక్షణ డేటా మరియు AI మోడలింగ్‌ను” ఉపయోగిస్తుంది. System 03 “Maersk Tender (మెయర్స్క్ టెండర్) మరియు Maersk Trader(మెయర్స్క్ ట్రేడర్) అనే రెండు నౌకల ద్వారా GPGPకి తరలించబడింది,” మరియు ఇది “ప్రస్తుతం గరిష్టంగా సుమారు 2.2 కి.మీ. పొడవు వరకు వేళ్ళగలదు.” నివేదికలోని ఒక భాగాన్ని క్రింద చూడవచ్చు:

5055“సముద్ర ప్లాస్టిక్ శుభ్రపరిచే చైనీస్ యంత్రం” కోసం అంతర్జాలంలో అన్వేషించగా, వాదనలో షేర్ చేయబడిన వీడియోకు సరిపోలే ఫలితాలు లభించలేదు. అనేక అవార్డులను గెలుచుకున్న “బ్లూ సర్కిల్” వంటి ప్రత్యేక ప్రక్రియలు చైనా ఉన్నప్పటికీ, వాటికీ ‘ది ఓషన్ క్లీనప్’ కంపెనీ యొక్క సముద్ర శుద్ధి సాంకేతికతతో సంబంధం లేదు.
కాబట్టి , తప్పుగా చూపించే ప్రయత్నం చేయడం జరిగింది.
******************************************************
మరి కొన్ని వాస్తవ పరిశీలన కధనాలు:
భారత రాజధాని ఢిల్లీ త్వరలో ఇంద్రప్రస్థగా పేరు మారబోతుందా?వాస్తవ పరిశీలన

