మోదీ ప్రభుత్వం రైలు పట్టాలను సోలార్ ప్యానెల్స్‌తో విద్యుత్ కేంద్రాలుగా మారుస్తోందా? వాస్తవ పరిశీలన
వాదన /Claim: మోదీ ప్రభుత్వం రైలు పట్టాల మధ్య సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేయడం ద్వారా వాటిని విద్యుత్ కేంద్రాలుగా మారుస్తోందనేది వాదన .
నిర్ధారణ /Conclusion: తప్పుగా చూపించే ప్రయత్నం .ఈ ఆవిష్కరణ భారతదేశానికి చెందినది కాదు, స్విట్జర్లాండ్‌కు చెందిన ‘Sun-Ways’ అనే స్టార్టప్ సంస్థకు చెందినది..
రేటింగ్/Rating:తప్పుగా చూపించే ప్రయత్నం
.
*********************************************************************************
వాస్తవ పరిశీలన పూర్తి వివరాలను వీడియోలో చూడండి ![]()
లేదా వాస్తవ పరిశీలన కధనం చదవండి ![]()
****************************************************************
జహిద్ పట్కా (@zahidpatka) చేసిన ఒక వైరల్ పోస్ట్ ప్రకారం, మోదీ ప్రభుత్వం సోలార్ ప్యానెళ్లను ఉపయోగించి రైల్వే ట్రాక్‌లను విద్యుత్ కేంద్రాలుగా మారుస్తోంది. ఈ ప్రక్రియలో రైలు రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగదని, ‘సన్-వేస్’ (Sun-Ways) అనే భారతీయ స్టార్టప్ ఈ ఆవిష్కరణను చేపట్టిందని ఆ పోస్ట్ పేర్కొంది. పోస్ట్‌ను కింద చూడవచ్చు.
Unbeatable India 🇮🇳 #GoGreen#GameChanger
PM @narendramodi Govt
is turning train tracks into power plants — without halting a single train.
India startup Sun-Ways is deploying removable solar panels directly between railway tracks. and clean energy keeps flowing.@PMOIndia pic.twitter.com/R49EkbnWu2— Zahid Patka (Modi Ka Parivar) (@zahidpatka) June 29, 2025
పోస్ట్ ఈ విధంగా ఉంది :
” #GoGreen #GameChanger: ప్రధాని @narendramodi ప్రభుత్వం రైలు రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండానే, రైల్వే పట్టాలను విద్యుత్ కేంద్రాలుగా మారుస్తోంది. భారతీయ స్టార్టప్ ‘Sun-Ways’, రైల్వే పట్టాల మధ్య నేరుగా అమర్చగలిగే సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేస్తూ స్వచ్ఛమైన విద్యుత్ ఉత్పత్తికి మార్గం సుగమం చేస్తోంది. @PMOIndia”
మరొక లింక్డ్‌ఇన్ (LinkedIn) వినియోగదారుడు అదే చిత్రాన్ని షేర్ చేశారు:

పోస్ట్ లింక్‌ను ఇక్కడ చూడవచ్చు:
వాస్తవ పరిశీలన:
‘డిజిటై’ బృందం ‘ఆ వీడియోలోని కీలక దృశ్యాలను (key frames) సేకరించి ‘గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్’ ద్వారా పరిశీలించగా, ఆ చిత్రం స్విట్జర్లాండ్‌కు చెందినదని తేలింది; అక్కడ 2021లో స్థాపించబడిన ‘Sun-Ways’ అనే స్టార్టప్ ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టింది.’మొట్ట మొదటి సరిగా Greater Geneva Bern Area’ సంస్థ 2024లో తమ కథనంలో ఈ ఆవిష్కరణ గురించి ప్రచురించింది.
వివరాలు:
ఇప్పటికే ఉన్న రైలు మౌలిక సదుపాయాలను ఉపయోగించి సౌరశక్తి ఉత్పత్తిని విస్తరించాలనే సన్-వేస్ యొక్క విస్తృత ప్రాజెక్ట్లోఇది ఒక భాగం. 2023లో న్యూచాటెల్‌లో ఒక పైలట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించిన సన్-వేస్ యొక్క మునుపటి కృషికి ఆధారంగా ఈ కొత్త ఆవిష్కరణ నిర్మాణించబడింది.
నివేదికలోని నుండి ఒక చిత్రం ఇక్కడ చూడవచ్చు :

పశ్చిమ స్విట్జర్లాండ్‌లోని ‘బ్యూట్స్’ (Buttes) అనే చిన్న గ్రామంలో, రైల్వే పట్టాల 100 మీటర్ల భాగంపై ‘సన్-వేస్’ (Sun-Ways) సంస్థ ఏకంగా 48 సోలార్ ప్యానెళ్లను ఎలా ఏర్పాటు చేసిందో కూడా ఏప్రిల్ 2025లో NDTV నివేదించింది. ఆ కథనానికి సంబంధించిన లింక్‌ను ఇక్కడ చూడవచ్చు

యూరో న్యూస్ కూడా తమ కథనంలో ఈ విషయాన్నే పునరుద్ఘాటించింది. “లౌసాన్‌లోని స్విస్ ఫెడరల్ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్ అయిన EPFL సహాయంతో, తొలగించగల వ్యవస్థకు పేటెంట్ పొందిన మొదటి సంస్థ సన్-వేస్” అని అందులో పేర్కొంది. అందువల్ల, వైరల్ అయిన ఆ పోస్ట్‌లో పేర్కొన్నట్లుగా సన్-వేస్ ఒక భారతీయ స్టార్టప్ కాదని, నిజానికి అది ఒక స్విస్ స్టార్టప్ అని రుజువవుతోంది.

అంతేకాకుండా, ఈ విషయంపై భారతీయ రైల్వేల అధికారిక యంత్రాంగం నుండి ఇప్పటివరకు ఎటువంటి ప్రకటన వెలువడలేదు. దేశవ్యాప్తంగా స్వచ్ఛమైన ఇంధన వినియోగాన్ని పెంచేందుకు ప్రణాళికలు ఉన్నప్పటికీ, రైల్వే పట్టాల మధ్య సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేయడం గురించి ప్రస్తుతానికి ఎటువంటి సమాచారం లేదు.
వినియోగదారులు దీనిని తప్పుగా సవరించి,తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి ఈ చిత్రాన్ని మార్చారు.
కాబట్టి, ఈ వాదన అవాస్తవం.
________________________________________________________________________________
మరికొన్ని వాస్తవ పరిశీలన కధనాలు:

