చైనా రష్యా యొక్క ఉచిత క్యాన్సర్ వ్యాక్సిన్‌ను ఆమోదించి, ఒప్పందాలపై సంతకాలు చేయాలని యోచిస్తోందా? వాస్తవ పరిశీలన
వాదన/Claim: చైనా రష్యా యొక్క ఉచిత-క్యాన్సర్ వ్యాక్సిన్‌ను ఆమోదించాలని, మరియు ఈ విషయంపై రష్యన్ సంస్థలతో పరస్పర సంబంధాలపై సంతకం చేయాలని యోచిస్తోందని ,ఇది అమెరికా మరియు యూరప్ ఫార్మా పరిశ్రమను నాశనం చేస్తుందనేది వాదన.
నిర్ధారణ/Conclusion::ఈ వాదన పూర్తిగా అబద్ధం/అవాస్తవం.చైనా ఆమోదం లభించిందని నిర్ధారించడానికి ఎలాంటి అధికారిక ప్రకటనలు లేవు. రష్యా మరియు చైనా క్యాన్సర్ చికిత్సలో కలిసి పనిచేస్తున్నాయి. జనవరి 9, 2026న, వ్యాక్సిన్ అభివృద్ధిపై సంయుక్తంగా అధ్యయనం చేయడానికి మరియు సహకారాన్ని బలోపేతం చేయడానికి చైనా మరియు రష్యా అంగీకరించాయి. ప్రస్తుతానికి, సంయుక్త క్యాన్సర్ వ్యాక్సిన్ ఆమోదం మరియు ఉత్పత్తిపై ఎలాంటి అధికారిక నివేదికలు లేవు.
రేటింగ్ /Rating: పూర్తిగా అబద్ధం– ![]()
రష్యా యొక్క ఉచిత -క్యాన్సర్ వ్యాక్సిన్‌ను చైనా ఆమోదించాలని యోచిస్తోందని అనేక మంది సోషల్ మీడియా వినియోగదారులు పేర్కొన్నారు. X వినియోగదారుడు ‘jacksonhinklle’ అలాంటి వాదన చేస్తూ, చైనా రష్యన్ సంస్థలతో పరస్పర ఔషధ పరిశ్రమల సంబంధాలపై సంతకం చేస్తుందని,మరియు రెండు సంవత్సరాలలో $1 ట్రిలియన్ ఆదాయాన్ని సంపాదించే వ్యాక్సిన్లను సంయుక్తంగా ఉత్పత్తి చేస్తుందని, దీనితో US మరియు యూరోపియన్ ఔషధ విలువ $2.6 ట్రిలియన్ల వరకు నాశనం అవుతుందని ఆరోపించాడు.పోస్ట్ ను క్రింద చూడవచ్చు:
🚨🇨🇳🇷🇺 BREAKING: China plans to approve Russia’s Free-Cancer Vaccine and sign mutual pharmaceutical ties with Russian firms that will destroy $2.6 trilion US and European worth pharmaceutical production, firms and companies. pic.twitter.com/7yXsLTiTKQ
— Jackson Hinkle 🇺🇸 (@jacksonhinklle) January 11, 2026

ఇతర వినియోగదారులు కూడా ఇలాంటి వాదనలనే ఇక్కడ షేర్ చేసారు.
వాస్తవ పరిశీలన
DigitEYE India బృందం, ఈ వాదనను దర్యాప్తు చేయాలని నిర్ణయించి,పరిశీలించగా, అది అబద్ధమని తేల్చింది. రష్యా యొక్క ఉచిత -క్యాన్సర్ వ్యాక్సిన్‌ను ఆమోదించడానికి మరియు ఒప్పందాలపై సంతకం చేయడానికి చైనా ప్రణాళిక వేసిందని ధృవీకరించే విశ్వసనీయ నివేదికలు లేదా ఆధారాలు లేవు. వ్యక్తిగతీకరించబడిన (పర్సనలైజ్డ్ )క్యాన్సర్ చికిత్సపై రెండు దేశాలు కలిసి పనిచేస్తున్నప్పటికీ, చైనా ఇంకా అటువంటి ఆమోదం ఇంకా తెలుపలేదు.
వివరాలు :
ఈ వాదన గురించి మరింత తెలుసుకోవడానికి, మేము మొదటగా “చైనా రష్యా యొక్క ఉచిత క్యాన్సర్ వ్యాక్సిన్‌ను ఆమోదించింది” అనే పదబంధంతో అంతర్జాలంలో అన్వేషించగా, చైనా రష్యన్ క్యాన్సర్ వ్యాక్సిన్‌ను ఆమోదించినట్లు ఎటువంటి నిర్ధారణ లేదా అధికారిక ప్రకటనలు లభించలేదు.
జూన్ 26, 2024న రాయిటర్స్ ప్రచురించిన ఒక నివేదిక ప్రకారం, మానవ ప్రయోగాల కోసం చైనా ఒక విప్లవాత్మక mRNA క్యాన్సర్ చికిత్సకు ఆమోదం తెలిపింది. CSPC యొక్క SYS6020 అనేది “క్లినికల్ ట్రయల్స్ కోసం ఆమోదం పొందిన ప్రపంచంలోనే మొట్టమొదటి mRNA-LNP-ఆధారిత సెల్ థెరపీ ఉత్పత్తి” అని, మరియు ఇది మైలోమా కణాలను లక్ష్యంగా చేసుకుని అతి తక్కువ దుష్ప్రభావాలతో నాశనం చేయగలదని ఆ నివేదిక పేర్కొంది. రష్యాతో సంబంధించి ఎలాంటి ఆమోదాలు నమోదు కాలేదు. నివేదికలోని కొంత భాగాన్ని క్రింద చూడవచ్చు

దీని తరువాత, రష్యా లక్ష్యంగా చేసుకున్న క్యాన్సర్ చికిత్సల విషయంలో పురోగతి సాధిస్తోందని, అందులో మెలనోమా కోసం అభివృద్ధి చేస్తున్న mRNA వ్యాక్సిన్ (నియోఆంకోవాక్) కూడా ఉందని, ఇది “2026 నాటికి మానవ వినియోగానికి ఆమోదం పొందవచ్చని” ఒక నివేదిక ద్వారా మేము తెలుసుకున్నాము.రష్యాకు చెందిన ఎంటెరోమిక్స్ ఇప్పటికే “క్యాన్సర్‌కు నివారణ” అని మరియు సామూహిక వినియోగానికి సిద్ధంగా ఉందని వస్తున్న పుకార్లను సీఈడీఎంఓ నివేదిక ఖండించింది.ఈ నివేదిక చైనాతో భాగస్వామ్యాల గురించి గానీ, లేదా మరేదైనా దేశం దీనిని స్వీకరించడం గురించి గానీ ప్రస్తావించలేదు.
చివరగా, జనవరి 9, 2026న, TV BRICS ప్రచురించిన ఒక నివేదికలో, మాస్కో మరియు చైనా శాస్త్రవేత్తలు “అత్యాధునిక కణ సాంకేతికతలు మరియు జీనోమ్ సవరణను ఉపయోగించి నిర్దిష్ట (పర్సనలైజ్డ్ )క్యాన్సర్ చికిత్సలపై సహకారాన్ని బలోపేతం చేయడానికి అంగీకరించారు” అని పేర్కొన్నారు. నివేదిక ప్రకారం, చర్చల ప్రధాన అంశం “నిర్దిష్ట (పర్సనలైజ్డ్ ) క్యాన్సర్ నిరోధక వ్యాక్సిన్లను అభివృద్ధి చేయడం మరియు క్లినికల్ ప్రాక్టీస్‌లో వినూత్న కణ-ఆధారిత చికిత్సలను వర్తింపజేయడం”. ఉమ్మడి వ్యాక్సిన్ ఉత్పత్తి, ఆమోదాలు లేదా ఆదాయ భాగస్వామ్యం గురించి ఏ అధికారిక ప్రకటనలలో ప్రస్తావించబడలేదు. ఈ నివేదికలోని కొంత భాగాన్ని క్రింద చూడవచ్చు :

అమెరికా మరియు యూరప్ యొక్క $2.6 ట్రిలియన్ల ఫార్మా పరిశ్రమను పతనం/నాశనం చేస్తుందనే వాదనలో “ఫార్చ్యూన్ బిజినెస్ ఇన్సైట్ నివేదిక ప్రకారం, 2024 నాటికి ప్రపంచ ఫార్మాస్యూటికల్ మార్కెట్ వార్షికంగా 1.8 ట్రిలియన్ డాలర్లుగా, 2025 నాటికి 1.9 ట్రిలియన్ల డాలర్లు ఉంటుందని అంచనాకు సంబంధించిన సమాచారం/గణాంకాలు” లేవు.
అందువల్ల, $2.6 ట్రిలియన్ల పతనం యొక్క వాదన గణాంకాల పరంగా అస్థిరంగా ఉంది ఎందుకంటే అది వాస్తవ మార్కెట్ పరిమాణాన్ని ధిక్కరించే విధంగా ఉంది.
కాబట్టి, ఈ వాదన అవాస్తవం మరియు చైనా నుండి ఎలాంటి ఆమోదం లభించలేదు.
******************************************************
మరికొన్ని వాస్తవ పరిశీలన కధనాలు:
దక్షిణ కొరియా ఇజ్రాయెల్ పర్యాటకులను తమ దేశంలోకి ప్రవేశించకుండా నిషేధించిందా? వాస్తవ పరిశీలన

